• తాజా వార్తలు
  •  

ఏంటి ఓఎల్ఈడీ? ఓఎల్ఈడీ ఫోన్‌కు అంత డ‌బ్బు పెట్ట‌డం ఎందుకు?

ఓఎల్ఈడీ... సాంకేతిక రంగంలోకి దూసుకొచ్చిన స‌రికొత్త టెక్నాల‌జీ. ఎల్ఈడీ  టీవీల గురించి అంద‌రికి తెలుసు. మంచి క్లారిటీతో పిక్చ‌ర్ అందిస్తూ టీవీల ట్రెండ్‌నే మార్చేశాయి. మామూలు టీవీలు కొన‌డానికి ఇప్పుడు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌ట్లేదు. ఎల్ఈడీ టీవీల‌నే ప్రిఫ‌ర్ చేస్తున్నారు. ఎల్ఈడీ స్థానంలో ఇప్పుడు ఓఎల్ఈడీ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డ‌యోడ్స్‌) టెక్నాల‌జీ వ‌చ్చింది.  స్మార్ట్‌ఫోన్ రంగంలో ఇప్పుడిదో పెద్ద సంచ‌ల‌నం. మ‌రి ఏంటి ఓఎల్ఈడీ? ఈ టెక్నాల‌జీ వాడిన ఫోన్ల‌ను మ‌నం ఎందుకు అంత డ‌బ్బు పెట్టి కొనాలి?

మ‌రింత శ‌క్తివంతంగా..
ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ  టీవీలు అంద‌రికి తెలుసు. అయితే ఓఎల్ఈడీ  ప్ర‌త్యేక‌త ఏంటంటే ఎల్ఈడీతో పోలిస్తే ఇంకా స‌న్న‌ని మాలిక్యుల్స్‌తో త‌యార‌వుతుంది. ఇది వంగేందుకు అనువుగా కూడా ఉంటుంది. ఎల్ఈడీతో పోల్చుకుంటే ఓఎల్ఈడీ మ‌రింత డీప్‌, డార్క్ బ్లాక్స్‌ను చూపించ‌గ‌లుగుతుంది.  అమోఎల్ఈడీ టెక్నాల‌జీని ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌లో ఉప‌యోగిస్తున్నారు.  అయో ఎల్ఈడీలో థిన్ ఫిలిమ్ ట్రాన్స్ మీట‌ర్ ఉంటుంది. ఇది ఇండ్యువిడ్యుయ‌ల్ పిక్స‌ల్స్‌ను ఛార్జ్ చేస్తుంది. అంతేకాదు దీని వ‌ల్ల త‌క్కువ శ‌క్తి ఖ‌ర్చు అవుతుంది.. ఎక్కువ స్క్రీన్ ఫ్లెక్సిబిలిటీ ల‌భిస్తుంది.  శాంసంగ్ ఈ టెక్నాల‌జీనే వాడుతోంది.  తాజా శాంసంగ్ ఫోన్ల‌లో  సూప‌ర్ ఎమో ఎల్ఈడీ ఉప‌యోగిస్తున్నారు.  యాపిల్ ఐఫోన్ ఎక్స్‌, ఎల్‌జీ వీ30, నోకియా ఎన్ 95 త‌దిత‌ర ఫోన్ల‌లో ఈ టెక్నాల‌జీ ఉంది.

ఏది ఉత్త‌మం..
ప్ర‌స్తుతం ఓఎల్ఈడీతో పాటు ఎల్‌సీడీ, ప్లాస్మా టెక్నాల‌జీల‌ను కూడా వాడుతున్నారు.  ఛార్జ్ అయిన‌ ఐయోనైజ్డ్ గ్యాస్‌ల కూడిన సెల్స్ ద్వారా ప్లాస్మా ప‌ని చేస్తుంది. ఎల్‌సీడీ కూడా దాదాపు ఇంతే. కానీ ఈ మూడు టెక్నాల‌జీల్లో ఏది బెస్ట్ అంటే.. క‌చ్చితంగా ఓఎల్ఈడీ అనే చెప్పాలి. ఎందుకంటే ప్లాస్మా అనే టెక్నాల‌జీ ఇప్ప‌టికే పాతబ‌డిపోయింది. చాలా ఓల్డ్‌. ఎల్‌సీడీ అందుబాటులో ఉన్నా దీని ఉనికి అంతంత మాత్ర‌మే. ఈ నేప‌థ్యంలో అప్‌డేటెడ్ వెర్ష‌న్ అయిన ఓఎల్ఈడీకే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి.  ధర  అధికం అనే మాటే తప్పితే మనకు బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ టెక్నాలజీ కావాలంటే మొదటి ఛాయిస్ దీనికే.

జన రంజకమైన వార్తలు