• తాజా వార్తలు

బ‌య్ నౌ.. పే లేట‌ర్ ఆఫ‌ర్‌పై ఓ నిశిత విశ్లేష‌ణ‌

ఇప్ప‌డు కొనండి.. త‌ర్వాత చెల్లించండి (Buy now, pay later.) స్కీమ్స్ ఇప్పుడు క‌న్స్యూమ‌ర్ గూడ్స్ సేల్స్‌ను బాగా ప్ర‌భావితం చేస్తున్నాయి.  పైసా చెల్లించ‌క్క‌ర్లేకుండా ముందు వ‌స్తువు తీసుకెళితే త‌ర్వాత ఈఎంఐల్లో చెల్లించే ఈ ఆఫ‌ర్లు ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్‌, క‌న్స్యూమ‌ర్ గూడ్స్ మీద ఇస్తున్నాయి కంపెనీలు. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌ల నుంచి ప‌రుపులు, మంచాల వ‌ర‌కు అన్నింటికీ ఈ బ‌య్ నౌ.. పే లేట‌ర్ స్కీమ్స్ వ‌చ్చాయి.  బ‌జాజ్ ఫైనాన్స్‌, క్యాపిట‌ల్ ఫ‌స్ట్‌, హోం క్రెడిట్ ఇండియా లాంటి ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ‌లు ఈ ఆఫర్ల‌తో వినియోగ‌దారుల జాబితాను పెంచుకుంటున్నాయి. 
ఈఎంఐలు పెంచాయి
ఇది వ‌ర‌కు ఏదైనా ప్రొడ‌క్ట్ కొంటే మ్యాగ్జిమం 24 నెల‌ల వ‌ర‌కు గడువు ఉండేది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, స్మార్ట్ ఫ్రిజ్‌లు ఇలా అన్ని వ‌స్తువులు ఖ‌రీద‌యిన‌వి  వ‌స్తున్నాయి. దీంతో రేటు పెరిగి ఈఎంఐ భార‌మ‌వుతోంద‌ని వినియోగ‌దారులు వ‌స్తువులు కొన‌డం త‌గ్గిస్తున్నార‌ని బజాజ్ ఫైనాన్స్‌, క్యాపిట‌ల్ ఫ‌స్ట్ వంటి సంస్థ‌లు ఈఎంఐల గ‌డువును కూడా 24 నుంచి 30నెల‌లకు పెంచాయి.  బ‌జాజ్ ఫైనాన్స్ త‌మ సొంత కంపెనీ బ‌జాజ్ ఎలక్ట్రానిక్స్‌తోపాటు పై, క్రోమ్ వంటి ఎల‌క్ట్రానిక్ స్టోర్లు, ఫ‌ర్నిచ‌ర్ వ‌ర‌ల్డ్ లాంటి స్టోర్ల‌తోపాటు దాదాపు అన్నిచైన్ స్టోర్ల‌లోనూ ఈ ఆఫ‌ర్లు పెట్టింది. క్యాపిట‌ల్ ఫ‌స్ట్ కూడా దాదాపు అన్ని చోట్లా ఉంది.
ఈ-కామ‌ర్స్‌లోకీ ప్ర‌వేశం
ఆఫ‌ర్లు ఎక్కువ ఉండ‌డంతో ఎల‌క్ట్రానిక్ గూడ్స్‌, క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్, ఫర్నిచ‌ర్ వంటివి కొనుక్కోవ‌డానికి జనం ఆన్‌లైన్‌నూ బాగానే వాడుతున్నారు. ఈ ఛాన‌ల్‌ను కూడా ఎన్‌బీఎఫ్‌సీలు వ‌దులుకోవ‌డం లేదు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వంటి ఈ-కామ‌ర్స్ సైట్ల‌తో టైఅప్ పెట్టుకుని బ‌య్ నౌ.. పేలేట‌ర్ స్కీమ్‌లు అమ‌లు చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో బ‌జాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు ఈ ఆఫ‌ర్ బాగా పాపుల‌ర‌వుతోంది. 
సేల్స్ త‌గ్గుతున్నాయ‌నే..
వినియోగ‌దార్ల‌ను ఆక‌ట్టుకుని వారు త‌ర్వాత కొందాంలే అనుకున్నవ‌స్తువును ముందే కొనిపించ‌డానికి ఈ బ‌య్ నౌ..పే లేట‌ర్ స్కీమ్‌లు బాగా ప‌నికొస్తాయ‌ని మార్కెట్ విశ్లేష‌ణ‌.  పండ‌గ‌లు, ప‌బ్బాలు, ఆఫ్‌సీజ‌న్ సేల్స్ ఇలా ఏదో ఒక ఆఫ‌ర్ పెడుతున్నారు.త‌గ్గింపు ధ‌ర‌లు ప్ర‌క‌టిస్తున్నారు. ఇలాంట‌ప్పుడు కొనాల‌ని ఉన్నా డ‌బ్బుల్లేక వాయిదా వేసుకునేవాళ్ల‌ను ఎట్రాక్ట్ చేయ‌డానికి ఈ ఆఫ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అదీకాక డీమానిటైజేష‌న్ త‌ర్వాత వ‌స్తువుల సేల్స్ బాగా త‌గ్గాయి. అక్టోబ‌ర్ నుంచి ఫ్రిజ్‌లు, టీవీలు వంటి వైట్ గూడ్స్ అమ్మ‌కాలు 2 నుంచి 3 శాతం త‌గ్గాయి.  మ‌రోవైపు ప్ర‌జ‌లు ఉన్న డ‌బ్బుల‌న్నీ పెట్టి ఒకేసారి వ‌స్తువు కొన‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. అందుకే బ‌య్ నౌ..పే లేట‌ర్ ఆఫ‌ర్ల జోరు పెరిగింది.

జన రంజకమైన వార్తలు