• తాజా వార్తలు
  •  

అంబులెన్స్‌ల‌లో ఉబ‌ర్ మాడ్యులెన్స్‌

మ‌నకు ఎప్పుడు ఏం మెడిక‌ల్ అవ‌స‌రం వ‌స్తుందో తెలియ‌దు.  అప్పుడు మ‌నం వెంట‌నే ఫోన్ చేసేది అంబులెన్స్‌కి.  మ‌నం ఫోన్ తీసి 108 కొట్ట‌గానే కుయ్‌.. కుయ్ మంటూ అంబులెన్స్ వ‌చ్చేస్తుంది. ఒకే ఏరియాలో ఒక సంఘ‌ట‌న జ‌రిగితే ఇలా వ‌చ్చేమాట నిజ‌మే కానీ.. ఒకే ప్రాంతంలో రెండు మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీలు ఉంటే మాత్రం క‌చ్చితంగా అంబులెన్స్‌లు వెంట‌నే రావు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో బాధితుల సిట్యువేష‌న్ ఏంటి?.. వెంట‌నే అంబులెన్సు రాక‌పోతే.. వైద్య స‌దుపాయం అంక‌పోతే ఆ బాధితుల‌కు జ‌ర‌గకూడ‌నిది ఏమైనా జ‌రిగితే! ఇలాంటి సంఘట‌లు కోకొల్లుగానే జ‌రిగాయి. కానీ వాటిని ఎవ‌రు నివారిస్తారు. ఇలాంటి ప‌రిస్థితి నుంచి బాధితుల‌ను ర‌క్షించేందుకు టెక్నాల‌జీ సాయం తీసుకోవాల‌ని దిల్లీకి చెందిన మాడ్యులెన్స్ కో ఫౌండ‌ర్ ప్ర‌ణ‌వ్ బ‌జాజ్‌. ప్ర‌స్తుతం ఉబ‌ర్‌లో వాడుతున్న మాడ్యులెన్స్‌ల‌ను ఇక‌పై అంబులెన్స్‌లోనూ వాడే అవ‌కాశాలున్నాయి. 

ఏంటి ఉప‌యోగం?
అంబులెన్స్ కావాలంటే ఏం చేస్తాం? .. వెంట‌నే 108కి ఫోన్ చేస్తాం. కానీ అంబులెన్స్ అందుబాటులో లేక‌పోతే ప‌రిస్థితి విష‌మిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఉబ‌ర్ అంబులెన్స్‌లు రానున్నాయి. అంటే మ‌నం ఫోన్ చేస్తే క్యాబ్ వ‌చ్చిన‌ట్లే ఫోన్ చేస్తే వెంట‌నే ఉబ‌ర్ అంబులెన్స్ క్యాబ్‌లు రానున్నాయి. దీని వ‌ల్ల ఎమ‌ర్జెన్సీలో ఉన్న వారికి వెంట‌నే అంబులెన్స్ సాయం అందుతుంది. అందుకే ఈ అంబులెన్స్‌ల్లో ఉబ‌ర్ క్యాబ్‌ల‌లో ఉప‌యోగిస్తున్న మాడ్యులెన్స్‌ను వాడుతున్నారు.  వెంట‌నే అంబులెన్స్ దొర‌క్క త‌న తాత గుండె పోటుతో మ‌ర‌ణించ‌డంతో మాడ్యులెన్స్ కో ఫౌండ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లోనే ఈ కొత్త ఉబ‌ర్‌ అంబులెన్స్‌లు అన్ని చోట్లా అందుబాటులోకి రానున్నాయి. 

ప్ర‌త్యేక‌మైన యాప్‌
ఉబ‌ర్ మాదిరిగానే దీని కోసం ప్ర‌త్యేమైన యాప్‌ను రూపొందించ‌నున్నారు. ఈ యాప్‌తో మీరు క‌నెక్ట్ అయితే చాలు. మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న అంబులెన్స్‌లు వెంట‌నే మీ సాయం కోసం వ‌చ్చేస్తాయి. దీని వ‌ల్ల ఎక్క‌డి నుంచో అంబులెన్స్ రావాల‌న్న ఇబ్బంది ఉండ‌దు. వెంట‌నే మీకు వైద్యం కూడా అందుతుంది. అయితే ఈ అంబులెన్స్‌ల‌లో రెండు ర‌కాల ఉప‌యోగాలు కూడా ఉన్నాయి. ఒక‌టి ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఉప‌యోగించే అంబులెన్స్‌లు.. రెండో ర‌కం.. పెద్ద వాళ్లు మెడిక‌ల్ అపాయింట్‌మెంట్ల కోసం ఉప‌యోగించుకునే అంబులెన్స్‌లు.  ఎమ‌ర్జెన్సీ అంబులెన్స్‌లు చాలా వేగంగా మీకు సంబంధించిన ప్రాంతానికి వ‌చ్చేస్తాయి. 
 

జన రంజకమైన వార్తలు