• తాజా వార్తలు
  •  

64 బిట్ విండోస్‌నే ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే..

మైక్రోసాఫ్ట్ ప్ర‌స్తుతం విండోస్ 10లో 32 బిట్‌, 64 బిట్ వెర్ష‌న్లను అందుబాటులో ఉంచింది. మీరు విండోస్ 10 లేదా విండోస్ 7 ఏది ఇన్‌స్టాల్ చేసుకున్నా 32 బిట్ వెర్స‌న్‌ను స్కిప్ చేయ‌డం బెట‌ర్ అని చెబుతున్నారు నిపుణులు. దానికి బదులు  64 బిట్ వెర్ష‌న్‌నే ఇన్‌స్టాల్ చేసుకోవాల‌నేది వారి మాట‌. విండోస్ 64 బిట్ వెర్ష‌న్‌ను ఎక్స్‌64 వెర్ష‌న్ అని కూడా పిలుస్తారు. 32 బిట్ వెర్ష‌న్‌ను ఎక్స్‌86 వెర్ష‌న్ అని అంటారు.

64 బిట్ వెర్ష‌నే ఎందుకంటే...
64 బిట్ వెర్ష‌న్ చాలా కాలం నుంచి ఉంది. ఇంటెల్ తొలి బిగ్ 64 బిట్ కంజ్యుమ‌ర్ సీపీయూ 2006లోనే రిలీజ్ అయింది. ఏఎండీ అథ్లాన్ 64 బిట్ 2003లో రిలీజ్ అయింది. మీరు గ‌త ప‌దేళ్ల‌లో ఏదైనా పీసీని కొని ఉంటే అది క‌చ్చితంగా 64 బిట్ పీసీనే అయి ఉంటుంది. అయితే ఇంటెల్ ఎర్లీ  ఆట‌మ్ సీపీయూ వెర్ష‌న్ 32 బిట్‌గా వ‌చ్చింది. నిజానికి ఇది ప‌ని ప‌రంగా చాలా నెమ్మ‌దిగా ఉంటుంది. 64 బిట్ ఉన్న సీపీయూల్లో మీరు 32 బిట్ వెర్ష‌న్‌ను కూడా వేసుకోవ‌చ్చు. 64 బిట్ వెర్ష‌న్‌తో ఉన్న ఉప‌యోగాల్లో ఇదొక‌టి.

మెమ‌రీ కోసం..
విండోస్ 32 బిట్ వెర్ష‌న్‌లో మెమ‌రీ చాలా ప‌రిమితం. ఇందులో 4జీ ర్యామ్ మాత్ర‌మే ఉంటుంది. ఈరోజుల్లో 4 జీబీ అంటే చాలా త‌క్కువ మెమ‌రీ కింద లెక్క‌. బ‌డ్జెట్‌లో కొన్న పీసీలు కూడా ప్ర‌స్తుతం 8 జీబీ ఉంటున్నాయి. మీరు 4 జీబీ ర్యామ్ క‌న్నా ఎక్కువ మీ పీసీల్లో వాడాలంటే 64 బిట్ వెర్ష‌న్ మంచి ప్ర‌త్యామ్నాయం. ఇదే కాక 32 బిట్ ప్రొగ్రామ్‌లో 2జీబీ ర్యామ్ మాత్ర‌మే ఉంటుంది. అయితే మోడ్ర‌న్ డిమాండింగ్ గేమ్స్‌, ప్రొఫెష‌న‌ల్ టూల్స్‌ను ఉప‌యోగించాలంటే 2 జీబీ ర్యామ్ క‌న్నా ఎక్కువ కావాలి. 

32 బిట్ అవ‌స‌ర‌మా!
విండోస్‌లో ఇంకా 32 బిట్ వెర్ష‌న్ వాడ‌డం అవ‌స‌ర‌మా! అయితే మీరు పాత కంప్యూట‌ర్ వాడుతున్న‌ప్పుడు అందులో 32 బిట్ ప్రాసెస‌ర్ ఉంటే.. మీకు వేరే ఛాయిస్ లేదు. కొన్ని మాన్యుఫాక్చ‌ర్లు 32 బిట్ వెర్ష‌న్‌తో మాత్ర‌మే కంప్యూట‌ర్లు త‌యారు చేస్తున్నాయి. వీటిలో మీరు 32 బిట్ త‌ప్ప వేరేది వాడ‌లేరు. 32 బిట్‌లో ఎక్కువ వెర్ష‌న్ వాడ‌లేరు కానీ.. 16 బిట్ వెర్ష‌న్ వాడుకోవ‌చ్చు. కానీ కంప్యూట‌ర్ స్పీడ్ ఇంకా ఇంకా త‌గ్గిపోతుంది. 

జన రంజకమైన వార్తలు