• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ఈ స్టింగ్ రే టెక్నాల‌జీ వ‌స్తే క్రిమిన‌ల్స్ ఇక ప్రొఫెష‌న్ మార్చుకోవాల్సిందే!

టెక్నాల‌జీ ర్యాపిడ్‌గా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఏదీ దాగ‌ట్లేదు. ఎంత పెద్ద నేరాలైనా రోజుల వ్య‌వ‌ధిలోనే ఛేదించేస్తున్నారు పోలీసులు.  టెక్నాల‌జీని ఉప‌యోగించి నేర‌స్తుల‌ను సుల‌భంగా ప‌ట్టేసుకుంటున్నారు. వేలి ముద్ర‌లు దొరికితే చాలు ఆధార్ డేటా బేస్ చెక్ చేసి ప‌ట్టేస్తున్నారు. మామూలు నేర‌గాళ్ల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే  ఫ్రొఫెష‌న‌ల్ నేర‌గాళ్ల ప‌
రిస్థితి కూడా ఇప్పుడు క‌ష్టంగానే ఉంది.  ఎందుకంటే టెక్నాల‌జీ బాగా పెరిగిపోయాక నేరాలు చేయ‌డం అంత సుల‌భంగా లేదు. ఇప్పుడు క్రిమిన‌ల్స్‌ను మ‌రింత ఇబ్బంది పెట్టేలా మ‌రో సాఫ్ట్‌వేర్ పుట్టుకొచ్చింది దాని పేరే స్టింగ్ రే. దీని సాయంతో చాలా తేలిగ్గా నేర‌గాళ్ల‌ను ప‌ట్టేయ‌చ్చ‌ట‌.

అమెరికాలో పుట్టింది..
క్రిమిన‌ల్స్ ఆట క‌ట్టించే స్టింగ్ రే  టెక్నాల‌జీ అమెరికాలో పుట్టింది. చికాగో, లాస్‌వెగాస్ పోలీసుల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నారు. ఈ హైలీ సీక్రెటివ్ టెక్నాల‌జీని పెద్ద పెద్ద కేసులు ఛేదించేందుకు వాడుతున్నారు. నిజానికి ఈ టెక్నాల‌జీని మిల‌ట‌రీ కోసం త‌యారు చేశారు. అంటే ఎవ‌రి క‌ద‌లిక‌ల‌పైనైనా అనుమానం వస్తే వారిని ట్రాక్ చేయ‌డం కోసం ఈ టెక్నాల‌జీని త‌యారు చేశారు. అవ‌త‌లి వ్య‌క్తి సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ద్వారా వారి డేటా మొత్తాన్ని గ్ర‌హించేయ‌డ‌మే దీని ప్ర‌త్యేక‌త‌.

డేటాను ఊడ్చి పారేస్తుంది
స్టింగ్ రేస్ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తే అవ‌త‌లి వ్య‌క్తికి సంబంధించి ప్ర‌తి డిటైల్‌ను మ‌నం క‌నిపెట్టేయ‌చ్చు.సెల్ ట‌వ‌ర్స్‌ను ఉప‌యోగించుకుని ఈ టెక్నాల‌జీ విడుద‌ల చేసే కొన్ని సిగ్న‌ల్స్  ఆధారంగా ఫోన్‌ను త‌న ఆధీనంలోకి తీసుకుని డేటాను క‌లెక్ట్ చేస్తారు పోలీసులు. అయితే ఈ టెక్నాల‌జీ  దుర్వినియోగం అయ్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయంటున్నాయి సివిల్ రైట్స్ గ్రూప్‌లు.  ఈ టెక్నాల‌జీ ద్వారా పోలీసులు యూజ‌ర్ ఏ ప్రాంతంలో ఉన్నాడో  చెప్పేయ‌చ్చు. ఒక‌ప్పుడు ఫోన్ లేదా మెసేజ్‌ల ద్వారా మాత్ర‌మే ట్రాకింగ్ కుదిరేది ఇప్పుడు అవేం అవ‌స‌రం లేదు జ‌స్ట్ అవ‌త‌లి వ్య‌క్తి చేతిలో ప‌ని  చేసే ఫోన్ ఉంటే చాలు.

త్వ‌ర‌లోనే అన్ని చోట్ల‌కి..
ప్ర‌స్తుతం స్టింగ్ రే టెక్నాల‌జీని అమెరికాలో చాలా శాఖ‌ల్లో వాడుతున్నారు. 72 స్టేట్, లోక‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్  డిపార్ట్‌మెంట్ల‌లో ఈ సాంకేతిక‌త‌ను ఉయోగిస్తున్నారు.  అయితే ఈ టెక్నాల‌జీ ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే లాభ న‌ష్టాల గురించి మాత్రం ప్ర‌స్తుతానికి స్ప‌ష్ట‌త లేదు. ఈ టెక్నాలజీతో ఎంత లాభం ఉందో దుర్వినియోగం అయితే అంత న‌ష్టం ఉంద‌ని సివిల్ రైట్స్ అసోసియేష‌న్ అంటోంది. ఒక‌వేళ ఈ టెక్నాల‌జీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌స్తే నేర‌స్తుల ఆట‌ల‌కు చెల్లుచీటీనే.

జన రంజకమైన వార్తలు