• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ: కీబోర్డ్ అవసరం లేకుండా చేయనున్న‌ పెను మార్పులివే

కంప్యూట‌ర్ ముందు కూర్చున్నామంటే మ‌న చేతులు  కీబోర్డు మీద  ఆడాల్సిందే.  కీ బోర్డు లేకుండా మ‌న  చేతులు క‌ట్టేసినట్టే అవుతుంది.  ఆండ్రాయిడ్ ఫోన్ కూడా అంటే కీ ప్యాడ్‌ను ఉప‌యోగించ‌కుండా మ‌నం ఏం చేయ‌లేం. ఆప‌రేష‌న్స్ అన్నీ కీబోర్డు మీదే ఆధార‌ప‌డి ఉంటాయి. అయితే నెమ్మ‌దిగా కీబోర్డు, కీప్యాడ్ అవ‌స‌రం లేని ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ  కొత్త కొత్త ఆప్ష‌న్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి.  ఇప్ప‌టికే చాలా ఆప్ష‌న్లు వ‌చ్చి కీబోర్డుతో  ప‌ని లేకుండా చేసేశాయి.  మ‌రి  అలాంటి కొన్ని అందుబాటులో ఉన్న ఫీచ‌ర్లేమిటో చూద్దామా...

స్పీచ్ రిక‌గ‌నైజేష‌న్‌
యాపిల్ సిరి.. మైక్రోసాఫ్ట్ కోర్టానా, గూగుల్ అసిస్టెంట్....పేరు  ఏదైనా ప‌ని ఒక్క‌టే  అదే స్పీచ్‌ను గుర్తించ‌డం. అంటే మ‌నం  మాట్లాడిన మాట‌ల్ని గుర్తించి ఆ ప‌ని చేయ‌డం ఈ టెక్నాల‌జీ ప్ర‌త్యేక‌త‌. క‌లోజ‌ల్ అమౌంట్ ఆఫ్ డేటాను క‌లెక్ట్ చేసుకుని దాని ద్వారా మ‌న మాట‌ల్ని వెంట‌నే  గుర్తుప‌ట్టి దానికి  త‌గ్గ‌ట్టుగా రెస్పాండ్ కావ‌డం ఈ సాఫ్ట్‌వేర్లు చేసే ప‌ని. మెరుగైన‌ మైక్రోఫోన్ టెక్నాల‌జీ ద్వారా ఇది వ‌ర్క్ చేస్తుంది. దీని కోసం కొన్ని అల్గ‌రిథ‌మ్స్ ఉంటాయి.  త్వ‌ర‌లోనే కంప్యూట‌ర్ల‌లోనూ ఇదే టెక్నాల‌జీ మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంటే మ‌నం కీ బోర్డును ముట్టుకోన‌వ‌స‌రం లేకుండానే  ప‌నులు జ‌రిగిపోయే రోజులు ముందున్నాయి.

ట‌చ్ చేస్తే చాలు...
ఇప్ప‌టికే స్మార్ట్‌ఫోన్‌ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్లు వ‌చ్చేశాయి. వీటి ద్వారా మ‌నం సెక్యూరిటీ ఇంకా టైట్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చింది. ఫింగ‌ర్ ఉంచ‌డం ద్వారా మ‌నం సెక్యూరిటీ చెక్ చేసుకోవ‌చ్చు. అంటే మ‌నం జ‌స్ట్ ట‌చ్ చేయ‌డం ద్వారా ఆ డివైజ్‌లోకి  ఎంట‌ర్ కావొచ్చు. త్వ‌ర‌లోనే కంప్యూట‌ర్‌లోనూ ఇదే టెక్నాల‌జీ అందుబాటులోకి రానుంది. జ‌స్ట్ స్క్రీన్ ట‌చ్ చేయ‌డం ద్వారా మ‌నం  బ్రౌజింగ్ చేసుకోవ‌చ్చు.  ఇత‌ర ప‌నులు చేసుకోవ‌చ్చు. జ‌స్చ‌ర్ కంట్రోల్ సిస్ట‌మ్ మీద వంద‌లాది  కంపెనీలు అహ‌ర్నిలు క‌ష్ట‌ప‌డుతున్నాయి. జస్ట్  హ్యాండ్ క‌ద‌లిక‌ల ద్వారా మ‌నం ప‌నులు జ‌రిగిపోయే రోజులు రానున్నాయి.

డిజిట‌ల్ టాటూస్‌
కీ బోర్డు అవ‌స‌రం లేకుండా కంప్యూట‌ర్‌ని ఆప‌రేట్ చేయడం కోసం వ‌చ్చిన  మ‌రో ఆప్ష‌న్ డిజిట‌ల్ టాటూస్‌.  ఎంఐటీ మీడియా ల్యాబ్ దీన్ని రూపొందించింది. డ్యుయోస్కిన్ సిస్ట‌మ్స్ దీన్ని డెవ‌ల‌ప్ చేస్తోంది. ఇదో ఫాబ్రికేష‌న్ టెక్నిక్. ఇది ఆన్ స్కిన్ ఇంట‌ర్‌ఫేస్‌లా ఉప‌యోగ‌ప‌డుతుంది.  వైర్‌లెస్ ద్వారా ఇది మీ కంప్యూట‌ర్‌ని, ఫోన్‌ను క‌నెక్ట్ చేస్తుంది. కీబోర్డును ఉప‌యోగించాల్సిన అవ‌స‌ర‌మే లేదు.  దీన్ని మ‌రింత మెరుగ్గా రూపొందించడం కోసం ఎంఐటీ ప్ర‌యోగాలు చేస్తోంది.   

ఐ ట్రాకింగ్
మీ కంప్యూట‌ర్‌ని ఇక దూరం పెట్టేసి పూర్తిగా మీరే క‌ళ్ల ద్వారే ఆపరేట్ చేసే రోజులు వ‌స్తున్నాయా! ఇప్పుడు వ‌స్తున్న‌కొన్ని టెక్నాల‌జీల‌ను చూస్తే అదే నిజ‌మ‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చిందే ఐ ట్రాకింగ్‌. అంటే మీ కంటికి  అందే  ఏ విష‌యాన్నైనా ఇట్టే ప‌సిగ‌ట్టి దాన్ని  ఎల‌క్ట్రానికి త‌రంగాల్లోకి పంప‌డం ఈ టెక్నాల‌జీ ప్ర‌త్యేక‌త‌.  అల్యూమినియం కాంటాక్ట్ లెన్స్‌ల ద్వారా   ఇప్పుడు దీన్నిప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్నారు.  మీ ఐ కి ఏ ప్రొడెక్ట్ సూట్ అవుతుంది. ఎలా దాన్ని ఉప‌యోగించాల‌నే విష‌యంపై ప్ర‌యోగాలు నిర్వహిస్తున్నారు.                                                           

జన రంజకమైన వార్తలు