• తాజా వార్తలు

ఈ-ట్రాంజాక్ష‌న్ల‌లో మోసం జ‌రిగితే ఇక‌పై ప‌ది రోజుల్లో ప‌రిహారం

బ్యాంకు ఖాతాదారుల‌ ప్రమేయం లేకుండా వారి అకౌంట్లు, క్రెడిట్/ డెబిట్ కార్డుల నుంచి అనధికారికంగా జ‌రిగే ఈ -ట్రాంజాక్ష‌న్లలో మోసాల విష‌యంలో వినియోగ‌దారుల‌కు ర‌క్ష‌ణ చ‌ర్య‌ల గురించి రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ప‌ష్ట‌త ఇచ్చింది. అలాంటి మోసాల‌పై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే అక్క‌డి నుంచి 10 రోజుల్లోగా స‌మ‌స్య ప‌రిష్క‌రించి ఆ మొత్తాన్ని వారి అకౌంట్ కు క్రెడిట్ చేస్తామ‌ని చెప్పింది. ఒక్క రూపాయి కూడా న‌ష్ట‌పోవాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని ఆర్బీఐ భ‌రోసా ఇచ్చింది.

దేనికెంత ప‌రిహారం

ఈ బీమా పరిహారం విష‌యంలో ఏమాత్రం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది. అయితే... ఫిర్యాదు చేయ‌డంలో ఆల‌స్యమైతే మాత్రం వినియోగ‌దారుడే కొం న‌ష్టాన్ని భ‌రించాల్సి వ‌స్తుంది. మూడు రోజుల్లో కంప్ల‌యింట్ చేయాల్సి ఉండ‌గా నాలుగు నుంచి ఏడు రోజుల్లోగా రిపోర్ట్‌ చేస్తే రూ.25,000 వరకు నష్టాన్ని భ‌రించాల్సి ఉ ంటుంది. 
* ఒక‌వేళ‌ ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుంది.
* ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుంది.
* బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, సాయం కారణంగా అనధికారిక లావాదేవీ చోటు చేసుకుంటే, ఖాతాదారుడు దానిపై సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ విషయంలోనూ అతడికి ఎటువంటి బాధ్యత ఉండదు.  మొత్తం న‌ష్టానికి ఆయ‌న‌కు ప‌రిహారం అందుతుంది.
* మోసంపై ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దానిపై ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు అన్నది బ్యాంకుల బోర్డు విధానం మేరకు నిర్ణయిస్తారు.
*తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

జన రంజకమైన వార్తలు