• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ: ఏమిటీ 13 అంకెల మొబైల్ నంబ‌ర్ తిర‌కాసు?

మొబైల్ నంబ‌ర్ అంటే ఎన్ని అంకెలు ఉంటాయి? ఇదేం ప్ర‌శ్న అనుకుంటున్నారా? ఏ మొబైల్ నంబ‌ర్‌కైనా ప‌ది అంకెలే క‌దా ఉండేది అంటారా! కానీ ఇక‌పై మొబైల్ నంబ‌ర్‌కు 13 అంకెలు ఉంటాయ‌ట‌! విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ 13 అంకెల మొబైల్ నంబ‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ 13 అంకెల మొబైల్ నంబ‌ర్లు అంద‌రికి దొర‌కని అంటున్నారు. మిష‌న్ టు మిష‌న్  (ఎం2ఎం) క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ మొబైల్ నంబ‌ర్లు ల‌భ్యం అవుతాయ‌ట‌. మ‌రి ఇందులో ఏది? ఎందుకిలా వారికి మాత్ర‌మే ఈ నంబర్లు?

వార్త వాస్త‌వ‌మే కానీ..
13 అంకెల మొబైల్ నంబ‌ర్లు రానున్నాయ‌నే వార్త 100 శాతం నిజ‌మే. కానీ ఇవి అంద‌రికి అందుబాటులో ఉండ‌వ‌నేది కూడా నిజ‌మే. అక్టోబ‌ర్ 18 నుంచి అంద‌రు ఎగ్జిస్టింగ్ మిష‌న్‌ టు మిష‌న్ క‌ష్ట‌మ‌ర్ల‌కు 13 అంకెల మొబైల్ నంబ‌ర్లు వాడాల‌ని భార‌త టెలికాం శాఖ  టెలికాం ఆప‌రేట‌ర్ల‌ను ఆదేశించింది. ఆ త‌ర్వాత జులై 1 నుంచే ఈ మిష‌న్ 2 మిష‌న్ 13 అంకెట మొబైల్ నంబ‌ర్ల వాడ‌కం మొద‌ల‌వుతుంద‌ని టెలికాం శాఖ తెలిపింది. ఇలాంటి ఎం2ఎం 13 అంకెల మొబైల్ నంబ‌ర్ల‌ను ఇష్యూ చేయ‌డం డిసెంబ‌ర్ 31, 2018 క‌ల్లా పూర్తి చేయాల‌ని కూడా ఆ సంస్థ టెలికాం ఆప‌రేటర్ల‌ను ఆదేశించింది. దీని వ‌ల్ల భార‌త్‌లో మొబైల్ నంబ‌ర్లు వాడుతున్న వారికి ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌నే రూమ‌ర్ల‌ను కూడా ఆ సంస్థ కొట్టిపారేసింది. కేవ‌లం ఎగ్జిస్టింగ్ మిష‌న్ 2 మిష‌న్ క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని మిగిలిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని ఆ సంస్థ తెలిపింది.

ఏమిటీ ఎం2ఎం క‌మ్యూనికేష‌న్‌?
13 డిజిట్ల మొబైల్ నంబ‌ర్ అన‌గానే ఇప్పుడు గుర్తుకొస్తుంది ఎం2ఎం (మిష‌న్ టు మిష‌న్‌). మ‌రి మిష‌న్ టు మిష‌న్ అంటే ఏమిటి? అంటే మిష‌న్ల‌కు డివైజ్‌ల‌కు మ‌ధ్య జ‌రిగే ఇంట‌రాక్ష‌న్‌. అంటే విమానం, షిప్‌, కార్లు ఇలాంటి వాటిని ఇంట‌ర్నెట్‌కు క‌నెక్ట్ చేయ‌డం లాంటిది. ఇలా డివైజ్ నుంచి  మిష‌న్ల‌ను క‌నెక్ట్ చేయాలంటే క‌చ్చితంగా ఎం2ఎం సిమ్ కార్డు కావాలి. మామూలు సిమ్ కార్డు ప‌ని చేయ‌దు. అయితే విశేషం ఏమిటంటే ఈ సిమ్ కార్డును మామూలు మొబైల్స్‌లో కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. వొడాఫోన్‌, ఎయిర్‌టెల్ లాంటి ఆప‌రేటర్లు ఎక్కువ‌గా ఈ ఎం2ఎం సిమ్‌ల‌ను జారీ చేస్తాయి. ట్రాన్స్‌ఫోర్ట్‌, ప‌వ‌ర్‌, యుటిలిటీస్, లాజిస్టిక్స్, హెల్త్‌, షిప్పింగ్ లాంటి సంస్థ‌ల‌కు ఈ ఎం2ఎం సిమ్‌ల అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది.

జన రంజకమైన వార్తలు