• తాజా వార్తలు
  •  

డేటా సర్వీసెస్ , కవరేజ్‌లో ఏ టెలికం ఆప‌రేట‌ర్ బెస్ట్‌?

జియో వ‌చ్చాక ఇండియ‌న్ టెలికం ఇండ‌స్ట్రీకి కొత్త ఊపు వ‌చ్చింది. అప్ప‌టివ‌ర‌కు వాయిస్ కాల్స్‌, ఎస్ఎంస్‌ల‌మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టిన కంపెనీలు ఇప్ప‌డు డేటా స‌ర్వీస్‌లపై దృష్టి సారించాయి.  4జీ నెట్‌వ‌ర్క్ దాదాపు అన్ని కంపెనీలూ అందిపుచ్చుకున్నాయి. డేటా స్పీడ్‌లో, క్వాలిటీలో, నెట్‌వ‌ర్క్ క‌వ‌రేజ్‌లో ఏ టెల్కో ఎలా ఉందో చూడండి.
జియో
జియోకు దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్ కవరేజ్ ఉంది. ఈ నెట్‌వర్క్ పై భారీగా ఒత్తిడి ఉంది. ఇంటర్నెట్ స్పీడ్ పరంగా జియో నెట్‌వర్క్ కొంత మేర పర్వాలేదనిపిస్తున్నప్పటికి రద్దీగా ఉండే ఏరియాల్లో మాత్రం స్లో ఇంటర్నెట్ స్పీడ్‌ను నమోదు చేస్తోంది.  ఆప్టిమైజేషన్ కొనసాగుతూనే  ఉంది. ఆంధ్ర్రప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, యూపీలో జియో బలమైన కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది.
ఎయిర్‌టెల్‌
భారతదేశపు అతిపెద్ద టెలికం నెట్‌వర్క్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎయిర్‌టెల్ 2జీ, 3జీ విభాగాల్లో బలమైన నెట్‌వర్క్ కవరేజ్‌ను కలిగి ఉంది. 4జీ విభాగంలో మాత్రం ఇంట‌ర్నెట్ స్లోగానే ఉంటోంది. ఈ నెట్‌వర్క్ ఆఫర్ చేస్తోన్న డేటా సర్వీసెస్ పై తక్కువ ఒత్తిడి ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో అప్‌గ్రేడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రా, ఒడిస్సా, రాజస్థాన్, తమిళనాడు, యూపీ వెస్ట్ ఇంకా వెస్ట్ బెంగాల్ సర్కిళ్లలో ఎయిర్‌టెల్ పెద్ద సంఖ్య‌లో యూజ‌ర్లున్నారు.
వొడాఫోన్‌
భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికం నెట్‌వర్క్‌గా గుర్తింపు తెచ్చుకున్న వొడాఫోన్ ఇండియా 2జీ, 3జీ విభాగాల్లో బలమైన నెట్‌వర్క్ కవరేజ్‌ను కలిగి ఉంది. 4జీ విభాగంలో మాత్రం ఇంట‌ర్నెట్ స్పీడ్ ఇంకా అంచ‌ననాల‌కు దూరంగానే ఉంది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, యూపీ ఈస్ట్, యూపీ వెస్ట్ ఇంకా వెస్ట్ బెంగాల్ సర్కిళ్లలో వొడాఫోన్ బలమైన కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది.
ఐడియా
 ఐడియాకి 2జీ, 3జీ విభాగాల్లో  బలమైన నెట్‌వర్క్ కవరేజ్  ఉంది. 4జీ విభాగంలో మాత్రం  స్లో ఇంటర్నెట్ స్పీడ్‌ను నమోదు చేస్తోంది.. ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రా, యూపీ ఈస్ట్, యూపీ వెస్ట్  సర్కిళ్లలో ఐడియా బలమైన కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది.
ఎయిర్‌సెల్‌
ఈ నెట్‌వ‌ర్క్ 2జీ, 3జీ విభాగాల్లో మాత్రమే రాణిస్తోంది. తమిళనాడు, అస్సామ్, బిహార్, ఢిల్లీ ఇంకా యూపీ ఈస్ సర్కిళ్లలో ఈ నెట్‌వర్క్ బలమైన కస్టమర్ బేస్ ఉంది.
 బెస్ట్ డేటా నెట్‌వర్క్ ఎవరిది?
ఇంటర్నెట్ స్పీడ్ పరంగా జియో నెట్‌వర్క్ కొంత మేర పర్వాలేదనిపిస్తున్నప్పటికి రద్దీగా ఉండే ఏరియాల్లో మాత్రం స్లో ఇంటర్నెట్ స్పీడ్‌ను నమోదు చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ డేటా స్పీడ్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి టెల్కోలతో అలవోకగా పోటీపడగలుగుతోంది. స్పెషల్ డేటా ఆఫర్ల కారణంగా ఐడియా సెల్యులార్ కొన్ని  సర్కిళ్లలో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఎయిర్‌సెల్ తమిళనాడులోమ‌దూసుకుపోతోంది. వొడాఫోన్, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లకు సంబంధించిన డేటా ట్రాఫిక్ గత కొద్ది నెలలుగా డౌన్ అయినప్పటికి 3జీ స్పీడ్ విషయంలో మాత్రం నికరమైన స్పీడును  అందించగలుగుతున్నాయి. 
* జియో అత్యుత్తమ 4జీ కవరేజ్‌ను అందిస్తున్నప్పటికి అపార్ట్‌మెంట్స్‌తో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాత్రం స్సీడ్ డ్రాప్స్ అనేవి ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఇటువంటి ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్, ఐడియా వంటి ఆపరేటర్స్ మన్నికైన కవరేజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. 
* ఎయిర్‌టెల్, వొడాఫోన్ నెట్‌వర్క్‌లు స్థిరమైన డేటా నెట్‌వర్క్‌ను ఆఫర్ చేస్తున్నప్పటికి కొన్ని ఏరియాల్లో మాత్రం మ్యాగ్జిమమ్ స్పీడ్‌ను కూడా అందించలేక పోతున్నాయి. 
 బెస్ట్ డేటా నెట్‌వర్క్‌ను గుర్తించటం ఎలా?
మీ నెలవారీ ఇంటర్నెట్ డేటా యూసేజ్‌ను క్రమం తప్పకుండా నోట్ చేసుకోవాలి. మంత్లీ బడ్జెట్ అలానే కావల్సిన యావరేజ్ స్పీడ్‌ను కూడా ఫిక్స్ చేసుకోవాలి. వీటితో డేటా వేస్టేజ్‌ను కూడా మీరు నియంత్రించగలిగితే మీకు కావల్సిన బెస్ట్ వైర్‌లెస్ డేటా ప్లాన్ సెకన్లలో దొరికేస్తుంది.
టెలికం ఆపరేటర్ల ఆఫర్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే..?
వినియోగదారులను ఆకర్షించే క్రమంలో టెలికం సంస్థలు కళ్లు చెదిరే ఆఫర్లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. వీటి గురించి మీరు ఆలోచన చేయవల్సిన అవసరం లేదు. హెచ్‌డి క్వాలిటీ వీడియో కంటెంట్ లేదా హై-స్పీడ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌‌ను ఆస్వాదించేందుకు 10mbps స్పీడ్ సరిపోతుంది. కాబట్టి స్పీడ్-ట్రాప్‌లో పడి టెలికం ఆపరేటర్లకు హై-ఏఆర్‌పీయూ కస్టమర్స్‌గా మారకండి. మీ రోజవారీ డేటా వేస్టేజ్ పై ఓ స్పష్టమైన అవగాహనకు రండి. 4కే డిస్‌ప్లే ఫీచర్ అందుబాటులోలేని డివైస్‌లలో 4కే కంటెంట్‌ను స్ట్రీమ్ చేయకండి.


 

జన రంజకమైన వార్తలు