• తాజా వార్తలు

భార‌త్‌లో ఎయిర్‌టెల్ 4జీ వోల్టే షురూ, కంపాట‌బుల్ హ్యాండ్‌సెట్స్ ఏవి?.. యాక్టివేష‌న్ ఎలా?

జియోతో పోటీకి సై అంటున్న ఎయిర్‌టెల్ నెమ్మ‌దిగా జోరు పెంచుతోంది. దీనిలో భాగంగానే భారత్ మొత్తం 4జీ వొలైట్ స‌ర్వీసులు ఏర్పాటు చేయాల‌నే ల‌క్ష్యంతో దూసుకెళ్తోంది. ఈ నేప‌థ్యంలోనే ముంబ‌యిలో మొద‌టిగా పూర్తి స్థాయిలో ఎయిర్‌టెల్ 4జీ వొలైట్ స‌ర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని న‌గ‌రాల‌కు ఈ స‌ర్వీసుల‌ను విస్త‌రించాల‌ని ఎయిర్‌టెల్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. త‌ద్వారా జియోకు దెబ్బ కొట్టాల‌నే ల‌క్ష్యంతో ఉంది. మ‌రి ఎయిర్‌టెల్ 4జీ వొలైట్ స‌ర్వీసుకు కంపీట‌బుల్ హ్యాండ్‌సెట్స్ ఏమిటి? అసలు ఈ స‌ర్వీసుల‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలాగో చూద్దామా...

తిరుగులేని నెట్‌వ‌ర్క్ కోసం
జియోకు పోటీగా ఇన్ని రోజులు ఏదో అలా డేటా ప్యాక్ ప్ర‌క‌టించిన నెట్టుకొచ్చిన ఎయిర్‌టెల్‌కు ఇప్పుడు క‌చ్చితంగా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన సమ‌యం వ‌చ్చింది. వేగ‌వంత‌మైన నెట్‌వ‌ర్క్ ఇవ్వ‌డంలో జియోతో పోటీప‌డి విఫ‌ల‌మైన ఎయిర్‌టెల్‌... ఇప్పుడు రూట్ మార్చింది. జియో మాదిరిగానే 4జీ వొలైట్ సేవ‌లు అందిస్తే త‌ప్ప‌. తాము పోటీ ఇవ్వ‌లేమ‌ని భావించిన ఎయిర్‌టెల్‌... ఇప్పుడు ఆ ప‌నినే ప్రారంభించింది.  దీనిలో భాగంగానే ముంబ‌యిలో ఎయిర్‌టెల్ 4జీ వొలైట్ సేవ‌లు ప్రారంభం కానున్నాయి.  దీని వ‌ల్ల తిరుగులేని నెట్‌వ‌ర్క్‌తో పాటు హెచ్‌డీ క్వాలిటీ వీడియోలు చూసే అవ‌కాశం వినియోగదారుల‌కు ఉంటుంది. 

ఎయిర్‌టెల్ వొలైట్ యాక్టివేష‌న్ ఎలా..
మీ మొబైల్ ఫోన్ ఎయిర్‌టెల్ వొలైట్ యాక్టివేష‌న్‌కు స‌రిపోతుందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. దీని కోసం డ‌బ్ల్యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ.ఎయిర్‌టెల్‌.ఇన్ /వీవోఎల్‌టీఈ సైట్‌కు వెళ్లి మీ మొబైల్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. 

మీ స్మార్ట్‌ఫోన్‌ను ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవ‌డం ద్వారా కూడా వీవోఎల్‌టీఈ స‌పోర్ట్ పొందే అవ‌కాశం ఉంది. ఈ అప్‌డేట్ మీ హ్యాండ్‌సెట్ మాన్యుఫ్యాక్చ‌ర్ ద్వారా పొందొచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్ 4జీ సిమ్ ఉండి తీరాలి. మీకు ద‌గ్గ‌ర్లో ఉన్న ఎయిర్‌టెల్ స్టోర్‌కి వెళ్లి 4జీ సిమ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి.

ఎయిర్‌టెల్ సైట్‌కు వెళ్లి  నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ అనేబుల్ వొలైట్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి

డ్యుయ‌ల్ సిమ్ ఫోన్ వాడే వాళ్లు మీ ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌..వొలైట్‌కు స‌పోర్ట్ చేసే సిమ్ స్లాట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 
 

జన రంజకమైన వార్తలు