• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - షియోమి గేమింగ్ ఫోన్ మరో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ అవుతుందా?

స్మార్ట్‌ఫోన్ మ‌న ద‌గ్గ‌ర ఉంటే క‌చ్చితంగా గేమ్‌లు ఆడ‌తాం. పిల్ల‌లైతే ఇక చెప్ప‌క్క‌ర్లేదు వాళ్ల‌కు ఫోన్ ఉండేదే అందుకు. ఫోన్లో గేమ్‌లు ఏమి ఇన్‌బిల్ట్‌గా రావు. చాలా ఫోన్ల‌లో మ‌నం ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్ర‌త్యేకించి గేమింగ్ కోసం ఒక ఫోన్ వస్తే! ఈ ఆలోచ‌నే సూప‌ర్‌గా ఉంది క‌దా! కానీ షియోమి ఈ ఆలోచ‌న‌ను నిజం చేసింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఒక గేమింగ్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మ‌రి ఆ ఫోన్ ఏంటో దాని సంగ‌తి ఏంటో చూద్దామా...

షియోమి రేజ‌ర్‌
షియోమి రేజ‌ర్ పేరుతో వ‌చ్చిన గేమింగ్ ఫోన్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్‌గా మారింది.  గేమింగ్ కోసం ప్ర‌త్యేకింగా వ‌చ్చిన ఈ డివైజ్ వినియోగ‌దారుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ర్షిస్తుంద‌ని ఆ కంపెనీ అంటోంది. ప్ర‌స్తుతం హై ఎండ్ ఫోన్ల‌లో కూడా లేని ఫీచ‌ర్ల‌తో తాము రేజ‌ర్‌లో ఇన్‌క్లూడ్ చేశామ‌ని ఆ సంస్థ చెబుతోంది. సాధార‌ణంగా గేమ్స్ ఆడాలంటే కంప్యూట‌ర్‌ను మించింది లేదు. కానీ కంప్యూట‌ర్ గేమ్స్ స్థాయిలో తాము రేజ‌ర్ ద్వారా గేమింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ అందిస్తామ‌ని షియోమి చెబుతోంది. దీనిలో ఉత్తమ‌మైన గ్రాఫిక్స్ కార్డు, సౌండ్స్‌, హీటింగ్ హ్యాండ్లింగ్, డిటెక్టెడ్ గేమింగ్ కీస్ ఉన్నాయి.

ఆట ఆడిస్తుంది
గేమ్‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఫోన్ల‌ను త‌యారు చేసిన నోకియా, సోనిల‌ను మించి రేజ‌ర్‌లో ఆప్ష‌న్ల‌ను ఇస్తున్న‌ట్లు షియోమి తెలిపింది. హైఎండ్ ప్రాసెస‌ర్‌తో పాటు బెస్ట్ గ్రాఫిక్స్ ప్రాసిసింగ్ యూనిట్ దీనిలో ఉన్న ప్ర‌త్యేక‌త‌లు.  అయితే ర్యామ్ మాత్రం గ‌తంలో వ‌చ్చిన షియోమి ఫోన్ల మాదిరిగానే ఉంటుంది. డిస్‌ప్లే విష‌యంలోనూ ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌ట్లేదు. జెస్చ‌ర్ బేస్డ్ గేమ్‌ల‌పైనే ఈ రేజ‌ర్ ప్ర‌ధానంగా దృష్టి సారించింది.

ప్రత్యేకించి బటన్స్

మిగిలిన ఫోన్ల‌తో పోలిస్తే గేమ్‌ల కోసం ప్ర‌త్యేకించి బ‌ట‌న్స్ ఉండ‌బోతున్నాయి రేజ‌ర్‌లో. అయితే సోని ఎక్స్‌పీరియ లాంటి ఫోన్ల‌లో స్టిక్ క్రికెట్ లాంటి గేమ్‌ల కోసం ప్ర‌త్యేకించి కొన్ని బ‌ట‌న్స్ పెట్టారు. ఇదంత వ‌ర్క్ ఔట్ కాలేదు. ఈ నేప‌థ్యంలో అన్ని ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాతే ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న గేమ్‌ల‌కు త‌గ్గ‌ట్టుగా రేజ‌ర్‌ను రూపొందించింది షియోమి.  మామూలుగా అయితే గేమింగ్ ఫోన్ల ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంది. కానీ రేజ‌ర్ మాత్రం అంద‌రికి అందుబాటు ధ‌ర‌లో ఉంటుంద‌ని షియోమి చెబుతోంది. వ‌న్‌ప్ల‌స్ 5టీ రేంజ్‌లో ఫీచ‌ర్లు కూడా ఉంటాయ‌ని ఆ సంస్థ మాట‌. మ‌రి రేజ‌ర్ ఫోన్ మార్కెట్లో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ కానుందా అనేది త్వ‌ర‌లోనే తేలిపోతుంది. 

జన రంజకమైన వార్తలు