• తాజా వార్తలు
  •  

2018 లో స్మార్ట్ ఫోన్ లలో రానున్న కీలక మార్పులు

స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి 2017 వ సంవత్సరం మార్పుకు సంకేతంగా మిగిలిపోతే రానున్న 2018 వ సంవత్సరం స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో ప్రయోగాలకు చిరునామా గా మారనుంది.భారతీయ వినియోగదారులకు రెండవ శకం హ్యాండ్ సెట్ లను పరిచయం చేయడం అనేది ఈ సంవత్సరం లో ప్రముఖంగా నిలవనుంది. హ్యాండ్ సెట్ తయారీ దారులు వారి వారి లక్ష్యాలను అధిగమించడానికి వివిధ రకాల స్ట్రాటజీ లను అనేక రకాల విధానాలను అవలంబిస్తారు. ఇవి ఒక్కో తయారీదారునికి ఒక్కో రకంగా ఉంటాయి. అయినప్పటికీ వీరందరి ముఖ్య లక్ష్యం ఒకటే ఉంటుంది.మరి రాబోయే సంవత్సరం లో ఎలాంటి స్ట్రాటజీ లను ఉపయోగించడం ద్వారా వీరు తమ లక్ష్యాలను చేరుకోనున్నారు? తద్వారా 2018 లో స్మార్ట్ ఫోన్ లలో రానున్న కీలక మార్పులు ఏవి? తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ప్రీమియం లో లభ్యత :

సరికొత్త స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకర్షించాలి అంటే దానిధర రూ 10,000/- లలోపు ఉండాలి అనే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. అయితే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో సరికొత్త అప్ గ్రేడ్ లు మరియు ప్రత్యామ్నాయాలు దూసుకువస్తున్న నేపథ్యం లో సాధారణ వినియోగదారులు కూడా ప్రీమియం ఫోన్ లపై దృష్టి పెడుతున్నాడనేది కాదనలేని నిజం. ఇదే ప్రీమియం బ్రాండ్ లకు విజయాన్ని తీసుకువచ్చింది. 2017 వ సంవత్సరం లో గణనీయంగా పెరిగిన రూ 10,000/- ల కంటే ఎక్కువ ధర ఉండే ఫోన్ ల అమ్మకాలే దీనికి నిదర్శనం. ఈ విజయo అందించిన ఉత్సాహంతో ఈ సంవత్సరం మరికొన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్ లు సందడి చేయనున్నాయి.

కలయికలు :

జియో ఇచ్చిన ప్రేరణ తో టెలికాం ఆపరేటర్ లు స్మార్ట్ ఫోన్ తయారీదారులతో చేతులు కలిపి సామాన్యునికి కూడా అందుబాటులో ఉండే ధరలలో 4 జి ఫీచర్ ఫోన్ లను తీసుకురానున్నాయి. ఈ పరిణామం స్మార్ట్ ఫోన్ తయారీదారులకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా టెలికాం ఆపరేటర్ లకు డేటా వాల్యూం రీత్యా కొంచెం ఊరటగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రారంభం లో ఇది ఏమేరకు నాణ్యతను అందించగలుగుతాయి అనేదే ప్రశ్నార్ధకo గా ఉన్నది.

టెలికాం :

దీనిని మరింత విస్తృత కోణం లో చూడవలసిన అవసరం ఉంది. స్మార్ట్ ఫోన్ లోపల ఉండే టెక్నాలజీ అనేది వివిధ రకాల స్మార్ట్ మరియు కనెక్టెడ్ పరికరాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. దీనినుండి తక్షణ ప్రయోజనం పొందాలి అంటే భారతీయ బ్రాండ్ లకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా భారతీయ బ్రాండ్ లో మరికొన్నింటి తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ లోకల్ బ్రాండ్ లు గేమింగ్ కన్సోల్ ల లాంటి అధునాతన పరికరాలపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

హైబ్రిడ్ చానల్ లు :

ప్రస్తుతం రెండు రకాల హైబ్రిడ్ చానల్ లు ఉన్నాయి. అవి ఒకటి ఆన్ లైన్ మరొకటి ఆఫ్ లైన్. ఈ రెండింటిలో ఏది అంటే రెండూ అని చెప్పవచ్చు , అలా కాకుండా ఎక్స్ క్లూజివ్ నా లేక మల్టి బ్రాండ్ చానల్ లా అంటే మాత్రం ఇది కొంచెం సంక్లిష్టత తో కూడిన ప్రశ్న గా భావించవచ్చు. షియోమీ తో ప్రారంభించబడి ఒప్పో ద్వారా వెలుగులోనికి తీసుకురాబడిన ఎక్స్ క్లూజివ్ చానల్ లను మనం చూసియున్నాము. కొన్ని చైనీస్ బ్రాండ్ లు తమ యొక్క ఎక్స్ క్లూజివ్ రిటైల్ స్టోర్ లనే ఎంచుకునే అవకాశం ఉంది. భారతీయ బ్రాండ్ లు మాత్రం తమ రిటైల్ ను ఎక్స్ క్లూజివ్ గా వ్యాప్తి చేసుకునే వనరులు లేకపోవడం వలన మల్టీ బ్రాండ్ స్ట్రాటజీ ని ఎంచుకునే అవకాశం ఉంది.

భవిష్యత్ ను వాస్తవిక దృష్టి తో చూడడం :

భవిష్యత్ టెక్నాలజీ ని కూడా దృష్టి లో ఉంచుకుని దానిని ప్రతిబింబించేలా స్మార్ట్ ఫోన్ లను తయారు చేయడం ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీదారుల ముందు ఉన్న అనేక సవాళ్లలో ఒకటి. ఇలా చేసే క్రమం లో భాగంగా వారు గత దశాబ్దం క్రితం ఉన్న టెక్నాలజీ దగ్గరే ఆగిపోతున్నారు. ఇది బ్రాండ్ విలువను దెబ్బతీస్తుంది. తద్వారా రీసెర్చ్ మరియు డెవలప్ మెంట్ యొక్క పూర్తి సామర్థ్యం దెబ్బతిని వనరులకు మరియు ఉత్పాదనకు మద్య సమతుల్యం లోపిస్తుంది. ఈ సంవత్సరం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లు ఈ అంశం పై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది.

పైన చెప్పుకున్న కారణాల రీత్యా స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి రాబోయే సంవత్సరం ప్రయోగాలకు వేదికగా మారనుంది అనేది మాత్రం అర్థం అవుతుంది. అయితే ఈ ప్రయోగాలు రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఉండాలని ఆశిద్దాం.

జన రంజకమైన వార్తలు