• తాజా వార్తలు
  •  

వావ్ అనిపించే యూపీఐ 2.0

క్షణాల్లో చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కల్పించే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) విధానం వచ్చి సుమారు ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో యూపీఐ విపరీతమైన ఆదరణ పొందింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ పేమెంట్ విధానానికి అప్ గ్రేడ్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారిప్పుడు.
ఎప్పుడొస్తుంది..?
యూపీఐ 2.0 పేరుతో రానున్న ఈ అప్ గ్రేడెడ్ వెర్షన్ జులై లేదా ఆగస్టు మొదటివారంలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి బ్యాంకులన్నీ సిద్ధం కావాలసి ఉంటుందని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటికే సమాచారం అందిందట.
ఎన్నో కొత్త ఫీచర్లు
యూపీఐ 2.0లో పలు కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. దాని వల్ల డిజిటల్ లైఫ్ మరింత సులభతరం కానుంది. ఇందులో ముఖ్యంగా ఎలక్ర్టానిక్ మాండేట్ ఆప్షన్ తీసుకొస్తున్నారు. కస్టమర్లు తమ ట్రాంజాక్షన్లను ప్రీ ఆథరైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ప్రీ ఆథరైజేషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడైనా ఈ ఎలక్ర్టానిక్ మాండేట్ ను యాడ్ చేయడానికి, అప్ డేట్ చేయడానికి, అవసరమైతే డిలీట్ చేయడానికి కూడా ఇందులో వీలు కల్పిస్తున్నారు. నగదు బదిలీలో పరిమితులు కూడా మారనున్నాయి.

జన రంజకమైన వార్తలు