• తాజా వార్తలు

గూగుల్ మ్యాప్స్ కంటే మా మ్యాప్స్ నమ్మదగ్గవి-సర్వే ఆఫ్ ఇండియా

ఇంట్లోంచే ఏ ప్రాంతం ఎక్క‌డుందో క‌రెక్టుగా చెప్ప‌గ‌లిగేలా సాయ‌ప‌డుతున్న గూగుల్ మ్యాప్ గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌వ‌స‌రం లేదు. ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక సంద‌ర్భంలో దీన్ని వినియోగిస్తూనే ఉన్నారు. ఫుడ్ డెలివ‌రీ యాప్స్‌, క్యాబ్ స‌ర్వీసెస్ వంటి ఎన్నో రంగాలు గూగుల్ మ్యాప్స్ పైనే ఆధార‌ప‌డుతున్నాయి. ఇంత‌గా ఉప‌యోగ‌ప‌డుతున్న గూగుల్ మ్యాప్స్ లో క‌చ్చిత‌త్వం చాలా త‌క్కువ‌ని ఓ దిగ్గ‌జ ప్ర‌భుత్వ సంస్థ అంటోంది. అవును... సర్వే ఆఫ్ ఇండియా తాజాగా గూగుల్ మ్యాప్స్ లో కచ్ఛితత్వం మీద సందేహాలు వ్యక్తం చేసింది. 

గూగుల్ మ్యాప్ ఏమాత్రం ప్రామాణికం కాద‌ని.. ప్రభుత్వం ప్రామాణికంగా రూపొందించిన‌ది కాదు కాబ‌ట్టి గూగుల్ మ్యాప్స్ ను ఎవ‌రూ విశ్వసించవద్దంటూ సర్వే ఆఫ్ ఇండియా అంటోంది. వెల్లడించింది. గూగుల్ మ్యాప్స్ కు బదులుగా సర్వేఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉపయోగించాలని చెబుతున్నారు ఆ సంస్థకు చెందిన కొంద‌రు అధికారులు. అంతేకాదు... గూగుల్ మ్యాప్స్ ను చూసి మోసపోవద్దని కూడా వారు హెచ్చ‌రిస్తున్నారు.

రీసెంటుగా సర్వే ఆఫ్ ఇండియా సంస్థ‌కు 250 సంవత్సరాలు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఆ సంస్థ‌కు చెందిన కొంద‌రు కీల‌క వ్య‌క్తులు మాట్లాడుతూ గూగుల్ మ్యాప్స్ ను రెస్టారెంట్లు.. పార్కులు వెతికే చిన్న కార్యక్రమాల కోసం మాత్రమే వాడుతున్నట్లుగా చెప్పారు. ముఖ్యమైన మౌలికసదుపాయాల కోసం.. కీలక ప్రాజెక్టుల కోసం తమ మ్యాప్స్ నే వాడుతున్నట్లుగా చెప్పారు. అయితే... వారు చెప్తున్న‌ట్లు మౌలిక స‌దుపాయాలు, కీల‌క ప్రాజెక్టుల అవ‌స‌రం ప్ర‌జ‌ల‌కు ఏమంత ఉండ‌దు కాబ‌ట్టి రెస్టారెంట్లు, పార్కులు వంటి కోసం స‌ర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ సాయ‌ప‌డతాయా అన్న ప్ర‌శ్న‌కు వారే స‌మాధానం చెప్పాలి.

జన రంజకమైన వార్తలు