• తాజా వార్తలు
  •  

అంద‌రూ ఐఫోన్ స్లో గురించి మాట్లాడుకుంటున్నారు.. మ‌రి ఆండ్రాయిడ్ సంగ‌తి తెలుసా!

ఆండ్రాయిడ్... ప్ర‌స్తుత హైటెక్ ప్ర‌పంచంలో అంద‌రికి కావాల్సిన డివైజ్ ఇది. ఇది లేకుండా ఏ ప‌నీ జ‌ర‌గ‌ని ప‌రిస్థితి వ‌చ్చింది.  వీటిని ఎంత‌గా వాడేస్తున్నామంటే మనం షాపింగ్‌కు వెళ్లినా..  సినిమాకు వెళ్లినా... చివ‌రికి ఏదైనా టూర్‌కు వెళ్లినా ఆండ్రాయిడ్‌తోనే ప‌ని. అయితే ఇంత విప‌రీతంగా వాడ‌డం వ‌ల్ల ఆండ్రాయిడ్ ప‌ని తీరు కూడా ప‌డిపోతోంది. దీని స్పీడ్ త‌గ్గిపోతోంది. నెమ్మ‌ది నెమ్మదిగా వేగంగా ప‌డిపోతుంది. మ‌రి అలా వేగం ప‌డిపోయిన ఆండ్రాయిడ్‌ను తిరిగి ప‌రుగెత్తించ‌డం ఎలా?

ఓఎస్ అప్‌డేట్ వ‌ల్లే...
సాధార‌ణంగా ఏదైనా డివైజ్ అప్‌డేట్ అయితే మునుప‌టి కంటే వేగంగా ప‌ని చేయాలి. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఇది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను ఇన్‌బిల్ట్‌గా కొంత మెమెరీని ఫిక్స్ చేస్తారు. ఈ మెమ‌రీతోనే ఇది ప‌ని చేస్తుంది. ఎక్స్‌ట్ర‌న‌ల్ మెమ‌రీ ఉన్నా కూడా ఇది ఇన్‌బిల్ట్ యాప్స్ కోసం ప‌ని చేయ‌దు. అయితే ఫోన్ కొన్న కొత్త‌లో బాగా ప‌ని చేస్తుంది. కానీ కొంత‌కాలానికి ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్‌డేట్ అవుతుంది. ఇలాంటి స‌మ‌యంలో ఇంట‌ర్న‌ల్ మెమ‌రీతోనే అప్‌డేష‌న్ జ‌రుగుతుంది. దీని వ‌ల్ల మీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ మొత్తం ఖ‌ర్చ‌యిపోతుంది. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఆటోమెటెక్‌గా స్లో అయిపోతుంది. 

స్లో కాకుండా ఉండాలంటే..
ఆండ్రాయిడ్ డివైజ్ స్లో కాకుండా ఉండడానికి మ‌రీ ఎక్కువ ఆప్ష‌న్లు అందుబాటులో లేవు. దీని కోసం క‌స్ట‌మ్ రోమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బ్లోట్‌వేర్ లేని క‌స్ట‌మ్ రోమ్‌ను ఎంచుకోవాలి. ఇది యాప్‌ల‌ను లైట్ వెర్ష‌న్‌ల‌ను మాత్ర‌మే తీసుకుని సిస్ట‌మ్ స్లో కాకుండా కాపాడుతుంది. అంతేకాక మీ డివైజ్‌కు  అవ‌స‌రమైన బూస్టింగ్ ఇస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ర‌న్నింగ్ అయ్యే యాప్స్‌ను కూడా ఇది ఆపుతుంది. మీ ర్యామ్‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌డ‌మే దీని ప్ర‌త్యేక‌త‌. లైవ్ వాల్‌పేప‌ర్ లాంటి వాటి వాడ‌కాన్ని కూడా ఇది త‌గ్గిస్తుంది. దీంతో డివైజ్ వేగం పెరిగి... ఆండ్రాయిడ్ మ‌ళ్లీ సాధార‌ణ స్థితిలో ప‌ని చేస్తుంది. మీ హోమ్ స్క్రీన్ స్లిమ్ డౌన్ చేయ‌డం వ‌ల్ల కూడా డివైజ్ వేగం పెరుగుతుంది.

జన రంజకమైన వార్తలు