• తాజా వార్తలు

ఇంటెల్ కోర్ ఐ 9 ఎలా ఉండబోతోంది?

ఇంటెల్ లేటెస్ట్ ఐ 9 ప్రాసెసర్ లకు సంబందించిన సమాచారం బయటకు వచ్చేసింది. ఇవి చాలా ఖరీదు తో కూడుకున్నవి గా ఉండనున్నాయి. 18 కోర్ డెస్క్ టాప్ చిప్ ను కలిగి ఉండే దీని యొక్క ధర సుమారు గా 2000 ల డాలర్ లు ఉండనుంది. అయితే ఎక్స్ సిరీస్ లేదా ఇంటెల్ కోర్ ఐ 9 ప్రాసెసర్ లు గా పిలవబడే ఇవి వివిధ రకాల మోడల్ లలో ఉండనున్నాయి. 10, 12, 14 మరియు 16 కోర్ వేరియంట్ లలో లభించే వీటి ధర వేయి డాలర్ లనుండీ ప్రారంభం అవనుంది.
ఇందులో ఉండే క్లోక్ స్పీడ్ 3.4 GHz గా ఉంది 4.3 GHz డ్యూయల్ కోర్ స్పీడ్ వరకూ విస్తరించనుంది. ఇది టర్బో బూస్ట్ 2.0 మరియు 3.0 ల యొక్క సపోర్ట్ తో రానుంది.
హీట్ సమస్య ను పరిష్కరించడానికి ఇందులో స్వంత కూలింగ్ సొల్యూషన్ ను కలిగిన అనేక కోర్ లను ఇందులో ఉంచడం జరిగింది. ఈ కూలింగ్ సొల్యూషన్ అనేది 140 W థర్మల్ డిజైన్ పాయింట్ ల వరకూ తట్టుకోగల ఒక లిక్విడ్ సొల్యూషన్. ఇది అందరికీ అందుబాటులో ఉండదు కానీ హార్డ్ వేర్ అంటే ఎక్కువ ఆసక్తి ఉండే వారికీ మాత్రం ఇది చక్కగా ఉపయోగపడగలదు.
ఇది ప్రస్తుతం ఉన్న అత్యంత పవర్ ఫుల్ న్యూ వెర్షన్ లైన ఐ 5 మరియు ఐ 7 ప్రాసెసర్ లతో ఇది రానుంది. గేమర్ లు మరియు కాంటెంట్ మేకర్ లు అందరూ దీనిని ఖచ్చితంగా వాడే అవకాశం ఉంది. దీనిని ఉపయోగించి ప్లేయింగ్ మరియు రికార్డింగ్ ఒకేసారి చేయవచ్చు.
ఇందులో 18 కోర్ లు మరియు 36 థ్రెడ్ లు ఇంటెల్ యొక్క మొట్టమొదటి కన్స్యూమర్ డెస్క్ టాప్ గా పేరుగాంచింది. ఈ కోర్ x ఫ్యామిలీ లో ఐ 5 7640 x యొక్క ధర 242డాలర్ లు ఉండనుంది. ఇందులో 4 థ్రెడ్ లు మరియు 4 కోర్ లు ఉంటాయి.
ఈ సరీకొత్త ప్రాసెసర్ లు స్కై లేక్ ఫ్లాట్ ఫాం ను కలిగి ఉండనున్నాయి.

జన రంజకమైన వార్తలు