• తాజా వార్తలు
  •  

షియోమి మాయలో ప‌డి మ‌నం ఈ ప‌చ్చి నిజాల‌ను ఎందుకు ప‌ట్టించుకోలేదు?

 

చైనా మొబైల్స్ అంటే ఒక‌ప్పుడు మ‌న‌కు చిన్న‌చూపుకానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.  షియోమి (రెడ్‌మీ),ఒప్పో, వివో, హాన‌ర్ ఇలా మ‌నం ఎగ‌బ‌డి కొంటున్న ఫోన్ల‌న్నీ చైనావే. అందులో మ‌రీ ముఖ్యంగా షియోమీ ఫోన్లు.  ఎంత‌లా ఇండియ‌న్ మొబైల్ యూజ‌ర్లు దీన్ని ఆద‌రిస్తున్నారంటే మ‌న‌కు 20 ఏళ్లుగా న‌మ్మ‌క‌మైన శాంసంగ్ ఫోన్ల‌ను కూడా కాద‌ని షియోమికి నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ క‌ట్ట‌బెట్టేశాం. మంచి ఫీచ‌ర్లు, దానికి త‌గ్గట్లుగా అందుబాటులో ధ‌ర ఉండ‌డంతో ఎక్కువ మంది షియోమి ఫోన్లు కొంటున్నారు.  కానీ ఈ మాయలో ప‌డి మ‌నం కొన్ని నిజాల‌ను పట్టించుకోవ‌డం లేదు. 
ఫ్లాష్‌సేల్ లెక్క‌ల‌న్నీ నిజ‌మేనా?
షియోమీ (రెడ్‌మీ) కొత్త‌గా ఏ ఫోన్ మార్కెట్లోకి తెచ్చినా ఫ్లాష్ సేల్‌తోనే ప్రారంభిస్తుంది. అంటే నేరుగా ఫోన్ కొనుక్కునే ప‌రిస్థితి ఉండ‌దు. వాళ్లిచ్చిన టైమ్‌కు ఆన్‌లైన్‌లో రెడీగా ఉండి ఫోన్ కొనుక్కోవడానికి ప్ర‌య‌త్నించాలి. కానీ నూటికి 90 శాతం మీద ఆ ఫ్లాష్ సేల్‌లో ఫోన్లు కొనుక్కోలేక‌పోతున్నారు.  కార‌ణం త‌క్కువ ఫోన్లు పెట్టి స్టాక్ అంతా అయిపోయింది.  10 నిముషాల్లోనే ఇన్ని ల‌క్ష‌ల ఫోన్లు అమ్మేశాం అని గొప్ప‌లు పోతుంటుంది. అంతేకానీ ఈ ఫ్లాష్‌సేల్ ఇన్ని వేల ఫోన్లు  లేదా ఇన్ని ల‌క్ష‌ల ఫోన్లు పెడుతున్నామ‌ని ఏనాడూ ముందే ప్ర‌క‌టించదు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాట‌జీ. 10 నిముషాల్లోనే అన్ని ల‌క్‌‌ల ఫోన్లు అమ్ముడ‌య్యాయి అంటే ఆ ఫోన్ చాలా బాగుంటుంద‌ని అంద‌రూ కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. 
బ్లాక్ మార్కెట్‌
షియోమి కొత్త‌గా ఫోన్ రిలీజ్ చేయ‌గానే  ఆఫ్‌లైన్ స్టోర్స్ వాళ్లు కూడా చాలా మంది ఫ్లాష్ సేల్‌లో బుక్ చేసి తెప్పిస్తున్నారు. ర‌క‌ర‌కాల ఐడీల‌తో ఫోన్లు బుక్ చేసేస్తున్నారు. కొత్త  ఫోన్ వ‌చ్చింది అర్జెంటుగా కొనేయాల‌ని ఆత్ర‌ప‌డేవాళ్ల‌కు రెండు వేలో, మూడు వేలో ఎక్కువ ధ‌రకు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఇలాంటి బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోవ‌డంపై షియోమి దృష్టి పెట్ట‌డం లేదు. 
వారంటీ వ‌ర‌స్ట్‌
వారంటీ విష‌యంలోనూ షియోమి క‌స్ట‌మ‌ర్ల మ‌న‌సు గెలుచుకోలేకపోతుంది.  షియోమి ఆథ‌రైజ్డ్ స‌ర్వీస్‌లు లేనిచోట థ‌ర్డ్ పార్టీల‌కు స‌ర్వీసింగ్‌కు అవ‌కాశం ఇస్తోంది. అయితే వీరు ఏదైనా స‌ర్వీస్ కోసం వ‌చ్చే షియోమి క‌స్ట‌మ‌ర్ల‌ను ఫోన్‌కు ఒరిజిన‌ల్ బ్యాక్స్ లేద‌ని, ప్రొడ‌క్ట్‌తో పాటు ఇచ్చిన మాన్యువ‌ల్ (చిన్న పాంప్లేట్‌) లేద‌ని వారంటీ ఇవ్వ‌డానికి తిర‌స్క‌రిస్తున్నారు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో గానీ ఫోన్ కొనేట‌ప్పుడు ఇచ్చే ఇన్‌వాయిస్ వారంటీకి స‌రిపోతుంది. కానీ ఇలాంటి సిల్లీ రీజ‌న్స్‌తో వారంటీ ఇవ్వ‌కుండా న‌డిపేస్తున్నారు. ఇక ఆథ‌రైజ్డ్ స‌ర్వీసు సెంట‌ర్ల‌కు వెళితే అక్క‌డ భారీ క్యూ ఉంటుంది. షియోమి  యూజ‌ర్లంద‌రికీ ప్రాబ్ల‌మ్స్ ఉన్నాయా అనిపిస్తుంది ఆ లైన్లు చూస్తే.  తీరా వెళితే మీ ఫోన్‌కు ఉన్న ప్రాబ్ల‌మ్స్ వారంటీలో క‌వ‌ర్ కావ‌ని చెప్ప‌డానికి మ్యాగ్జిమం ప్ర‌య‌త్నిస్తారు. కాదూ కూడ‌ద‌ని వారంటీ కోసం ప‌ట్టుబ‌డితే  స‌ర్వీస్ పూర్తి చేయ‌డానికి చాలా రోజులు ప‌డుతోంద‌ని, అదే పెయిడ్ స‌ర్వీస్ అయితే గంట‌ల్లోనే చేసి ఇచ్చేస్తార‌నేది ఎక్కువ మంది యూజ‌ర్ల కంప్ల‌యింట్‌.
పెద్ద కంపెనీల‌తో పోలికా?
శాంసంగ్‌ను దాటేశాన‌ని సంబ‌ర ప‌డుతున్న షియోమి ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిపై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఆథ‌రైజ్డ్ స‌ర్వీస్ సెంట‌ర్లు పెంచ‌డం, ఆన్‌లైన్‌లో స‌ర్వీస్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవ‌డం అన్నీ మంచి స్టెప్సే. యూజ‌ర్ సంతృప్తి చెందాలంటే వారంటీ విష‌యంలో ప‌క్కాగా ఉండాలి. స‌ర్వీస్ స్పీడ్‌గా, జెన్యూన్‌గా ఉండాలి.  అలా చేయ‌న‌ప్పుడు అస‌లు వారంటీ ఇవ్వ‌కండి..చైనా వ‌స్తువులు ఇంతే అని స‌రిపెట్టుకుంటాం. కానీ వారంటీ ఇచ్చి మ‌మ్మ‌ల్ని ఎందుకు ఇలా తిప్పుకుంటున్నారు అని ప్ర‌తి స‌ర్వీస్ సెంట‌ర్లోనూ కేక‌లు వినప‌డుతూ ఉంటాయి. అలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండాలంటే శాంసంగ్‌, యాపిల్ లాంటి పెద్ద కంపెనీల సర్వీస్ సెంట‌ర్ల మెకానిజంను అల‌వ‌రుచుకోవాల్సిందే.\


 

జన రంజకమైన వార్తలు