• తాజా వార్తలు

ఇప్పుడు స్వైప్ చేయ‌న‌వ‌స‌రం లేని కార్డులు సాధ్య‌మే!

షాపింగ్‌కు బ‌య‌ల్దేరామంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు లేకుండా దాదాపు చాలామంది అడుగు బ‌య‌ట‌పెట్టరు. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు బాగా పెరిగిపోయిన నేప‌థ్యంలో కార్డుల వాడ‌కం కూడా మ‌న దేశంలో అంత‌కంటే రెట్టింపు స్థాయిలో పెరిగింది. అయితే మ‌నం కార్డులు తీసుకెళ్ల‌డం బాగానే ఉంది కానీ.. ఒక్కోసారి స్వైపింగ్ స‌మ‌స్యలు ఎదుర్కొంటాం. ఒక్కోసారి మ‌న కార్డులో మ‌నీ ఉన్నా ప‌ని చేయ‌క‌పోవ‌డం.. డిక్లైన్ కావ‌డం లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అంతేకాదు కొన్ని బ్యాంకుల కార్డులు కొన్ని మిష‌న్ల‌లో ప‌ని చేసేందుకు మొరాయిస్తాయి. అయితే ఇక బాధ‌ల‌కు చెల్లుచీటీ. ఎందుకంటే కార్డు స్వైపింగ్ అవ‌స‌రం లేని కాంటాక్ట్ లెస్ కార్డులు వ‌చ్చేస్తున్నాయి. దీంతో మీరు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌తోనే చెల్లింపులు చేసేయ‌చ్చు. 

కాంటాక్ట్‌లెస్ కార్డులు
షాపింగ్‌లో మ‌నం డబ్బులు చెల్లించాలంటే క‌చ్చితంగా కార్డులు స్వైపింగ్ మిష‌న్‌లో పెట్టి స్వైప్ చేయాల్సిందే. అయితే కార్డులు ఇలా స్వైప్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా కాంటాక్ట్ లెస్ కార్డులు వ‌చ్చేశాయి. అంటే ఎన్ఎఫ్‌సీ సాంకేతిక‌తతో మీరు కార్డు లేకుండానే డ‌బ్బులు చెల్లించొచ్చు.  అయితే విధానం ఇంకా ప్ర‌యోగం ద‌శ‌లోనే ఉంది. చాలా మెట్రో న‌గ‌రాల్లో ఇప్పుడు ఈ ప‌ద్ధ‌తిని ప‌రీక్షిస్తున్నారు. బ‌స్ టిక్కెట్ల‌ను కొనుగోలు చేయ‌డానికి బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్ (బీఎంటీసీ) స్మార్ట్‌కార్డు లూప్‌ను డెవల‌ప్ చేసింది.  ఇదే స్మార్ట్ కార్డు ప‌ద్ధ‌తి త్వ‌ర‌లో అన్ని మెట్రో న‌గ‌రాల్లోనూ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. యాక్సిస్ బ్యాంకు భాగ‌స్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని బీఎంటీసీ భావిస్తోంది.  దీన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా అమ‌లు చేయాల‌ని ఆ సంస్థ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.  ఇప్ప‌టికే 10 వేల టికెటింగ్ మిష‌న్ల‌ను కూడా కొనుగోలు చేసింది. 

విజ‌యవంతం అవుతాయా?
కాంటాక్ట్ లెస్ కార్డులు నిజంగా చాలా ఉప‌యోగ‌క‌రం. మ‌నం ఎక్క‌డికి ఎలాంటి కార్డులు పెట్టుకెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న ఫోన్‌ను ఉయోగించి స్వైప్ చేసేయ‌చ్చు. అంటే మ‌న ఫోన్‌ను స్వైప్ మిష‌న్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఆ కోడ్‌ను గ్ర‌హించి అదే ట్రాన్సాక్ష‌న్ ప్రాసెస్ చేసుకుంటుంది. కేవ‌లం ట్రావెలింగ్‌కు మాత్ర‌మే కాదు షాపింగ్‌కు ఇంకా ఎక్క‌డికి వెళ్లినా మ‌నీ వెంట తీసుకెళ్ల‌కుండా జ‌స్ట్ స్మార్ట్‌ఫోన్‌తోనే మ‌నం చెల్లింపులు చేసేయ‌చ్చు. అయితే ఈ కార్డుల‌కు కొన్ని ప‌రిమితులు కూడా ఉన్నాయి. వాటిని అధిగ‌మించి అన్ని చోట్లా ఉప‌యోగించేటట్లు చేయ‌డానికి అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.  ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోనే ప్రారంభం అయిన ఈ కాంటాక్ట్ లెస్ కార్డులు త్వ‌ర‌లోనే దేశం మొత్తం విస్త‌రించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు