• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ: ఏమిటీ ఆండ్రాయిడ్ ఎంట‌ర్‌ప్రైస్ రిక‌మండెడ్‌ స్మార్ట్ ఫోన్లు ? ఎప్పుడూ వినలేదే ?

ఆండ్రాయిడ్ ఫోన్ల‌ల‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తున్న వేళ ఇది. రోజుకో అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్లు స‌రికొత్త రూపును సంత‌రించుకుంటున్నాయి. ఇటీవ‌లే స్మార్ట్‌ఫోన్ల‌లో ఒక కొత్త మాట విన‌బ‌డుతోంది. నోకియా, మోట‌రోలా లాంటి పెద్ద కంపెనీలు ఆండ్రాయిడ్ ఎంట‌ర్‌ప్రైజ్ రిక‌మండెడ్ అనే ప‌దాన్ని ప‌దే ప‌దే ఉప‌యోగిస్తున్నాయి.  ఏమిటీ దీని ప్ర‌త్యేక‌త‌? ... భార‌త మార్కెట్‌కు దీనికి ఏమిటి సంబంధం?

ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ అంటే..
ఆండ్రాయిడ్ ప‌వ‌ర్డ్ ఫోన్‌కు గూగుల్ ఇచ్చిన స‌ర్టిఫికెటే ఆండ్రాయిడ్ ఎంట‌ర్‌ప్రైజ్ రిక‌మండెడ్‌. ఈ ఫోన్లు ఎంట‌ర్‌ప్రైజెస్ రిక్వైర్‌మెంట్ల్స్ అన్నింటిని పూర్తి అందుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్ర‌మే గూగుల్ ఈ ఫోన్ల‌ను వ్యాలిడేట్ చేస్తుంది. విశేషం ఏమిటంటే నాన్ స్టాక్ ఓఎస్ ర‌న్నింగ్ స్మార్ట్‌ఫోన్ల‌లో కూడా ఆండ్రాయిడ్ ఎంట‌ర్‌ప్రైజ్ రిక‌మండెడ్ అమ‌లు అవుతోంది. 

క‌నీస అర్హ‌త‌లు ఏమిటి?
ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఎంట‌ర్ ప్రైజ్ రిక‌మండెడ్‌లు అవ్వాలంటే ఆండ్రాయిడ్ న‌గౌట్ 7 కొత్త వెర్ష‌న్‌ది అయి ఉండాలి. అంతేకాదు ఈ డివైజ్ క‌నీసం 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ క‌లిగి ఉండాలి. 64 బిట్ ఆర్కిటెక్చ‌ర్ ఉన్న 1.4 గిగా హెట్జ్ క్లాక్ స్పీడ్ చిప్‌సెట్ దీనిలో ఉండి తీరాలి. దీనికి ఆండ్రాయిడ్ ఎంట‌ర్‌ప్రైజ్ రిక‌మండెడ్ ఇవ్వాలంటే కెమెరా కూడా త‌మ రిక్వైర్‌మెంట్‌కు స‌రిపోతుందా లేదా అనే విష‌యాన్ని గూగుల్ ప‌రిశీలిస్తుంది. ఈ డివైజ్ క‌నీసం 2 ఎంపీ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 10 ఎంపీ ప్రైమ‌రీ కెమెరా ఉండి తీరాలి. క్యూఆర్ కోడ్ లేదా జీరో ట‌చ్ ఎన్‌రోల్‌మెంట్ చేసి ఉండాలి. జీరో ట‌చ్ ఎన్‌రోల్‌మెంట్ కావాలంటే ఆ డివైజ్‌లో క‌నీసం ఆండ్రాయిడ్ 8 ఓరియో లేటెస్ట్ వెర్ష‌న్ ఉండాలి. 

ఆండ్రాయిడ్ ఎంట‌ర్‌ప్రైజ్ రిక‌మండెడ్ ఇస్తున్న డివైజ్‌లు ఇవే
గూగుల్ పిక్స‌ల్‌, పిక్స‌ల్ ఎక్స్ ఎల్‌, పిక్స‌ల్ 2, పిక్స‌ల్‌2 ఎక్స్ఎల్‌
బ్లాక్‌బెర్రీ కేఈవైవ‌న్‌
ఎల్‌జీ జీ6, వీ30
మోటో ఎక్స్‌4, జీ2 ఫోర్స్‌
నోకియా 8
సోని ఎక్స్‌పీరియా ఎక్స్ఏ2 ఆల్ట్రా, ఎక్స్‌జెడ్ ప్రిమియం, ఎక్స్‌జెడ్‌1, ఎక్స్‌జెడ్ 1 కాంపాక్ట్‌

జన రంజకమైన వార్తలు