• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - బిల్ క‌ట్ట‌డానికి క్యూలో నిల్చోవాల్సిన అవ‌స‌రం లేని అమెజాన్ గో

ఈకామ‌ర్స్ జెయింట్ అమెజాన్ ఆఫ్‌లైన్ బిజినెస్ మీదా భారీగానే ఫోక‌స్ పెట్టింది.  ఇందులో భాగంగానే అమెజాన్ గో పేరిట ఆఫ్‌లైన్ స్టోర్స్ తెరుస్తామ‌ని 2016లోనే అనౌన్స్‌చేసింది. అయితే  ఏడాది త‌ర్వాత దీన్ని లాంచ్ చేసింది.  అమెరికాలోని వాషింగ్ట‌న్‌లో ఉన్న సీటెల్‌లో ఫ‌స్ట్ అమెజాన్ గో స్టోర్ ఎపోన్ అయింది. బిల్ క‌ట్ట‌డానికి క్యూలో నిల్చోవాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డం దీనిలో ఉన్న అతిపెద్ద ప్ల‌స్ పాయింట్‌.
అందుకే అమెజాన్ గో..
సూప‌ర్ మార్కెట్లు, గ్రాస‌రీ స్టోర్స్‌, మాల్స్‌లో షాపింగ్ ఒక ఎత్త‌యితే బిల్లింగ్ మరో ఎత్తు. పండ‌గ‌లు, ప‌బ్బాలు, ఆఫ‌ర్లు ఉన్న‌ప్పుడు అయితే క్యూచాంతాడులా ఉంటుంది. బిల్లింగ్ చేయించుకుని బ‌య‌ట‌ప‌డేస‌రికి రెండు, మూడు గంట‌లు ప‌డుతుంది. ఈ  వెయిటింగ్ భ‌రించ‌లేక కూడా చాలామంది   ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఆ యాత‌న లేకుండా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ ఎంజాయ్ చేసేందుకు అమెజాన్ గో  స్టోర్ల‌ను తీసుకొచ్చింది.  
క్యూలో  నిల్చోకుండా బిల్లింగ్ ఎలా?
*అమెజాన్ గోలో షాపింగ్ చేయాలంటే కస్ట‌మ‌ర్ల‌కు అమెజాన్ అకౌంట్ ఉండాలి. వాళ్ల మొబైల్లో  అమెజాన్ గో యాప్ ఉండాలి.
* ఇప్పుడు క‌స్ట‌మ‌ర్ స్టోర్‌లోకి వెళ్లి కావాల్సిన వ‌స్తువు తీసుకోగానే దానికి ఉన్న సెన్స‌ర్, ఆ చుట్టుప‌క్క‌ల ఉన్న సెన్స‌ర్ క‌లిసి దాన్ని బిల్ చేసేస్తాయి. ఇలా ఎన్ని ఐట‌మ్స్ తీసుకుంటే వాటికి బిల్ జ‌న‌రేట్ అయిపోతుంది. 
* మీరు ఒక‌సారి తీసుకున్న ఐట‌మ్ మీరు మ‌ళ్లీ అక్క‌డే పెట్టేస్తే ఆ అమౌంట్ బిల్ లో నుంచి క‌ట్ అయిపోతుంది.
* షాపింగ్ అయి మీరు అమెజాన్ గో స్టోర్ దాటేలోపు మీ అమెజాన్ అకౌంట్‌లో నుంచి బిల్ మొత్తం క‌ట్ అవుతుంది. 
*  ఇక మీకు క్యాషియ‌ర్‌తో, బిల్ డెస్క్ తో ప‌నేలేదు.  గంట‌ల కొద్దీ బిల్లింగ్ కోసం వెయిట్ చేయ‌క్క‌ర్లేకుండానే చ‌క్క‌గా షాపింగ్ పూర్తి చేయొచ్చు.
* క్యాషియ‌ర్లు త‌ప్ప మిగ‌తా స్టాఫ్ ఉంటారు. మీకు కావాల్సిన సాయం అందిస్తారు.
ఫ‌స్ట్ టైమే ఫెయిల‌య్యిందా?
అయితే సీటెల్‌లోని ఫ‌స్ట్ అమెజాన్ గో స్టోర్ ముందు బిల్లింగ్ కోసం భారీ క్యూ ఉండ‌డాన్ని ర‌యాన్ పీట‌ర్స‌న్ అనే వ్య‌క్తి ఫోటో తీసి ట్వీట్ చేశాడు. అంతా కెమెరాలు, సెన్స‌ర్ల ద్వారాబిల్లింగ్ పూర్త‌యి అమెజాన్ అకౌంట్ లేదా దానికి లింక్ అయి ఉన్న క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ డిడ‌క్ట్ అవ్వాలి. అయితే కొన్ని టెక్నిక‌ల్ డిఫెక్ట్‌ల వ‌ల్ల అన్నింటికీ బిల్లింగ్ కాక‌పోవ‌డంతో ఇలా కౌంట‌ర్ల ముందు జ‌నం బారులుతీరి ఉంటార‌ని భావిస్తున్నారు.       

జన రంజకమైన వార్తలు