• తాజా వార్తలు

మంచి స్పెసిఫికేష‌న్లు ఉంటేనే మంచి ఫోన్ అనుకోవటం మన పిచ్చ్చి భ్రమేనా !

ఆండ్రాయిడ్ ఫోన్ల‌న్నీ ఒకేలా ఉండవు. ధ‌ర‌ల‌ను బ‌ట్టి స్పెసిఫికేష‌న్లు మారిపోతూనే ఉంటాయి. ఎంత ఎక్కువ ధ‌ర పెడితే మ‌న‌కు అంత మంచి ఫోన్లు దొరుకుతాయి.  అందుకే వీలైన‌న్ని ఎ క్కువ స్సెసిఫికేష‌న్లు ఉండేలా చూసుకుంటున్నారు.  అయితే మంచి స్పెసిఫికేష‌న్లు ఉంటేనే మంచి ఫోన్లూ అనొచ్చా.. స్లో అయిపోవ‌డం లాంటి  ఇబ్బందులు ఉండ‌వా? అదేం లేదంటున్నారు నిపుణులు. స్పెసిఫికేష‌న్లు బ‌ట్టి ఫోన్‌కు విలువ రాద‌ని దానికి కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలు ఉంటాయ‌నేది వారి మాట‌.  దానిలో వాడే సాఫ్ట్‌వేర్ల‌ను బ‌ట్టి..దాని డిజైన్ బ‌ట్టి. . లేదా బ్రాండ్‌ను బ‌ట్టి విలువ మారిపోతూ ఉంటుంది.  అంతేకాదు అది స్లో కావ‌డం.. ఎక్కువ కాలం  ప‌ని చేయ‌డం ఏఏ కార‌కాల మీద ఆధార‌ప‌డి ఉంటుందో  చూద్దామా..

ప్రాసెస‌ర్‌
ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌కైనా ప్రాసెస‌ర్  గుండెకాయ లాంటిది. ప్రాసెస‌ర్ కూడా ఫోన్ ఫోన్‌కు మారిపోతుంటుంది. ప్రాసెస‌ర్ వేగంలో  దీనిలో ఉండే కోర్‌ల‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది.  అంతేకాక  ప్రాసెస‌ర్ వ‌ర్కింగ్‌కు క్లాక్ స్పీడ్ కూడా ముఖ్య‌మే.  అందుకే ఏ రెండు ఫోన్లూ ఒకేలా ఉండ‌వు. రెండు ఫోన్‌లు ఒకేలా ప‌ని చేయ‌వు. అంతేకాక ప్రాసెస‌ర్‌లో వాడే కాంపోనెంట్స్ ప‌రిమాణాన్ని బ‌ట్టి కూడా ప్రాసెస‌ర్ ఫెర్మార్‌మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది.

ర్యామ్‌
ప్ర‌స్తుతం వ‌స్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో 4 జీబీ, 8 జీబీ ర్యామ్‌ల‌తో త‌యార‌వుతున్నాయి.  వీటిలో 8 జీబీ ర్యామ్‌లను ఎక్కువ‌శాతం వాడుతున్నారు. ర్యామ్ గురించి ఒకే మాట‌లో చెప్పొచ్చు. దీన్ని వాడితేనే మ‌న‌కు ఉప‌యోగం. ఉచితంగా ఎంత ర్యామ్ ఉన్నాఅది వృథానే. ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఎక్కువశాతం యాప్‌లు డౌన్‌లోడ్ చేయ‌డం, వీడియో గేమ్స్ ఆడ‌డం వ‌ల్ల ర్యామ్ ఖ‌ర్చు పెరిగింది. అయితే  త‌క్కువ ర్యామ్ ఉన్న ఫోన్లు మంచి ఫెర్మార్‌మెన్స్ చేయ‌వ‌న‌డం త‌ప్పు.

స్క్రీన్‌
స్మార్ట్‌ఫోన్‌కు స్క్రీన్ అంటే దాని ముఖం లాంటిది. ఇది బాగుంటేనే జ‌నాలు  ఆక‌ర్షితుల‌వుతారు. దీనిలో ఎన్నో ర‌కాలు ఉన్నాయి.  ఎల్‌సీడీ, ఎల్ఈడీ, రిజ‌ల్యూష‌న్‌, పిక్స‌ల్ డెంస్టినీ  వీట‌న్నిటిపై స్క్రీన్ బాగోవ‌డం బాగోక‌పోవ‌డం ఆధార‌ప‌డి ఉంటుంది.  120 హెట్జ్ డిస్‌ప్లేతో వ‌స్తున్న రేజ‌ర్ ఫోన్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వ‌స్తున్నాయి. అలా అని స్క్రీన్ బాగోని ఫోన్ల‌న్నీ వేస్ట్ అనుకోవ‌డం కూడా త‌ప్పుడు అభిప్రాయం కాదు. 

బ్యాట‌రీ
స్మార్ట్‌ఫోన్లు కొనేవాళ్ల‌కు బ్యాట‌రీ ఓ పెద్ద స‌వాల్‌.  ఎంత ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్న‌ఫోన్‌ను ఎంచుకోవాలి.  ఎంత ఉండాలి అనే సందేహాలు ఉంటాయి.  మంచి బ్యాట‌రీ ఉంటే ఫోన్ ఎక్కువ‌సేపు మ‌న్నుతుంది అనే భావ‌న ఉంటుంది.  ప్రాసెస‌ర్‌ను బట్టి కూడా బ్యాట‌రీ మ‌న్నిక ఆధార‌ప‌డి ఉంటుంది. ఎంఏహెచ్ ఎక్కువ ఉంటే మంచి బ్యాట‌రీ లేక‌పోతే లేదు అనేది అభిప్రాయం కూడా త‌ప్పే. అయితే మంచి బ్రాండ్‌ల బ్యాట‌రీలు ఎంఏహెచ్ త‌క్కువైనా ఎక్కువ‌కాలం మ‌న్నుతాయి.

కెమెరా
స్మార్ట్‌ఫోన్లో అత్య‌ధిక ప్రాధాన్యం గ‌ల‌ది  కెమెరానే.  పిక్స‌ల్‌ను బ‌ట్టి ఫోన్‌ను కొంటారు. అయితే  పిక్చ‌ర్ క్వాలిటీని నిర్ణ‌యించేది కేవ‌లం పిక్స‌ల్స్ మా త్ర‌మే కాద‌ని  చాలామందికి తెలియ‌దు. కెమెరా  బాగుండాలంటే ఎన్నో కార‌కాలు ఉంటాయి. అందులో పిక్స‌ల్స్  ఒక‌టి.  అందుకే కెమెరా పిక్స‌ల్ బాగుంటేనే ఫోన్ అద్భుతం  అనే భావ‌న నుంచి బ‌య‌ట‌ప‌డాలి.

జన రంజకమైన వార్తలు