• తాజా వార్తలు

ఫ్లాష్‌ను కిల్ చేస్తున్నందుకు అడోబ్‌కు థాంక్స్ చెప్పాలి... ఎందుకంటే!

అడోబ్ ఫ్లాష్‌... కంప్యూట‌ర్‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్లంద‌రికి ఈ పేరు తెలుసు. ఎందుకంటే ఏదైనా వీడియో ప్లే కావాలంటే క‌చ్చితంగా ఫ్లాష్ ప్లేయర్ ఉండాల్సిందే. కంప్యూట‌ర్లు బాగా విస్త‌రించ‌క‌ముందు వీడియోలు ప్లే చేయ‌డం చాలా చాలా క‌ష్టం ఉండేది. ఒక‌వేళ వీడియోలు ప్లే చేయ‌గ‌లిగినా.. ఫ్లాష్ వ‌ల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చేది. వీడియోలు స‌రిగా ప్లే కాక‌పోవ‌డం.. మ‌ధ్య‌లో ఆగిపోవ‌డం జ‌రిగేది. అంతేకాదు ప్లాష్‌ను ఇన్‌స్టాల్ చేసుకోకుండా మీకు వీడియోలు చూడ‌డం కుదిరేది. కాదు. పోని ఫ్లాష్ ఇన్‌స్టాల్ చేసుకుందాం అనుకుంటే.. ఇదో పెద్ద ప్రాసెస్‌లా ఉండేది. ఎన్నో నియ‌మ నిబంధ‌న‌లు. అన్ని అడ్డంకులు దాటి ముందుకెళ్లినా  వీడియోలు స‌రిగా ప్లే అవుతాయ‌న్న గ్యారెంటీ లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ కాకుండా ఫ్లాష్ పాత కాలంలోనే ఉండిపోయింది. 

2020 క‌ల్లా ఉండ‌దు
ఫ్లాష్‌తో విసిగి వేసారి పోయిన టెకీల‌కు అడోబ్ చ‌ల్ల‌టి క‌బురు చెప్పింది. 2020 నాటి క‌ల్లా ఫ్లాష్‌ను పూర్తిగా ఆపేస్తున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. ఫ్లాష్ స్థానంలో పూర్తి అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకురాబోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించింది. నిజంగా ఇది పెద్ద వార్తే. ఎందుకంటే ఇప్ప‌టికీ ఫ్లాష్ వ‌ల్ల ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్ లాంటి ఇంట‌ర్నెట్ దిగ్గ‌జాలే ఫ్లాష్‌తో వేగ‌లేక‌.. డిఫాల్ట్‌గా ఈ సాఫ్ట్‌వేర్‌ను బ్లాక్ చేసేశాయి. మ‌న‌కు కావాలంటే  డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవాల్సి వ‌స్తోంది. తాజాగా అడోబ్ ప్ర‌క‌ట‌న‌తో వినియోగ‌దారుల నెత్తి మీద పాలు పోసినట్లు అయింది. ఎందుకంటే అడోబ్ కొత్త వెర్ష‌న్ తీసుకు రావ‌డం వ‌ల్ల ప్ర‌త్యేకించి ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం, వీడియోలు ఆగిపోవ‌డం లాంటి ఇబ్బందులు ఉండ‌వు. 2020 క‌ల్లా ఈ ఫ్లాష్ కష్టాలు గ‌ట్టెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

హెచ్‌టీఎంఎల్ 5
ఫ్లాష్‌తో బాధ‌లు ప‌డ‌లేక‌పోతున్న టెక్ సంస్థ‌ల‌కు హెచ్‌టీఎంఎల్ 5 సాఫ్ట్‌వేర్ పెద్ద వ‌రంలా దొరికింది. ఫ్లాష్‌ను ప‌క్క‌న‌పెట్టేసి ఈ సాఫ్ట్‌వేర్‌కు షిప్ట్ అయిపోయాయి ఈ సంస్థ‌లు. చాలా కంపెనీలు హెచ్‌టీఎంఎల్ 5కు ఫేవ‌ర్‌గా ముందుకు క‌దులుతున్నాయి. ఫ్లాష్ ఎంత‌గా ఇబ్బంది పెట్టిందో యాపిల్ మాజీ సీఈవో, దివంగ‌త స్టీవ్ జాబ్స్ చాలా బాగా చెప్పారు. ఆయ‌న ఏకంగా 1700 ప‌దాలతో ఒక ఎస్సైయ్యే రాసేశారు. ఫ్లాష్ సాఫ్ట్‌వేర్‌లో చాలా యార్ట్ క‌మింగ్స్ ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. టెక్నాల‌జీ ఇంత‌గా పెరిగిన త‌ర్వాత కూడా ఫ్లాష్ లాంటి ఔట్ డేటెడ్ వెర్ష‌న్‌ను వాడ‌డం స‌రైన పద్ధ‌తి కాద‌నేది సాఫ్ట్‌వేర్ నిపుణుల అభిప్రాయం. ఏదేమైనా కొన్నేళ్ల‌లో ఫ్లాష్ పూర్తిగా మాయం కావ‌డం ఖాయం. 

జన రంజకమైన వార్తలు