• తాజా వార్తలు

ప్రివ్యూ - మీ కోసం మద్యం తాగిపెట్టే ..  స‌రోగేట్ డ్రింక‌ర్స్ త్వ‌ర‌లో..

స‌రోగేట్ మ‌ద‌ర్‌..మాతృత్వానికి మాన‌సికంగా, శారీర‌కంగా సిద్ధంగా లేని మ‌హిళ‌లు త‌ల్ల‌వ‌డానికి త‌మ అండాన్ని వేరే మ‌హిళ గ‌ర్భంలో ప్ర‌వేశ‌పెట్టి ఆమె బిడ్డ‌ను క‌న్నాక త‌ర్వాత తీసుకుంటారు. ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఇలా తల్లి అయ్యే భాగ్యం ద‌క్కింది. అయితే ఇదే సూత్రాన్నిచైనావాళ్లు విడ్డూరంగా మందుబాబుల కోసం వాడుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ పేరే స‌రొగేట్ డ్రింక‌ర్స్‌. మీరు తాగ‌లేక‌పోతే మీ బ‌దులు డ‌బ్బులు తీసుకుని వేరేవాళ్లు తాగిపెడ‌తారన్న‌మాట‌.
వారెవ్వా.. ఏం స‌ర్వీస్‌
చైనాలోని బీజింగ్‌కు చెందిన టెక్ స్టార్ట‌ప్ ఈడెయిజియా ఈ స‌రొగేట్ డ్రింక‌ర్స్ స‌ర్వీస్‌ను లాంచ్‌చేసింది. ఇప్ప‌టికే ఈ స్టార్ట‌ప్ డెజిగ్నేటెడ్ డ్రైవ‌ర్ స‌ర్వీస్‌ల‌తో బాగా పాపుల‌ర‌యింది.మొబైల్  యాప్ ద్వారా డ్రైవ‌ర్ స‌ర్వీస్‌ను కాల్ చేసి పిలుచుకోగ‌ల‌గ‌డం దీనిలో మేజ‌ర్ ఎట్రాక్ష‌న్‌.  2016లో ఈ సర్వీస్‌కు 25 కోట్ల బుకింగ్స్ వ‌చ్చాయి. వీరిలో 95% మంది డ్రైవింగ్ చేయ‌డానికి అన్‌ఫిట్‌గా ఉన్నవారు లేదా అలాంటి కండిషన్స్‌లో ఉన్న‌వారే.  ఇలాగే డ్రింకింగ్ విషయంలోనూ ఉండొచ్చ‌న్న అంచ‌నాతో స‌రొగేట్ డ్రింక‌ర్స్ స‌ర్వీస్‌ను ఇంట్ర‌డ్యూస్‌చేశారు. ఇది  కూడా లొకేష‌న్ బేస్డ్ యాప్ స‌ర్వీస్‌.  స‌రొగేట్ డ్రింక‌ర్‌గా యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి ఏజ్‌తో ప‌నిలేదు. ఫొటో, ప్రొఫైల్‌,ఏజ్‌తోపాటు ఎంత తాగ‌గ‌ల‌ర‌నేదాన్ని కూడా మెన్ష‌న్ చేయాల్సి ఉంటుంది. మీరు స‌రొగేట్ డ్రింక‌ర్ స‌ర్వీస్ కోరుకోగానే ప‌ర్స‌న్స్ ప్రొఫైల్స్ చూపిస్తారు. మీరు కోరిన ప‌ర్స‌న్‌ను మీ బ‌దులు తాగ‌డానికి పంపించ‌డానికి ఎంత ఛార్జ్ అవుతుందో యాప్ మీకు చెబుతుంది.మీరు  ఓకే చెప్ప‌గానే స‌రొగేట్ డ్రింక‌ర్‌ను పంపిస్తారు. పార్టీలో, ప‌బ్‌లో అత‌ను మీ బ‌దులు తాగిపెడ‌తాడు. 
అంత అవ‌స‌ర‌మా?
చైనాలో మ‌ద్య‌పానం సోష‌ల్ స్టైల్‌గా మారిపోయింది. ప్ర‌పంచంలో పెద్ద ఎకాన‌మీల్లో ఒక‌టి కావ‌డం,విప‌రీత‌మైన శ్ర‌మ‌చేసే వ్య‌క్తులు కావ‌డంతో కింది నుంచి పై స్థాయి వ‌ర‌కు అన్నిచోట్లా డ్రింకింగ్ హాబిట్ విప‌రీతంగా పెరిగిపోయింది. ఫ్యామిలీ గెట్ టు గెద‌ర్స్ నుంచి  కంపెనీల్లో డెలిగేట్స్‌కు ఇచ్చే పార్టీల వ‌ర‌కు అన్నింటికీ మందు త‌ప్ప‌నిస‌రి. చైనాలో మ‌ద్యం వ్యాపారం మీద వ‌చ్చేఆదాయం ల‌క్షా యాభై వేల కోట్ల రూపాయ‌లు దాటింది.ఈ నేప‌ధ్యంలో ఇలాంటి స‌ర్వీస్‌లు క‌చ్చితంగా ఆద‌ర‌ణ పొందుతాయ‌ని యాప్ స‌ర్వీస్ న‌మ్ముతోంది. స‌ర్వీస్ గురించి ప్ర‌క‌టించిన 24 గంట‌ల్లోనే 10వేల మంది స‌రొగేట్ డ్రింక‌ర్స్‌గా ఉంటామని సైన్ అప్‌చేసుకోవ‌డం చూస్తే అది నిజ‌మేన‌నిపిస్తోంది. 

జన రంజకమైన వార్తలు