• తాజా వార్తలు
  •  

ఫోన్ పోతే ట్రాక్ చేయ‌డం సంక్లిష్టం అవ‌బోతోంది.. అందుకే కొన్ని జాగ్ర‌త్త‌లు 

ఫోన్ పోతే ఏం చేస్తాం?  కాస్ట్లీ ఫోన్ అయితే పోలీస్ కంప్ల‌యింట్ చేస్తాం.  పోలీసులు IMEI నెంబ‌ర్ ద్వారా ఫోన్ ఎక్క‌డుందో ట్రేస్ చేయ‌గ‌లుగుతారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఫోన్ కొట్టేసిన‌వాళ్లు IMEI  నెంబ‌ర్‌ను టాంప‌ర్ చేసేస్తున్నారు. అంటే మీ ఫోన్ పోతే ఇక దాని ఆచూకీ క‌నుక్కోవ‌డం ఇంచుమించు ఇంపాజిబుల్ అన్న‌మాట‌. అందుకే గ‌వ‌ర్న‌మెంట్ ఐఎంఈఐ నెంబ‌ర్లు ఆల్ట‌రేష‌న్ చేసేవారి మీద సివియ‌ర్ యాక్ష‌న్ తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. 

 IMEI  అంటే International Mobile Equipment Identity.  ఇదొక 15 అంకెల యూనిక్ కోడ్‌. ప్ర‌తి సెల్‌ఫోన్‌కు ప్ర‌త్యేక‌మైన   IMEI  నెంబ‌ర్ ఉంటుంది. దీన్ని  మార్చేయ‌డానికి ఇప్ప‌డు ఉచాలా ఈజీ టూల్స్ అందుబాటులోకి వ‌చ్చేశాయి.    flasher అనే టూల్‌తో  ఐఎంఈఐ నెంబ‌ర్‌ను చ‌లా ఈజీగా టాంప‌ర్ చేసేయొచ్చు.  2వేల నుంచి 5వేల‌కు దొరికే ఈ డివైస్  వైఫై రూట‌ర్‌లా ఉంటుంది. దీంతో ఫోన్‌ను కంప్యూట‌ర్‌కు క‌నెక్ట్ చేసి ఐఎంఈఐ నెంబ‌ర్‌ను మార్చేయొచ్చు.  ఫోన్లు దొంగిలించిన వాళ్‌లు ఇలా IMEI  నెంబ‌ర్‌ను మార్చేసి మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు.  200 ఇస్తే ఐఎంఈఐ నెంబ‌ర్ ఆల్ట‌రేష‌న్ చేసేవాళ్లున్నారు.  ఢిల్లీలో ఇలాంటి గ్యాంగ్‌ను ప‌ట్టుకుని ఆరా తీస్తే కోటీ 35 ల‌క్ష‌ల విలువైన  735 ఫోన్ల ఐఎంఈఐ నెంబ‌ర్లు ఆల్ట‌ర్ చేసిన‌ట్లు తెలిసింది.  ఢిల్లీలోనే మ‌రోచోట కోటి రూపాయ‌ల విలువైన మొబైల్‌, ఐపాడ్ల‌కు కూడా ఇలాగే  ఐఎంఈఐ నెంబ‌ర్లు మార్చేశారు.  
ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? 
* ఫోన్‌ను పోగొట్టుకుండా జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి.  ముఖ్యంగా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఫోన్లు మాట్లాడేట‌ప్పుడు చుట్టుప‌క్క‌ల గ‌మ‌నించుకోవాలి. 
ఫోన్ దొంగ‌తనాన్ని ఆప‌లేక‌పోయినా ఎట్‌లీస్ట్ అందులో ఉండే సెన్సిటివ్ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డం చాలా ఇంపార్టెంట్‌. స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాక మ‌న బ్యాంకింగ్ కూడా దానితోనే చేస్తున్నాం కాబ‌ట్టి ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.  
* క్వాల్‌కామ్ కంటే మీడియాటెక్ ప్రాసెస‌ర్ల‌తో ప‌నిచేసే స్మార్ట్‌ఫోన్ల ఐఎంఈఐ నెంబ‌ర్లు ఆల్ట‌ర్ చేయ‌డం చాలా ఈజీ. కాబ‌ట్టి ఈ ప్రాసెస‌ర్లున్న‌ఫోన్లు వాడేవారు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. 
* మీ స్మార్ట్‌ఫోన్‌కు లాక్ త‌ప్ప‌నిస‌రి. అది ఎంత స్ట్రాంగ్‌గా ఉండే అంత మంచిది. మీ పేరు, పిల్ల‌ల పేర్లతో ఉండే ప్యాట్ర‌న్స్ పెట్టుకుంటే మీ గురించి తెలిసిన‌వాళ్లు ఎవ‌రైనా మీ ఫోన్ కొట్టేస్తే వాళ్లు ఈజీగా పాస్వ‌ర్డ్ గెస్ చేయ‌వ‌చ్చు. 
* బ్యాంక్ అకౌంట్స్‌, పాస్‌వ‌ర్డ్‌లాంటి ప‌ర్స‌న‌ల్ ఇన్ఫోను ఫోన్లో సేవ్ చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌. 
*  మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే  మొబైల్ ట్రాకింగ్ ఫీచ‌ర్‌ను మ‌స్ట్‌గా యాక్టివేట్ చేసుకోండి.  దీనివల్ల మీ ఫోన్ యాక్టివ్‌గా ఉన్నంత‌వ‌ర‌కు మీరు దాన్ని యాక్సెస్ చేయ‌గ‌లుగుతారు. ఒక‌వేళ ఫోన్ పోయినా మీరు రిమోట్ యాక్సెస్ ద్వారా దానిలో ఉన్న డేటాను ఎరేజ్ చేసుకోవ‌చ్చు. 
* త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంది క‌దా అని సెకండ్ హ్యాండ్ ఫోన్స్ తెలియ‌నివాళ్ల ద‌గ్గ‌ర కొనొద్దు.  ఎందుకంటే అది ఆల్ట‌ర్ చేసిన ఫోన్ అయితే మీరు ఇబ్బంది ప‌డ‌తారు.  
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు