• తాజా వార్తలు
  •  

3జీ వ‌ర్సెస్ 4జీ వ‌ర్సెస్ 5జీ

ఇండియాలో మొబైల్ ఫోన్స్ ప‌రిచ‌య‌మ‌య్యే స‌రికి  సెల్‌ఫోన్ వాడేవాళ్లే పెద్ద గొప్ప‌. ఇక నెట్‌వ‌ర్క్ స్పీడ్ గురించి తెలిసిన‌వాళ్లు  లేనే లేరేమో. కానీ ఇప్పుడు రోజు కూలికి వెళ్లేవాళ్ల‌కు కూడా 2జీ, 3జీ, 4జీ నెట్‌వ‌ర్క్‌లు, వాటి స్పీడ్‌, పెర్‌ఫార్మెన్స్ గురించి తెలుసు. 5జీ వ‌స్తే ఇంకెంత స్పీడ్ వ‌స్తుందో అనే అంచ‌నాలు కూడా చాలామందికి ఉన్నాయి. ఇండియాలో 2జీ అంటే సెకండ్ జ‌న‌రేష‌న్‌తో మొబైల్ విప్ల‌వం మొద‌ల‌యింది. అది ఇప్పుడు ఫీచ‌ర్ ఫోన్ల‌లో మాత్ర‌మే బ‌తికుంది. ఇక స్మార్ట్‌ఫోన్ల‌లో 3జీ, 4జీ ల‌దే రాజ్యం.  జియో 4జీతో రంగ‌ప్ర‌వేశం చేశాక ఎయిర్‌టెల్‌, ఐడియా కూడా 4జీ రేస్‌లో వేగంగా ముందుకొస్తున్నాయి. ఇప్పుడు అత్య‌ధిక ఫోన్ల‌లో న‌డుస్తున్న 3జీ, 4జీ.. త్వ‌ర‌లో రాబోయే 5 జీ నెట్‌వర్క్‌ల మ‌ధ్య తేడాలేంటో చూడండి  

స్పీడే కీల‌కం
 ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు, యాప్స్  యూసేజ్‌, ఈ-కామ‌ర్స్ సైట్ల‌తో అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవ‌డం, బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్స్ ఇలా అన్నీ ఆన్‌లైన్ అయిపోవ‌డంతోపాటు  మొబైల్ కంపాట‌బులిటీతో రావ‌డంతో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఏ ప‌నైనా ఉన్న‌చోట నుంచి క‌ద‌ల‌కుండా చ‌క్క‌బెట్టేసుకుంటున్నాం. వీట‌న్నింటికీ నెట్‌వ‌ర్క్ స్పీడే కీల‌కం. 2003లో 3జీ నెట్‌వ‌ర్క్ స్టార్ట‌యిన‌ప్పుడు 200 కేబీపీఎస్‌/  సెక‌న్  స్పీడ్ వ‌చ్చేది.  ఇప్పుడు ఆ స్పీడ్‌ను 3జీ కూడా దాటేసింది. 4జీలో 10 ఎంబీపీఎస్ స్పీడ్ వ‌స్తోంది.  మరోవైపు 5జీ తీసుకొచ్చేందుకు బీఎస్ఎన్ఎల్‌, ఎయిర్‌టెల్ లాంటి కంపెనీలు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. ఎయిర్‌టెల్ కోల్‌క‌తా, బెంగ‌ళూరుల్లో  Massive Multiple-Input Multiple-Output (MIMO) నెట్‌వ‌ర్క్‌ను సెట‌ప్ చేస్తోంది. ఇండియాలో 5జీ కేప‌బులిటీ ఉన్న ఫ‌స్ట్ నెట్‌వ‌ర్క్ ఇదేన‌ని ఎయిర్‌టెల్ చెబుతోంది.  
3జీ, 4జీల్లో తేడాలివీ 
డేటా ట్రాన్స్‌ఫ‌ర్ రేట్‌:  3జీలో  3.1 ఎంబీపీఎస్ అయితే 4జీలో 100 ఎంబీపీఎస్  
ఇంట‌ర్నెట్ స‌ర్వీసులు: 3జీలో  బ్రాడ్‌బ్యాండ్ అయితే  4జీలో అల్ట్రా బ్రాడ్ బ్యాండ్  
బ్యాండ్‌విడ్త్ : 3జీలో 5-20 ఎంహెచ్‌జెడ్ అయితే 4జీలో 100 MHz.
డేటా స్పీడ్‌:  3జీలో 5.8 ఎంబీపీఎస్‌,  4జీలో 14 ఎంబీపీఎస్  

5జీకి ఉండాల్సిన ల‌క్ష‌ణాలేమిటి? 
గ్రూప్ స్పెష‌ల్ మొబైల్ అసోసియేష‌న్ (GSMA) అంచ‌నాల ప్ర‌కారం 5జీ నెట్‌వ‌ర్క్‌కు క్వాలిఫై కావాలంటే  ఈ క్రైటీరియాను క‌లిగి ఉండాలి
* 1 నుంచి 10 జీబీపీఎస్ క‌నెక్ష‌న్లు
*  1 మిల్లీ సెకండ్ ఎండ్ టు ఎండ్ రౌండ్ ట్రిప్ డిలే 
* 1000x బాండ్ విడ్త్ ప‌ర్ యూనిట్ ఏరియా 
* 10 నుంచి 100 డివైస్‌ల‌కు క‌నెక్ట్ కావాలి
*  99.999% ఎవాయిల‌బులిటీ 
* 100%  క‌వ‌రేజ్ 
* నెట్‌వ‌ర్క్ ఎన‌ర్జీ వినియోగంలో 90% త‌గ్గుద‌ల 
 కొత్త‌గా వ‌చ్చే 5జీ నెట్‌వ‌ర్క్‌లు వీటిని ఎంత‌వ‌ర‌కూ అందుకుంటాయో చూడాలి. 

జన రంజకమైన వార్తలు