• తాజా వార్తలు

ప్రివ్యూ - బ్యాట‌రీ 5% కంటే త‌క్కువ ఉన్న‌ప్పుడు మేల్కొనే చాట్‌ యాప్‌..డై విత్ మి

మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాట‌రీ ఛార్జింగ్ అయిపోతుంటే మీరెంత టెన్ష‌న్ ప‌డతారు... డేటా క‌నెక్ష‌న్ ఆఫ్ చేసేస్తారు. స్క్రీన్ బ్రైట్‌నెస్ త‌గ్గించేస్తారు. మ‌ళ్లీ ఛార్జ‌ర్ దొరికి ఫోన్‌కు క‌నెక్ట్ చేసేవ‌ర‌కు అనీజీగానే ఉంటారు. కానీ మీ  ఫోన్ బ్యాట‌రీ 5% లోపు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే యాక్టివేట్ అయ్యే మెసేజింగ్ యాప్ ఒక‌టుంది తెలుసా?  పేరు కూడా దానికి త‌గ్గ‌ట్లే ఉంటుంది.  పేరుడై విత్ మి.  ఏంటి దీని క‌థ చూడండి..
5% లోపు ఉన్నాక‌నెక్టివిటీ
మీ బ్యాట‌రీ 5% లోపు ఉన్న‌ప్పుడు కూడామీరు ఇత‌రుల‌తో క‌నెక్టివిటీ కొన‌సాగించ‌డానికి డై విత్ మి ఉప‌యోగ‌ప‌డుతుంది.  మీరు ఒక నిక్ నేమ్ క్రియేట్ చేసుకుని అప‌రిచిత వ్య‌క్తుల‌తో కూడా చాట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లో అందుబాటులో ఉంది. బ్యాట‌రీ పూర్తిగా డిస్‌ఛార్జి అయిపోతే క‌నెక్టివిటీ కోల్పోతామ‌ని కంగారుప‌డే అంద‌రికీ ఈ యాప్ చాలా ఉప‌యోగం.ఎందుకంటే బ్యాట‌రీ 5%లోపు ఉన్న‌ప్పుడు ఇది ప‌నిచేస్తుంది కాబ‌ట్టి.
డేటింగ్‌యాప్ త‌యారు చేయ‌బోయి..
డై విత్‌మి అనేది ఒక బేర్‌బోట్ చాట్ యాప్‌. డియర్స్ డ్యూర్టర్, డేవిడ్ సర్పెరెంట్  2017 లో అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒక చిన్న స్థాయిలో పరీక్షించడానికి  దీన్ని క్రియేట్ చేశారు. బ్యాట‌రీ త‌క్కువ‌గా ఉన్నా పనిచేసే డేటింగ్ యాప్‌ను త‌యారుచేయాల‌ని వాళ్లు భావించారు. అయితే చివ‌రికి చాట్ యాప్‌ను క్రియేట్ చేశారు. త‌మ యాప్ వాట్సాప్‌, మెసెంజ‌ర్‌లకు పోటీప‌డేంత పెద్ద‌ది కాద‌ని, అయితే ఇంకాసేప‌ట్లో బ్యాటరీ పూర్తిగా డిస్‌క‌నెక్ట్ అయిపోతున్న‌ప్పుడు కూడా చాట్ చేయ‌గ‌ల‌గ‌డం, మెసేజ్ పాస్ చేసుకోగ‌ల‌గ‌డం దీనిలో కీల‌క‌మైన ఫీచ‌ర్ అని చెబుతున్నారు.
 

జన రంజకమైన వార్తలు