• తాజా వార్తలు

‘జియో ఫోన్’కి మాతృక ఇదేనా..?

ముకేశ్ అంబానీ పేల్చిన లేటెస్టు బాంబు ‘జియో ఫోన్’ ఎంతగా చర్చనీయాంశమైందో తెలిసిందే. అయితే... అంబానీ అండ్ కో చెప్తున్నట్లు ఇదే తొలి 4జీ ఫీచర్ ఫోన్ కాదు. జియో కంటే ముందే ఇండియన్ మార్కెట్లో ఇలాంటి 4జీ ఫీచర్ ఫోన్ ఒకటి వచ్చింది. ప్రస్తుత జియో ఫోన్లో ఉన్న ఫీచర్లన్నీ దాదాపుగా అందులో ఉన్నాయి. అయితే.. ధర మాత్రం ఇప్పుడొస్తున్న బేసిక్ స్మార్టు ఫోన్ల రేటంత. అందుకే ఇది పెద్దగా క్లిక్ కాలేదు. ఈ మోడల్ ను మోడల్ గా తీసుకుని దానికి మార్కెటింగ్ మాయ జోడించి ముకేశ్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించారు
లావాదే ఆ క్రెడిట్
జియో కన్నా ముందే ఇలాంటి 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసిన సంస్థ లావా. 'లావా కనెక్ట్ ఎం1' పేరుతో దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఈ ఫోన్ రూ.3599 ధరకు వినియోగదారులకు లభిస్తోంది. లావా కూడా దీన్ని స్మార్టెస్టు ఫీచర్ ఫోన్ అనే మార్కెట్ కు పరిచయం చేసింది. 
    అయితే.. జియో ఫోన్‌ను రూ.1500లకే అందిస్తున్నారు. అది కూడా 3 ఏళ్లు ఆగితే వెనక్కి వస్తుంది. కానీ ఈ లావా ఫోన్‌ను రూ.3599 ధరకు అందిస్తున్నారు. జియో ఫోన్ కంటే ఇందులో స్టోరేజి ఎక్కువ. అలాగే దీనిలో ప్రముఖ సోషల్ మీడియా సైట్ల యాప్స్ అన్నీ డీఫాల్ట్ గా ఉన్నాయి. 
లావా కనెక్ట్ ఎం1 స్పెక్స్..
* 4జీ వీవోఎల్‌టీఈ
* 512 ఎంబీ ర్యామ్
* 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* వీజీఏ కెమెరా
* డ్యూయల్ సిమ్
 

జన రంజకమైన వార్తలు