• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - మ‌న ఫేవ‌రెట్ ఫొటో ఫార్మాట్ జేపెగ్‌ను రీప్లేస్ చేయ‌నున్న హెయిఫ్‌

కంప్యూట‌ర్లు, డిజిట‌ల్ కెమెరాల యుగం ప్రారంభ‌మ‌య్యాక మ‌నంద‌రికీ ప‌రిచ‌య‌మైన ఫోటో ఫార్మాట్‌ జేపెగ్ (JPEG) . 1992 నుంచి  ఈ ఫార్మాట్ అందుబాటులో ఉంది. అయితే దీనికి ప్రత్యామ్నాయం త‌యారుచేయ‌డానికి కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.  అలాంటి ఆలోచ‌న‌ల్లో నుంచి పుట్టుకొచ్చిన కొత్త ఫొటో ఫార్మాట్‌... హెయిఫ్ (HEIF)
 ఏమిటీ హెయిఫ్‌?
 జేపెగ్ ఈరోజుకీ ప‌ర్‌ఫెక్ట్ పిక్చ‌ర్ ఫార్మాటే.  అంతేకాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ అత్య‌ధికంగా వాడుతున్న‌ది కూడా. అయితే టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అయ్యే కొద్దీ త‌క్కువ ప్లేస్‌లో ఎక్కువ క్వాలిటీతో కూడిన ప్రొడ‌క్ట్‌ల‌కు గిరాకీ పెరుగుతోంది. హెయిఫ్ (HEIF) అంటే  హై ఎఫిషియ‌న్సీ ఇమేజ్ ఫార్మాట్ (High Efficiency Image Format) కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తుంది. ఇప్ప‌టికే యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్ లాంటి టెక్నాల‌జీదిగ్గ‌జాలు జేపెగ్‌కు ప్ర‌త్యామ్నాయంగా  హెయిఫ్‌ను వాడ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ఐవోఎస్ 11, మాక్ ఓఎస్ హై సియెర్రా,విండోస్ 10, ఆండ్రాయిడ్ 10 వంటి ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో హెయిఫ్ వాడ‌కానికి మార్గం సుగ‌మ‌మైంది.
 హెయిఫ్ ఎందుకు ముద్దు?
 యాపిల్ త‌న లైవ్ ఫొటోస్ ఫీచ‌ర్‌లో భాగంగా ఫోటోల‌తోపాటు చిన్న‌చిన్న వీడియో క్లిప్స్‌ను కూడా క్యాప్చ‌ర్ చేస్తుంది. జేపెగ్ ఫార్మాట్‌లో అయితే ఫొటో ఒక‌చోట‌, వీడియో ఒక‌చోట సేవ్ అవుతాయి. అదే హెయిఫ్‌లో అయితే ఫొటో, వీడియో క్లిప్ రెండూ ఒకే కంటెయిన‌ర్‌లో సేవ్ అవుతాయి. ఇది ఇమేజ్‌, వీడియోల‌ను మేనేజ్ చేయ‌డాన్ని ఈజీ చేయ‌డ‌మేకాదు. స్పేస్ కూడా బాగా ఆదా అవుతుంది.
 * ఎందుకంటే  ఫోన్లు, కెమెరాల్లో హైరిజ‌ల్యూష‌న్ ఇమేజ్‌లు, వీడియోలు క్యాప్చ‌ర్  చేయ‌డానికి త‌గిన లెన్స్‌లు కుప్ప‌లుతెప్ప‌లుగా వ‌చ్చి ప‌డుతున్నాయి. ఒక్క నిముషం 4కే వీడియో షూట్ చేస్తే అది 400 ఎంబీ స్పేస్‌ను ఆక్ర‌మిస్తుంది. అదే హెయిఫ్‌తో అయితే 200 ఎంబీలోనే ఈ 4కే వీడియోను సేవ్ చేసుకోవ‌చ్చు.అంటే స‌గానికి స‌గం స్పేస్ మిగులుతుంది.
 * ఆ లెక్క‌న దాన్ని అప్‌లోడ్‌, డౌన్‌లోడ్ చేయ‌డానికి డేటా కూడా త‌క్కువ ఖ‌ర్చ‌వుతుంది.
 * హెచ్‌డీఆర్‌, 3డీ సీన్ డేటా, డెప్త్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఉన్న ఫొటోలను కంప్రెస్ చేసినా కూడా క‌ల‌ర్ క్వాలిటీ త‌గ్గిపోకుండా ఉంటుంది.
 * ప్ర‌స్తుతం సెల్‌ఫోన్ కెమెరాలు 10 బిట్ క‌ల‌ర్ గామ‌ట్స్‌తో వ‌స్తున్నాయి. అయితే అవుట్‌పుట్ వ‌చ్చేస‌రికి 8 బిట్స్ దాట‌డం లేదు.అందుకే స్మార్ట్‌ఫోన్‌ల్లో స‌న్‌సెట్‌లాంటి క‌ల‌ర్‌ఫుల్ ఫోటోలు తీసిన‌ప్పుడు అవుట్‌పుట్ డ‌ల్‌గా క‌నిపిస్తుంది.హెయిఫ్‌లో 16 బిట్ క‌ల‌ర్ స‌పోర్ట్ ఉండ‌డంతో ఫొటోలు క్లారిటీగా, మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తాయి.
 పేటెంట్ ఉంది జాగ్ర‌త్త‌!
 హెయిఫ్‌ను డెవ‌ల‌ప్ చేసిన  HEVC గ్రూప్‌.. పేటెంట్ లైసెన్సింగ్ ఫీజుల విష‌యంలో రాజీప‌డ‌డం లేదు. దీంతో ఈ గ్రూప్ మూడుకింద విడిపోయింది. దీంతో వెరైనా హెయిఫ్ వాడాల‌నుకుంటే ముగ్గురికీ వేర్వేరుగా ఫీజు చెల్లించాలి.  చిన్న కంపెనీల‌కు ఇది చాలా భార‌మ‌వుతుంది. కోట్ల మంది యూజ‌ర్లు ఉంటారు కాబట్టి ఈ విష‌యంలో కంపెనీ ఒక అండ‌ర్‌స్టాండింగ్‌కు వ‌స్తే హెయిఫ్‌కు ఎక్కువ మందికి చేరువ‌వుతుంది

జన రంజకమైన వార్తలు