• తాజా వార్తలు
  •  

షియోమి ఏది రిలీజ్ చేసినా విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ ఎందుకు అవుతోంది?

చైనా మొబైల్ త‌యారీ దిగ్గ‌జం షియోమి ఇప్పుడు ఇండియ‌న్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఎంతోకాలంగా మొబైల్ సేల్స్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న శాంసంగ్‌ను వెన‌క్కినెట్టి షియోమి ఫస్ట్ ప్లేస్‌లోకి వ‌చ్చేసింది. రెడ్‌మీ నోట్ 3, నోట్ 4, నోట్‌5, తాజాగా ఎంఐ టీవీ ఇలా షియోమి ఏ ప్రొడ‌క్ట్ రిలీజ్ చేసినా అదో సంచ‌ల‌నం. ఫ్లాష్ సేల్‌లో దాన్ని సొంతం చేసుకోవ‌డానికి ఎగ‌బ‌డే జ‌నం.. ఎందుకింత క్రేజ్‌? అస‌లు షియోమి ఏ ప్రొడ‌క్ట్ లాంచ్ చేసినా అది విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ ఎందుకవుతోంది? 
త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఫీచ‌ర్లు
రెడ్‌మీ ఫోన్లు ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో అమ్ముడ‌వ‌డానికి కార‌ణం త‌క్కువ ధ‌ర‌. శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీల‌తో పోల్చితే 30 -40% త‌క్కువ ధ‌ర‌కే సేమ్ ఫీచ‌ర్ల‌తో ఫోన్లు లాంచ్ చేయ‌డ‌మే దీని విజ‌య‌ర‌హ‌స్యం. అలాగ‌ని క్వాలిటీలో రాజీ ప‌డ‌దు. ఫోన్ల‌లో పాటించిన ఈ సూత్రాన్నే ఇప్పుడు టీవీల‌కూ వాడుతోంది. 55 ఇంచెస్ 4కే రిజ‌ల్యూష‌న్ స్మార్ట్ టీవీని కేవ‌లం 39,999 రూపాయ‌ల‌కే అందుబాటులోకి తెచ్చింది.శాంసంగ్, ఎల్జీ లాంటి కంపెనీల్లో ఇన్ని ఫీచ‌ర్లు, ఇంత సైజున్న టీవీ కావాలంటే దాదాపు ల‌క్ష రూపాయ‌ల‌వుతుంది. 
ఆన్‌లైన్‌లో దూసుకుపోవ‌డం
ఈకామ‌ర్స్‌లో షియోమి దూసుకుపోతుంది. ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ త‌ర్వాత మూడో స్థానం షియోమి ఆన్‌లైన్ పోర్ట‌ల్ ఎంఐ.కామ్‌దే.  ఏళ్ల త‌ర‌బ‌డి ఇండియ‌న్ ఈ కామ‌ర్స్‌లో 5% వాటా కోసం స్నాప్‌డీల్ లాంటి ఎన్నో సంస్థ‌లు వేల కోట్ల పెట్టుబ‌డి పెట్టి కిందామీదా ప‌డినా కానిది ఎంఐ రెండేళ్ల‌లో చేసి చూపించేసింది. మిగ‌తా పెద్ద కంపెనీల కంటే 30 నుంచి 50% వ‌ర‌కు ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉండ‌డంతో ఆన్‌లైన్ సేల్స్‌లో షియోమి ప్రొడ‌క్ట్‌ల దూకుడుకు కార‌ణం. 
యూజ‌ర్ల న‌మ్మ‌కం
స్మార్ట్ ఫోన్ల విషయంలో షియోమి మొద‌టి నుంచి కూడా వాల్యూ ఫ‌ర్ మ‌నీ ప్రొడ‌క్ట్‌ల‌ను తీసుకొస్తోంది. దీంతో త‌క్కువ ప్రైస్‌కే క్వాలిటీ ప్రొడ‌క్ట్ వ‌స్తోంద‌ని, ప్రొడ‌క్ట్ మ‌న్నిక కూడా బాగుంటుంద‌ని  యూజ‌ర్లు చెబుతుంటారు. ఓరకంగా ఇది ఎంఐకి ఓ ఫాన్ బేస్ క్రియేట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌తో పోల్చితే ప‌బ్లిసిటీకి పెద్ద‌గా ఖ‌ర్చు పెట్ట‌క‌పోయినా ఎంఐ ఆన్‌లైన్ సేల్స్‌లో దూసుకుపోవ‌డానికి దాని ఫాన్స్ చేసే మౌత్ ప‌బ్లిసిటీయే ప్ర‌ధాన కార‌ణం.  ఇప్పుడు టీవీల కేట‌గిరీలోనూ త‌క్కువ ధ‌ర‌కే బెస్ట్ ప్రొడ‌క్ట్ ఇస్తోంది. ఎంఐ వేసిన ఈ ప్లాన్ క‌రెక్ట్‌గా వ‌ర్కవుట్ అయితే టీవీల్లోనూ సోనీ, శాంసంగ్‌, ఎల్జీలాంటి పెద్ద కంపెనీల‌కు భారీ పోటీ త‌ప్ప‌దు. 
ఎక్కువ ప్రొడ‌క్ట్స్‌
చైనాలో షియోమి అంటే మొబైల్స్ మాత్ర‌మే కాదు ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్లు, వాట‌ర్ ఫ్యూరిఫ‌య‌ర్లు, ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు.. ఇలా చాలా ప్రొడ‌క్ట్‌లు అమ్ముతుంది. ఈ ప్రొడ‌క్ట్‌లు క్వాలిటీగా ఉండ‌డంతో కొత్త ప్రొడ‌క్ట్ ఏది వ‌స్తుంద‌న్నాదానిమీద యూజ‌ర్లు అదే న‌మ్మ‌కంతో కొంటున్నారు. ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోవ‌డం వ‌ల్లే షియోమి  ఏ ప్రొడ‌క్ట్ తెచ్చినా అది భారీ స‌క్సెస్ అవుతోంది.  ఇండియాలో ఇన్ని ప్రొడ‌క్ట్‌లు అమ్మ‌క‌పోయినా మార్కెట్లోకి తెచ్చిన ప్ర‌తిదీ సూప‌ర్ స‌క్సెస్ అవుతోంది.
మార్కెటింగ్ స్ట్రాట‌జీ
షియోమి త‌న మార్కెటింగ్ స్ట్రాట‌జీని ఎప్ప‌టిక‌ప్పుడు చేంజ్ చేసుకుంటూ వెళ్ల‌డం కూడా దాని విజ‌యానికి కార‌ణం. ఫ‌స్ట్‌లో ఆన్‌లైన్‌మీదే ఆధార‌ప‌డింది.  ఇండియాలో ఇప్ప‌టికీ 70, 80 శాతం మీద షాప్‌లో వ‌స్తువును చూసి సంతృప్తి ప‌డితేనే వ‌స్తువు కొంటారు. అందుకే  సొంతంగా స్టోర్‌లు తెరిచి ఆఫ్‌లైన్‌లోనూ అమ్మ‌కాలు ప్రారంభించింది.  భారీగా అమ్మ‌కాలు పెరిగాయి.. దీంతో స‌ర్వీస్ సెంట‌ర్ల‌నూ భారీగా పెంచుతోంది. ఆన్‌లైన్‌లోనూ స‌ర్వీస్ సెంట‌ర్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవ‌చ్చు. స‌ర్వీస్ ఎక్క‌డి వ‌ర‌కు వ‌చ్చిందో ఆన్‌లైన్‌లోనూ చెక్ చేసుకునే ఫెసిలిటీలు తీసుకొచ్చింది. 

జన రంజకమైన వార్తలు