• తాజా వార్తలు

ఏమిటీ.. ఆండ్రాయిడ్ వ‌న్ 

మార్కెట్లోకి చాలా ఫోన్లు విడుద‌ల అవుతున్నాయి. కానీ కొన్ని ఫోన్ల మీదే వినియోగ‌దారుల దృష్టి ప‌డుతుంది. అయితే అలాంటి ఫోన్ల వెనుక  ఆండ్రాయిడ్ వ‌న్ ఫ్లాట్‌ఫాం ఉన్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. 2014లోనే లాంఛ్ అయిన ఆండ్రాయిడ్ వ‌న్‌ నెమ్మ‌ది నెమ్మ‌దిగా త‌న ప్రాబ‌ల్యాన్ని చాటుకుంటోంది.  అఫ‌ర్డ్‌బుల్ స్మార్ట్‌ఫోన్ల‌కు ఫ్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇవ్వ‌డానికి ఆండ్రాయిడ్ వ‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  ప్ర‌స్తుతం గూగుల్ ఆండ్రాయిడ్ వ‌న్ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల‌ను మ‌రింత మెరుగుప‌రిందుకు కృషి చేస్తోంది.

త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ క్వాలిటీ
ఒక‌ప్పుడు స్మార్ట్‌ఫోన్లు అంటే చాలా ఖ‌రీదు. ఇప్పుడు సామాన్యుల సైతం స్మార్ట్‌ఫోన్లు ఉప‌యోగిస్తున్నారు. దీనికి గూగుల్ తీసుకున్న చొర‌వ కూడా కార‌ణ‌మే. మోటో లాంటి ఫోన్ల‌ను మార్కెట్లోకి తెచ్చి అంద‌రికి నాణ్య‌మైన సేవ‌ల‌ను అందించింది గూగుల్‌. త‌క్కువ ధ‌ర‌తో ఎక్కువ నాణ్య‌త కాన్సెప్ట్‌తో గూగుల్ అప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా స‌క్సెస్ అయింది. అదే స‌మ‌యంలో ఆండ్రాయిడ్ వ‌న్ పేరుతో ఒక ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది.  రూ.6 వేల‌తో మంచి ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందించ‌డమే ఈ ఫ్లాట్‌ఫామ్ ల‌క్ష్యం. ఆండ్రాయిడ్ వ‌న్ పేరు ఫోన్ల‌ను రంగంలోకి దించింది ఇందుకే. మంచి డిజైన్‌తో పాటు ప‌రుగెత్తే ఓఎస్ ఈ ఫోన్ల సొంతం. మైక్రోమ్యాక్స్‌, కాబ్బ‌న్‌, స్పైస్ ఫోన్లు ఇలా వ‌చ్చిన‌వే. 

భారత్‌లో మాత్ర‌మే కాదు..
ఆండ్రాయిడ్ వ‌న్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా త‌క్కువ ఖ‌ర్చుతో ఫోన్లు త‌యారు కావ‌డం కేవ‌లం భార‌త్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదు. పాకిస్థాన్, శ్రీ‌లంక‌, మ‌య‌న్మార్‌, ఫిలిప్ఫిన్స్‌, బంగ్లాదేశ్‌, నేపాల్ దేశాల్లో ఆండ్రాయిడ్ వ‌న్  సాయంతో  త‌యారైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.  ఈ ఫోన్ల‌న్ని మిడ్ రేంజ్ స్పెసిఫికేష‌న్స్‌తో కూడిన‌వే. జియోమి ఎంఐ ఏ1 ఇదే కోవ‌కు చెందుతుంది. ఆండ్రాయిడ్ వ‌న్ అంటే సింపుల్‌, స్మార్ట్‌, సెక్యూర్‌, ఫ్లాష్ ఫోన్ అని గూగుల్ నిర్వ‌చిస్తోంది. 2014లో ఆండ్రాయిడ్ వ‌న్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్ర‌వేపెట్టింది అఫ‌ర్డ్‌బుల్ ఫోన్ల కోస‌మేన‌ని.. ఇప్పుడు ల‌క్ష‌లాది మంది యూజ‌ర్లు ఈ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నార‌ని ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ చెబుతోంది. ప్రైస్ పాయింట్ పెర‌గ‌కుండా క్వాలిటీ ప్రొడ‌క్ట్ అందించ‌డ‌మ‌నే కాన్సెప్ట్ అందరికి న‌చ్చింద‌ని ఆ సంస్థ తెలిపింది. 

ఆండ్రాయిడ్ వ‌న్ వ‌ర్సెస్ ఆండ్రాయిడ్‌
ఆండ్రాయిడ్ వ‌న్‌కు ,ఆండ్రాయిడ్‌కు కొన్ని ప్ర‌త్యేక తేడాలున్నాయి. ఆండ్రాయిడ్ వ‌న్ ఓపెన్ సోర్స్‌. ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో మాన్యుఫార్చ‌ర్లు ఎన్ని మార్పులైనా చేసుకోవ‌చ్చు.  అయితే ఆండ్రాయిడ్ ఓఎస్‌లో మాత్రం ఫీచ‌ర్ల విష‌యంలో ఫ్లెక్లిబిలిటీ ఉంటుంది. దీనిలో సాఫ్ట్‌వేర్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఓఈఎమ్ నియంత్రిస్తుంది. గూగుల్ కూడా త‌న వంతు పాత్ర పోషిస్తుంది. ఆండ్రాయిడ్ వ‌న్ ల‌క్ష్యం నాన్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌ను స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లుగా మార్చ‌డం. 
 

జన రంజకమైన వార్తలు