• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - 8 కే టీవీ ఎలా ఉండ‌బోతోంది?

కేవ‌లం ఫోన్లు మాత్ర‌మే కాదు టెలివిజ‌న్ల‌లో కూడా వేగంగా మార్పులు వ‌స్తున్నాయి. సీజ‌న్ సీజ‌న్‌కు కొత్త కొత్త టీవీలు మార్కెట్లోకి దిగుతున్నాయి. స్మార్ట్ టీవీలు వ‌చ్చిన త‌ర్వాత టీవీల్లో చాలా మార్పులు  వ‌చ్చాయి. వీలైనంత స్మార్ట్‌గా ఉంటేనే టీవీలు అమ్ముడుపోతాయ‌నే నమ్మ‌కం వ‌చ్చేసింది కంపెనీల్లో. అందుకే వీలైన‌న్ని ఎక్కువ ఫీచ‌ర్ల‌తో టీవీలు త‌యార‌వుతున్నాయి. అయితే ఇప్ప‌టిదాకా మ‌న‌కు 4 కే రిజ‌ల్యూష‌న్ టీవీల గురించి తెలుసు. ఇప్పుడు ట్రెండ్ మారింది 8 కే రిజ‌ల్యూష‌న్ టీవీలు రాబోతున్నాయి. మ‌రి ఈ 8 కే రిజ‌ల్యూష‌న్ టీవీలు ఎలా ఉండ‌బోతున్నాయి?

అద్భుత‌మై డిప్‌ప్లేతో...
టీవీ కొంటున్నారంటే ఎవ‌రైనా కోరుకునేది అద్భుత‌మైన డిస్‌ప్లే. అయితే 4 కే టీవీలు వ‌చ్చిన త‌ర్వాత రిజ‌ల్యూష‌న్ అనే ప‌దానికి అర్ధాలు మారిపోయాయి. పిక్స‌ల్స్, హెడ్ ఈ ప‌దాలు వినియోదారుల‌కు చాలా సుల‌భంగా  అర్ధం అవుతున్నాయి. రిజ‌ల్యూష‌న్ విష‌యంలో వారు ఏమాత్రం రాజీ ప‌డ‌ట్లేదు. అంటే ఇప్ప‌టిదాకా ఉన్న 4 కే స్థానం వ‌స్తున్న 8 కే టీవీలు ఎంతో ప్ర‌భావ‌వంత‌మైన‌వి.  అంటే మ‌నుప‌టి టీవీల కంటే రెట్టింపు డిస్‌ప్లే ఇవ్వ‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న‌వి.  33 మిలియ‌న్ పిక్స‌ల్ సామ‌ర్థ్యం దీనిలో ఉందంటేనే దీని ప‌వ‌ర్ అర్ధం చేసుకోవ‌చ్చు. మిగిలిన టీవీల‌కు దీనికి విజువ‌ల్ డిఫెరెన్స్ చూపించ‌డం కోసం హెచ్‌డీఆర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. బ్రౌట్‌, క‌ల‌ర్‌ఫుల్‌గా స్క్రీన్‌ను ఉంచ‌డంలో దీనిదే కీల‌క‌పాత్ర‌.

ఎలా వ‌చ్చింది..
నిజానికి 4 కే వ‌చ్చిన కొన్ని నెల‌ల‌కే 8కే రిజ‌ల్యూష‌న్ ఆవిర్భావం జ‌రిగింది. కానీ దీనిలో మార్పులు తేవ‌డానికి, ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించి మార్కెట్లోకి వ‌ద‌ల‌డానికి చాలా స‌మయం ప‌ట్టింది. 2013లో 8కే పుట్టింది. 85 అంగుళాల మోడ‌ల్ టీవీతో దీన్ని ప‌రీక్షించ‌డం జ‌రిగింది. అయితే ఈ టైపు టీవీలు ప్ర‌స్తుతం అందుబాటులో లేవు. చాలాకంపెనీలు ఇప్పుడు 8కే మీద ఆస‌క్తి చూపిస్తున్నాయి. భ‌విష్య‌త్ 8కే దే అని అన్ని ప్ర‌ధాన కంపెనీలు బ‌లంగా న‌మ్ముతున్నాయి. జ‌పాన్‌కు చెందిన బ్రాడ్‌కాస్ట‌ర్ ఎన్‌హెచ్‌కే 8కేను త్వ‌ర‌లోనే రంగంలోకి తీసుకు రాబోతోంది. 2016 రియో ఒలింపిక్స్ స‌మ‌యంలో ఈ  8కే టీవీల‌ను ఎన్‌హెచ్‌కే ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించింది. 

ఎప్పుడొస్తుంది..
త్వ‌ర‌లోనే 8కే పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే 4 కే కోసం చాలా డ‌బ్బులు వెచ్చిస్తున్నారు వినియోగ‌దారులు. అందుకే అదే ధ‌ర‌లో అటు ఇటుగా 8కేను అందిస్తే త్వ‌ర‌గా మార్కెట్లో నిల‌దొక్కుకోవ‌చ్చ‌ని అన్ని కంపెనీలు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నాయి. 85 అంగుళాల డిస్ ప్లే ఉన్న 4కే టీవీలు ఇప్ప‌డు 5 వేల డాల‌ర్ల‌కు కూడా దొరుకుతున్నాయి. అయితే 8 కే టీవీలు ఆరంభ ధ‌ర క‌చ్చితంగా ఎక్కువ‌గానే  ఉండ‌బోతుంది. మెల్లిగా ఇది త‌గ్గే అవ‌కాశాలున్నాయి. దీన్ని ఎల్‌జీ కంపెనీల 20 వేల డాల‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. భార‌త్‌లోనూ ఇది త్వ‌ర‌లో లాంఛ్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

జన రంజకమైన వార్తలు