• తాజా వార్తలు

ప్రపంచంలోనే ఫస్ట్ ప్రాంతీయ భాషా ఓఎస్.. ఇండస్

కంప్యూట‌ర్‌కైనా, స్మార్ట్‌ఫోన్‌కి అయినా ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ గుండెకాయ లాంటిది. ఇది ఫెయిల్ అయితే ఆప‌రేష‌న్స్ జ‌ర‌గ‌వు. ఎంత ఖ‌రీదైన కంప్యూట‌రైనా, స్మార్ట్‌ఫోన్ అయినా అవి వృథానే అవుతాయి. అందుకే గాడ్జెట్‌ల‌ను కొనేట‌ప్పుడు క‌చ్చితంగా ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ సామ‌ర్థ్యం గురించి వినియోగ‌దారులు తెలుసుకుంటారు. ఓఎస్ ప‌క్కాగా ఉంటేనే కొనుగోలు విష‌యం ఆలోచిస్తారు. అయితే ఇన్ని రోజులు మ‌న‌కు ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అంటే మైక్రోసాఫ్ట్ విండోస్‌, యాపిల్ ఓఎస్‌లు మాత్ర‌మే గుర్తుకొస్తాయి. ఐతే ఇవ‌న్ని మ‌న దేశానికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌లు కావు. ఐతే మ‌న‌కు కంప్యూట‌ర్ ఊహ తెలిసిన నాటి నుంచి వాడుతున్న ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లు మాత్ర‌మే విండోస్‌, యాపిల్ మాత్ర‌మే. వీటిలో వెర్ష‌న్‌లు మారాయి త‌ప్ప ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లు మాత్రం మార‌లేదు. అయితే మ‌న అవ‌స‌రాలకు త‌గ్గ‌ట్టు, ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఒక ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉంటే? ఈ ఊహే థ్రిల్ ఇస్తుంది క‌దా! అయితే ఇది ఊహ కాదు నిజం. మ‌న అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు ఒక ప‌క్కా లోక‌ల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అందుబాటులోకి వ‌చ్చింది. దాని పేరు ఇండ‌స్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌. అమెరికా, చైనా కంపెనీల‌కు దీటుగా మ‌న భార‌త దేశంలో ప్రాంతీయ భాషల్లో త‌యారైన ఓఎస్ ఇది.

అడ్వాన్సడ్ ట్రాన్స‌లేష‌న్‌
ప్ర‌పంచంలోనే తొలి రీజ‌న‌ల్ లాంగ్వేజ్ ఆపరేటంగ్ సిస్ట‌మ్ ఇది. మ‌న‌కు న‌చ్చిన భాష‌లో ఓఎస్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ప్ర‌ధానంగా స్మార్ట్‌ఫోన్లే ల‌క్ష్యంగా త‌యారు చేశారు. అడ్వాన్స‌డ్ ట్రాన్స‌లేష‌న్ ఫీచ‌ర్స్‌తో ఉన్న ఈ ఓఎస్‌ను ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. ఈ ఓఎస్‌ను త‌యారు చేసింది భార‌తీయులే అయినా ప్ర‌స్తుతానికి ఇది చైనా వేదిక‌గా ఆప‌రేష‌న్స్ కొన‌సాగిస్తోంది.
* ముంబయి బేస్డ్ Firstouch సంస్థ దీన్ని తయారుచేసింది. ఇది భారత ప్రభుత్వ విభాగమైన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ అండ్ ఐటీతో కలిసి 9 భారతీయ భాషల్లో టెక్స్ట్ టు స్పీచ్ సర్వీసెస్ తీసుకొస్తోంది.
* ఇండస్ ఓఎస్ ను ఇప్పటికే 5 కోట్ల మందికి పైగా వాడుతున్నారని... ఇండియాలో దీనిది సెకండ్ ప్లేసని సంస్థ సీఈవో రాకేశ్ దేశ్ ముఖ్ చెబుతున్నారు.
* ఈ ఓఎస్ పై పనిచేసేలా 6 కేటగిరీల్లో సుమారు 50 వేలకు పైగా యాప్స్ ఉన్నట్లు చెబుతున్నారు.

టాప్ టెన్ కంపెనీలతో టై అప్
ఇండ‌స్ ఓఎస్‌లో మ‌రిన్ని మార్పు చేర్పులు చేసి స్మార్ట్‌ఫోన్ల‌లోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాల‌న్న‌ది త‌మ ఉద్దేశ‌మ‌ని ఇండ‌స్ కంపెనీ తెలిపింది. దీనికి అనుగుణంగానే ఆ కంపెనీ చైనా దిగ్గ‌జ కంపెనీ జియోమితో ఒప్పందం కుదుర్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇంుకోసం మే చివరి నాటికి చైనాలో ఆఫీస్ కూడా తెరవబోతోంది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్న పలు మొబైల్ ఫోన్లలో ఇండస్ ఓఎస్ ఉంది. వాటిలో భార‌త్‌కు చెందిన మైక్రోమాక్స్‌, ఇంటెక్స్‌, కార్బ‌న్ కూడా ఉన్నాయి.

ఇండస్ ఓఎస్ తో వస్తున్న కొన్ని ఫోన్ బ్రాండ్లు
* ట్రయో మొబైల్స్
* స్వైప్
* మైక్రోమ్యాక్స్
* కార్బన్
* ఇంటెక్స్
* సెల్ కాన్
* ఎలైట్
* అమ్రా

ఇండోనేసియా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లోనూ...
త‌మ ఓఎస్ వాడేలా వీటితో ముందుగా ఒప్పందం చేసుకున్న‌ట్లు ఆ సంస్థ పేర్కొంది. వెంచెరెస్ట్‌, జేఎస్‌డ‌బ్ల్యూల నుంచి ఇండ‌స్‌కు ఫండింగ్ ల‌భిస్తోంది. మ‌రి కొద్ది నెల‌ల్లోనే భార‌త మార్కెట్లో పూర్తి స్థాయిలో అన్ని మొబైల్స్ ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌తో అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఆ కంపెనీ చెప్పింది. ఇండియాతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేసియాల్లోనూ విస్తరించేందుకు ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

జన రంజకమైన వార్తలు