• తాజా వార్తలు
  •  

అసలు ఫోన్ బ్యాటరీ పేలడానికి కారణమేంటి?

   సెల్ ఫోన్, ల్యాప్టాప్స్ లో బ్యాటరీలు ఓవర్ హీట్ అయిపోవడం అందరికీ అనుభవమే. ఇక సెల్ ఫోన్ బ్యాటరీలు పేలిపోవడంతో శాంసంగ్ లాంటి పేరుమోసిన కంపెనీ కూడా తలవంపులు పడాల్సి వచ్చింది.  అసలు బ్యాటరీ ఎందుకు ఇలా అవుతుందని రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది కెమిస్ట్రీ లో నోబెల్ బహుమతి గెలిచిన క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నిక్ ను ఇందుకు ఉపయోగిస్తున్నారు.  స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ కి చెందిన శాస్త్రవేత్తల టీమ్ క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నిక్ ను ఉపయోగించి అణువుల స్థాయిలోని అతిచిన్న కణాలను కూడా హై రిజల్యూషన్ లో ఫోటోలు తీస్తున్నారు. బ్యాటరీ ల్లో ఉండే డెండ్రైట్స్ అనే చేతివేళ్లలాంటి అతిచిన్న పార్టికల్స్ ను ఫోటోలు తీశారు. ఆరు ముఖాలు కలిగిన ఈ నిర్మాణాలను స్టడీ చేయడం ద్వారా బ్యాటరీలో అణువణువులో ఏం జరుగుతోంది గుర్తించవచ్చని చెబుతున్నారు.  కాబట్టి  బ్యాటరీ ఏ భాగంలో హీటెక్కి అది పేలిపోవడం లేదా విపరీతంగా వేడెక్కుతుందో ఐడెంటిఫై చేస్తారు. దీంతో ప్రత్యేకించి ఆ భాగంలో హీట్ తగ్గించేలా డిజైన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి

జన రంజకమైన వార్తలు