• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ఆధార్ వ‌ర్చువ‌ల్ ఐడీ ఇంకా తీసుకోలేదా ?..తొట్ట తొలి ప్రివ్యూ మీకోసం..

మొబైల్ క‌నెక్ష‌న్‌, గ్యాస్ క‌నెక్ష‌న్‌, పాన్‌కార్డ్‌, బ్యాంక్ అకౌంట్‌, గ‌వ‌ర్న‌మెంట్ స్కీమ్స్ అన్నింటికీ ఆధార్ కార్డే ఆధారం అంటోంది ప్ర‌భుత్వం. మ‌రోవైపు ఆధార్ కార్డ్ స‌మాచారం దుర్వినియోగం అవుతుంటూ నిత్యం విమ‌ర్శ‌లు.  కోర్టుల్లో కేసులు.  ఆధార్ స‌మాచారం మార్కెట్లో ఎంత చౌక‌గా దొరుకుతుందో చూడండ‌ని ద ట్రిబ్యూన్ అనే ప‌త్రిక ఇన్వెస్టిగేష‌న్ స్టోరీ కూడా ప్ర‌చురించడం పెద్ద సంచ‌ల‌న‌మైంది. దీంతో ఆధార్ ఇష్యూ చేసే అధారిటీ అయిన  uidai వెంట‌నే రంగంలోకి దిగింది. ఆధార్ నెంబ‌ర్ ఇవ్వ‌డం ద్వారా ఆ వ్య‌క్తి స‌మాచారం వేరేవాళ్ల చేతిలో ప‌డి దుర్వినియోగం అయ్యే ప్ర‌మాద‌ముంది కాబ‌ట్టి దాని బ‌దులు వ‌ర్చువ‌ల్ ఐడీ (VID)ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.మార్చి 1 నుంచి దీన్ని అమ‌ల్లోకి తెస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఒక నెల లేటుగా అయినా లేటెస్ట్‌గా ఈ ఫీచ‌ర్‌ను యూఐడీఏఐ త‌న వెబ్‌సైట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. 

ఏమిటీ వ‌ర్చువ‌ల్ ఐడీ? 
వ‌ర్చువ‌ల్ ఐడీ అనేది 16 అంకెల నెంబ‌ర్‌. మీ ఆధార్ నెంబ‌ర్ ద్వారా దీన్ని పొంద‌వ‌చ్చు. ఆధార్ అవ‌స‌ర‌మైన చోట మీ వ‌ర్చువ‌ల్ ఐడీని ప్ర‌జంట్ చేస్తే అందులో కొంత స‌మాచారం మాత్ర‌మే అంటే మీ ఐడెంటిటీ ప్రూఫ్ లేదా అడ్ర‌స్ ప్రూఫ్ వంటి వివరాలే తెలుస్తాయి.  ఆధార్ కార్డ్‌లో ఉన్న పూర్తి వివ‌రాలు తెలియ‌వు. అలా మీ ప్రైవ‌సీని కాపాడుకోవ‌చ్చ‌నేది యూఐడీఏఐ ఆలోచ‌న‌.  నిర్ణీత కాలంలో మీ ఆధార్ నెంబ‌ర్‌తో ఒక్క వ‌ర్చువ‌ల్ ఐడీని మాత్ర‌మే పొంద‌గ‌ల‌రు. ఒక‌వేళ మీరు వ‌ర్చువ‌ల్ ఐడీని మ‌ర్చిపోతే దాన్ని తిరిగి రిట్రీవ్ చేసుకోవ‌డానికి కూడా ఆప్ష‌న్ ఉంది.

వర్చువ‌ల్ ఐడీని ఎలా పొందాలి?
1. https://uidai.gov.in/లోకి వెళ్లండి 

2. హోం పేజీలో మూడో ట్యాబ్‌లో Aadhaar Services అని క‌నిపిస్తుంది.  దానిలో లాస్ట్ ఆప్ష‌న్‌గా Virtual ID (VID) Generator ఉంటుంది.

3. Virtual ID (VID) Generatorని క్లిక్ చేస్తే VID Generation పేజీలోకి వెళ‌తారు.

4. ఈ పేజీలో ఎడ‌మ వైపు Generate / Retrieve VID అనే బాక్స్ ఉంటుంది. దీనిలో ఆధార్ నెంబ‌ర్ అని ఉన్న బాక్స్‌లో మీ ఆధార్ నెంబ‌ర్‌ను, దాని కింద ప‌క్క‌న క‌నిపించే సెక్యూరిటీ కోడ్‌ను ఎంట‌ర్ చేయండి.  సెండ్ ఓటీపీ నొక్కండి.

5. ఇప్పుడు ఆధార్ సైట్‌లో రిజిస్‌tర్ చేసుకున్న మీ మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. 

6  కుడిప‌క్క‌నున్న బాక్స్‌లో ఎంట‌ర్ ఓటీపీ అన్న‌చోట ఓటీపీ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయండి. దానికింద‌ Generate VID అని క‌నిపిస్తుంది. దాని ముందున్న స‌ర్కిల్‌ను ఫిల్ చేస్తే మీ వ‌ర్చువ‌ల్ ఐడీ క్రియేట్ అవుతుంది. నేరుగా అది మీ మొబైల్ నెంబ‌ర్‌కు మెసేజ్ వ‌స్తుంది. 

7. ఇప్ప‌టికే మీరు  వ‌ర్చువ‌ల్  ఐడీ క్రియేట్ చేసుకుంటే దాన్ని రిట్రీవ్ చేయ‌డానికి Retrieve VID అనే ఆప్ష‌న్ ముందున్న స‌ర్కిల్‌లో టిక్ చేయండి. 

ఎక్క‌డ వాడాలి?
ప్ర‌స్తుతానికి ఈ వ‌ర్చువ‌ల్ ఐడీని క్రియేట్ చేసుకోగ‌లుగుతున్నాం కానీ దాన్నిఎక్క‌డ వాడాలో ఎక్క‌డ వాడుకోకూడ‌దో స్ప‌ష్ట‌త లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేసేద‌గ్గ‌ర మీ ఒరిజిన‌ల్ ఆధార్ నెంబ‌రే ఇవ్వాలి. కానీ సిమ్ కార్డ్‌కు,  లేదా ఏదా వాలెట్‌కో ఇలా కేవ‌లం మీ ఐడీ కోస‌మే ఆధార్ అడిగే వారికి వ‌ర్చువ‌ల్ ఐడీ స‌రిపోతుంద‌ని భావిస్తున్నారు.దీనిపై యూఐడీఐఏ  ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న ఏమీ చేయ‌లేదు.

జన రంజకమైన వార్తలు