• తాజా వార్తలు

అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అకౌంటెంట్ల‌ను భర్తీ చేయ‌గ‌ల‌దా!

సాధార‌ణంగా ఏ చిన్న కంపెనీ అయినా సాఫీగా ముందుకు న‌డ‌వాలంటే అకౌంటెంట్ చాలా కీల‌కం. మ‌నీకి సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాల‌ను చూసుకోవడానికి ఒక ప‌ర్స‌న్ లేక‌పోతే య‌జ‌మానికి చాలా క‌ష్ట‌మ‌వుతుంది. చోటా కంపెనీల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ప‌దులో సంఖ్య‌లో ఎంప్లాయిస్ ఉండే సంస్థ‌ల‌కు చాలా క‌ష్టం. అందుకే కంపెనీలు పెట్టే ముందే వెంట‌నే ఒక అకౌంటెంట్‌ను నియ‌మించుకుంటారు. అయితే టెక్నాల‌జీ ఇంత డెవ‌ల‌ప్ అయిన త‌ర్వాత .. మ‌నం అన్నిటికి కంప్యూట‌ర్ మీద ఆధార‌ప‌డుతున్న త‌ర్వాత కూడా అకౌంటెంట్ అవ‌స‌ర‌మా! మ‌నం ఏం చేయాలన్నా కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కితే చాలు. కానీ అకౌంటెంట్‌ను ఎందుకు పెట్టుకుంటున్నాం. అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లు అకౌంటెంట్ల‌ను భ‌ర్తీ చేయ‌లేవా!

సాఫ్ట్‌వేర్ ఉన్నా..
కంప్యూట‌ర్‌లో మ‌నం అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. వెంట‌నే మ‌న‌కు సంబంధించిన అన్ని లెక్క‌ల‌ను ఇది తీరుస్తుంది. అంతేకాదు ఎలాంటి త‌ప్పులు దొర్లేందుకు అవ‌కాశం లేదు. అంత‌కుమించి మ్యాన్ ప‌వ‌ర్ గురించి ఆలోచించాల్సి అవ‌స‌రం లేదు. అయితే ఎన్ని సాఫ్ట్‌వేర్‌లు వ‌చ్చినా టెక్నాల‌జీ ఎంత‌గా డెవ‌ల‌ప్ అయినా కొన్ని విష‌యాల‌ను భ‌ర్తీ చేయ‌డం సాధ్యం కాద‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక అకౌంటెంట్ ఉంటే అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాల‌ను మార్చుకునే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు ప్ర‌తి విష‌యాన్ని ఎక్స్‌ప్ల‌యిన్ చేసి మ‌న‌కు త‌గ్గ‌ట్టుగా లెక్క‌లను స‌రి చేసుకునే వీలుంటుంది. కానీ సాఫ్ట్‌వేర్‌తో ఇది సాధ్యం కాదు. దానిలో ఉన్న ప్రోగ్రామ్ ప్ర‌కార‌మే అది ప‌ని చేస్తుంది. మ‌న అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు దీన్ని మార్చుకోవ‌డం సాధ్యం కాదు. అప్‌డేటెడ్ వెర్ష‌న్లు వచ్చినా అవి కంపెనీ అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా ఉంటాయ‌నే రూల్ లేదు.

డ‌బుల్ ఎంట్రీ, ఎర్ర‌ర్స్‌
అయితే కంప్యూట‌ర్ల‌తో త‌ప్పులు దొర్ల‌వని అంద‌రికి తెలుసు. అయితే దాన్ని స‌రిగా ఆప‌రేట్ చేస్తేనే అది సాధ్యం. దాన్ని ఉప‌యోగించే మ‌నుషులు స‌క్ర‌మంగా వాడ‌క‌పోతే పెద్ద ప్ర‌మాదాలే జ‌రుగుతాయి. అంటే రూ.5000 వేల అన్న చోట ఇంకో సున్నా యాడ్ అయితే రూ.50 వేలుగా కంప్యూట‌ర్ తీసుకుంటుంది. దీని వ‌ల్ల అంతిమంగా కంపెనీకి నష్టం. త‌ర్వాత గుర్తించినా.. దాన్ని రీట్రైవ్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్‌. అంతేకాదు డ‌బుల్ ఎంట్రీకి అవ‌కాశాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. అజాగ్ర‌త్త‌గా ఉంటే తప్పులు దొర్లే అవ‌కాశాలుంటాయి. అందుకే ఎంత పెద్ద కంపెనీలైనా సాఫ్ట్‌వేర్‌ల‌తో పాటు అకౌంటెంట్ల‌ను మ‌స్ట్‌గా ఉప‌యోగించుకుంటున్నాయి. అయితే చాలా కంపెనీలు టాలీ లాంటి వాటిని ఎప్ప‌టినుంచో వాడుతున్నాయి.

ఉప‌యోగాలు కూడా ఉన్నాయి
అయితే మాన్యువ‌ల్‌గా అకౌంట్స్ చేయ‌డంతో పోలిస్తే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప‌ని వేగంగా జ‌రుగుతుంది. అంతేకాదు మ‌నం ఎన్ని గంట‌లైనా దీన్ని ఉపయోగించుకోచ్చు. ట్రాన్సాక్ష‌న్లు అక్యురేట్‌గా ఉండేందుకు అవ‌కాశం ఉంది. బాలెన్స్ షీట్ల‌ను ప‌క్కాగా చేసేందుకు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ల‌ను మించింది లేదు. ఐతే వీటిలో మ‌రిన్ని మార్పులు చేస్తే క‌చ్చితంగా అకౌంటెంట్ల‌ను రీప్లేస్ చేసే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంటే కంపెనీ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా మార్పులు చేసుకునే సౌల‌భ్యం ఈ సాఫ్ట్‌వేర్ల‌లో ఉంటే క‌చ్చితంగా వీటి వాడ‌కం మ‌రింత పెరుగుతుంద‌నేది వారి మాట‌. అంతేకాదు అకౌంటెంట్ల‌లా త‌మ బిజినెస్ గురించి భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్ట‌కుని ఎన‌లైజ్ చేయ‌గ‌లిగితే మ‌రింత గొప్ప‌గా ఉంటుంది.

జన రంజకమైన వార్తలు