• తాజా వార్తలు
  •  

ఫోన్ ప‌క్క‌న పెట్టుకుని ప‌డుకునే వారికోసం ఈ ఆర్టిక‌ల్‌

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉందంటే చాలు మ‌నలో చాలామంది అదే లోకంగా ఉంటారు. ఎక్క‌డికి వెళ్లినా ఫోన్ మాత్రం వ‌ద‌ల‌రు. దానికి కాస్త గీత ప‌డినా విల‌విల్లాడిపోతారు. ఇక కింద‌ప‌డితే వాళ్ల బాధ చెప్ప‌క్క‌ర్లేదు. ఏదో చంటిబిడ్డ‌ను ప‌క్క‌న‌పెట్టుకున్న‌ట్లు నిద్ర‌పోయే స‌మ‌యంలోనూ ఫోన్‌ను మాత్రం వ‌ద‌ల‌రు. అయితే ఈ వార్త చ‌దివితే మీరు క‌చ్చితంగా ఫోన్‌ను ఆమ‌డ దూరం పెట్ట‌డం గ్యారెంటీ. ఫోన్ ప‌క్క‌న లేదా ప‌క్క‌లో పెట్టుకుని ప‌డుకునే వారికి త్వ‌ర‌గా క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కేవ‌లం క్యాన్స‌ర్ మాత్ర‌మే కాదు ఎన్నో ర‌కాల రుగ్మ‌త‌ల‌కు ఈ ఫోనే కార‌ణ‌మ‌నేది వారిలో ప‌రిశోధ‌న‌లో తేలిన అంశం.

రేడియేష‌న్ ప్ర‌భావంతో..
ఫోన్ అంటేనే ప‌ని చేసేది రేడియో త‌రంగాల ద్వారా.. ఈ స్నిగ‌ల్ లేకుంటే ఫోన్ ఉన్నా బొమ్మ కిందే లెక్క. అయితే రేడియో త‌రంగాలు చాలా బ‌ల‌మైన‌వి. ప్ర‌భావంతమైన‌వి. వీటికి వీలైనంత దూరంగా ఉండ‌డం శ్రేయ‌స్క‌రం. అందుకే ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్న‌ప్పుడు మాట్లాడొద్ద‌ని చెబుతారు.  స‌మ‌యంలో ఈ త‌రంగాలు మరింత బ‌లంగా విడుద‌ల‌వుతాయి. ఇది ఫోన్‌పై ప్ర‌భావం చూపించి పేలుడు, పొగ‌లు రావ‌డం లాంటివి సంభ‌వించొచ్చు. ఈ విష‌యాల‌న్నిటిని ప‌రిశోధించిన కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ ఫోన్‌ను వీలైనంత దూరంగా పెట్టండి అని చెబుతోంది. వీలైనంత త‌క్కువ‌గా ఫోన్ వాడ‌డ‌మే దీనికి మంద‌ని ఆ సంస్థ మాట .

క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం
రేడియేష‌న్ ఎక్కువ కావ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. 2009లో యూనివ‌ర్సిటీ ఆఫ్ బెర్క్‌లె ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పింది.  ముఖ్యంగా రేడియేష‌న్ వ‌ల్ల వ‌చ్చే అతి పెద్ద ప్ర‌మాదాల్లో క్యాన్స‌ర్ కూడా ఉంద‌ని ఆ యూనివ‌ర్సిటీ చెప్పింది.. ఇప్ప‌టికే ఇలా చాలామంది క్యాన్స‌ర్ బారిన ప‌డ్డార‌ని అందుకే ఇప్ప‌టికైనా వినియోగ‌దారులు ఫోన్ వాడే విష‌యంలో మేలుకోవాల‌ని ఆ యూనివ‌ర్సిటీ మాట‌. మొబైల్ మాన్యుఫాక్చ‌ర్లు కూడా ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని త‌మ మొబైల్ డివైజ్‌ల‌తో పాటు ఇచ్చే సెట్‌లో హెచ్చ‌రిస్తున్నార‌ని ఆ సంస్థ తెలిపింది. వీలైనంత ఎక్కువ‌గా ఫోన్ వాడ‌కం త‌గ్గిస్తేనే బెట‌ర్ అని నిపుణులు అంటున్నారు. కేవ‌లం క్యాన్స‌ర్ మాత్ర‌మే  కాదు హియ‌రింగ్ ప్రాబ్ల‌మ్స్ లాంటి ప్ర‌మాదాలు ఉన్న నేప‌థ్యంలో వినియోగ‌దారులు జాగ్ర‌త్త‌గా ఉండ‌డం చాలా అవ‌స‌రం. 

జన రంజకమైన వార్తలు