• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - బ్లూటూత్ 5 ఎలా ఉండ‌నుంది ?

ఏదైనా ఒక ఇమేజ్‌, ఆడియో క్లిప్‌, వీడియో షేర్ చేయాలంటే వాట్సాప్ చేసేస్తున్నాం.  సైజ్ పెద్ద‌గా ఉంటే షేర్ ఇట్ వాడుకుంటున్నాం. ఇవ‌న్నీ లేక ముందు ఫైల్ షేరింగ్ ఆప్ష‌న్ అంటే బ్లూటూత్ మాత్రమే. ఫైల్ షేరింగ్‌కే కాదు బ్లూటూత్ క‌నెక్టెడ్ డివైస్‌ను చెవిలో పెట్టుకుని కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు, మ్యూజిక్ వినొచ్చు కూడా. కీబోర్డ్స్‌, మౌస్‌లు వైర్‌లైస్‌గా ప‌నిచేయ‌డంలోనూ బ్లూ టూత్‌దే కీల‌క‌పాత్ర‌. నిత్య‌జీవితంలో ఫోన్ చేతిలో ప‌ట్టుకుని మాట్లాడేంత తీరిక‌లేనివారు మాత్ర‌మే ప్ర‌స్తుతం కాల్ మాట్లాడుకోవ‌డానికి బ్లూటూత్‌ను వాడుకుంటున్నారు. కానీ బ్లూటూత్ ఇప్పుడు బాగా డెవ‌ల‌ప్ అయింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వెర్ష‌న్లు తెస్తోంది. లేటెస్ట్‌గా బ్లూటూత్ 5.0ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. ప్ర‌స్తుతానికి ఐఫోన్ 8, టెన్ ,శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8లాంటి అల్ట్రా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌లో మాత్ర‌మే బ్లూ టూత్ 5.0 వెర్ష‌న్‌ను స‌పోర్ట్‌చేస్తాయ‌ని యాడ్స్‌లో చెప్పుకొంటున్నాయి.
లోఎన‌ర్జీ ఎఫిషియంట్‌
బ్లూటూత్ 5.0 .. లో ఎన‌ర్జీ స్పెసిఫికేష‌న్స్‌తో త‌యారైంది. ఇది మీ బ్లూ టూత్ పెరిఫెరల్స్ ఎక్కువ ప‌వ‌ర్ యూజ్ చేయ‌కుండా కంట్రోల్ చేస్తాయి. సాధార‌ణంగా వైర్‌లైస్ హెడ్‌ఫోన్స్  లో ఎన‌ర్జీ ఉంటే బ్లూటూత్ మీద స‌రిగా ప‌నిచేయ‌వు. అదే 5.0లో అయితే లోఎనర్జీ ఉన్నా కూడా ప‌నిచేస్తాయి. అంటే ప‌వ‌ర్ యూసేజ్‌ను త‌గ్గించి బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఇస్తుంది.
డ్యూయ‌ల్ ఆడియో 
బ్లూ టూత్ 5.0లో ఉన్న బెస్ట్ ఫీచ‌ర్ డ్యూయ‌ల్ ఆడియో. అంటే ఒకే బ్లూటూత్ క‌నెక్ష‌న్‌తో రెండు డివైస్‌ల్లో ఒకేసారి ఆడియో ప్లే చేయ‌గ‌ల‌గ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. ఒకేసారి రెండు రూమ్స్‌లో ఉన్న స్పీక‌ర్ల‌లో కూడా ఒకేసారి మ్యూజిక్ ప్లే చేసుకోవ‌చ్చు. అంతేకాదు ఒకేసారి రెండు డిఫ‌రెంట్ సోర్స్‌ల నుంచి రెండు డిఫ‌రెంట్ స్పీక‌ర్ల‌లో ఆడియో ప్లే చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్‌కు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8లో మాత్ర‌మే కంపాట‌బులిటీ ఉంది. భ‌విష్య‌త్తులో బ్లూటూత్ 5.0తో వ‌చ్చే డివైస్‌ల‌న్నింటికీ ఈ డ్యూయ‌ల్ ఆడియో ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.
మ‌రింత వేగంగా, మ‌రింత దూరానికి..
బ్లూటూత్ 5.0వెర్ష‌న్‌లో స్పీడ్‌, రేంజ్ కూడా పెంచారు. దీనితో 2ఎంబీపీస్ స్పీడ్‌తో డేటా ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు.  ఇది ప్ర‌స్తుతం ఉన్న బ్లూ టూత్ 4.2వెర్ష‌న్‌కు డబుల్ స్పీడ్‌. అంతేకాదు బ్లూటూత్ క‌నెక్టివిటీ రేంజ్ కూడా 800 అడుగులు (దాదాపు 240మీట‌ర్ల‌)వ‌ర‌కు పెరిగింది. 4.2లో 60 అడుగుల వ‌ర‌కే రేంజి ఉండేది. దీంతోపాటు ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్  (ఐవోటీ)లోనూ బ్లూటూత్ వినియోగం ఈ కొత్త వెర్ష‌న్‌తో పెర‌గ‌నుంది.
ఈ ఏడాది చివ‌ర‌కు భారీగా 
ప్ర‌స్తుతం చాలా ఫోన్ల‌లో బ్లూటూత్ 4.2 వెర్ష‌న్ ఉంది. మీ బ్లూటూత్ పెరిఫెర‌ల్స్ (హెడ్‌ఫోన్స్‌)లాంటివి దానికే కంపాట‌బుల్‌గా ఉంటాయి. మీరు బ్లూటూత్ 5.0కి ప‌నికొచ్చే స్పీకర్స్‌, హెడ్‌ఫోన్స్‌లాంటివి వాడిన‌ప్పుడు కొత్త వెర్ష‌న్ ఉప‌యోగాలు మీకు తెలుస్తాయి. ఈ ఏడాదిలో కొత్త వెర్ష‌న్‌కు త‌గ్గ‌ట్లు ప‌నిచేసే ఫెరిఫెర‌ల్స్ రానున్నాయి. ఫోన్లు కూడాఐఫోన్ 8, 8 ప్ల‌స్‌, టెన్‌, శాంసంగ్ గెలాక్సీఎస్‌8, ఎస్ 8+ల్లో మాత్ర‌మే బ్లూటూత్ 5.0 కంపాట‌బులిటీ ఉంది. ఆండ్రాయిడ్ డివైస్‌ల్లో చాలా వ‌ర‌కు 2018 చివ‌రికల్లా ఈఫీచ‌ర్‌ను తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయి.
 

జన రంజకమైన వార్తలు