• తాజా వార్తలు
  •  

మ‌న ప్రైవ‌సీని బ్లాక్‌క్యాట్ కమెండోలా కాపాడే మొబైల్ ఆప‌రేటింగ్ సిస్టం ఈలో 

కొత్త సంవ‌త్స‌రంలో టెక్నాల‌జీలో కొత్త కొత్త మార్పులు వ‌స్తున్నాయి.  మొబైల్ ఫోన్ల‌కు ఓపెన్ సోర్స్ ఆప‌రేటింగ్ సిస్టం కూడా అందుబాటులోకి రాబోతోంది. అంటే మ‌నం పీసీ లేదా ల్యాపీ కొనుక్కుని ఓఎస్ లోడ్ చేసుకున్న‌ట్లే ఫోన్ కొనుక్కుని ఓఎస్‌ను మ‌నం ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.  యూర‌ప్ బేస్డ్ ఈలో కంపెనీ దీన్ని త‌యారుచేసే ప్ర‌య‌త్నాల్లో ప‌డింది.  యాపిల్‌, గూగుల్ లాంటి ఓఎస్‌లేవీ ఇందులో ఉండ‌వు కాబ‌ట్టి మ‌న డేటా వాళ్ల ద‌గ్గ‌ర‌కు చేరే ఛాన్సే లేదు. ఇది సెక్యూరిటీ ప‌రంగా చాలా బెస్ట్ సెట‌ప్ అంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు.
అందుకే సెక్యూరిటీ ప్రాబ్ల‌మ్స్ 
నూటికి నూరు శాతం సెక్యూర్డ్‌గా ఉండే స్మార్ట్‌ఫోన్లు క‌నిపెట్ట‌డానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా స‌క్సెస్ కావ‌డం లేదు. దీనికి కార‌ణం అన్ని ఫోన్లు, వాటిలో ఉండే యాప్స్ గూగుల్ లేదా  ఐవోఎస్ ఓఎస్‌తో వ‌స్తుంటాయి. వీటికి అనుబంధంగా ఉండే స‌ర్వీస్‌లు జీమెయిల్‌, గూగుల్ మ్యాప్స్‌, గూగుల్ డ్రైవ్‌లో మ‌నం చేసే యాక్ష‌న్స్ అన్నీ గూగుల్ రికార్డ్ చేస్తుంది.  ఇది మ‌న ప్రైవ‌సీని దెబ్బ‌తీసే అవ‌కాశాలున్నాయి.  చాలా సంద‌ర్భాల్లో మ‌న డేటా సెక్యూరిటీని కాపాడ‌డం   గురించి ఆ కంపెనీలు పూర్తిస్థాయిలో ప‌ట్టించుకోవడం లేద‌ని ఎక్స్‌ప‌ర్ట్‌లు అంటుంటారు. అయితే మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లాంటి ఔట్‌సోర్సిగ్ ఓఎస్‌లు వ‌చ్చినా క్లిక్ కాక‌పోవ‌డానికి కారణం అందులో యూజ‌ర్లు రెగ్యుల‌ర్‌గా వాడే యాప్స్ అన్నీ లేక‌పోవ‌డ‌మే.
ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈలో పేరిట ఓపెన్ సోర్స్ ఓఎస్ త‌యారీకి మార్గం ఏర్ప‌డింది.   
గూగుల్ లేకుండానే..
డ్ర‌గ్స్ బిజినెస్ చేసేవాళ్లు, హైలెవెల్ ఫైనాన్షియ‌ల్ క్రైమ్స్‌చేసే వాళ్లు సీక్రెట్ వెబ్ వాడ‌తారు. గూగుల్ లాంటి సెర్చి ఇంజిన్లు వాడ‌రు. ఎందుకంటే అందులో రికార్డ్ అయితే ఈజీగా పట్టుబ‌డిపోతారు కాబ‌ట్టి.  అంటే గూగుల్ యూజ‌ర్ల యాక్టివిటీని ఎంత‌గా వాచ్ చేస్తుందో అర్ధం చేసుకోవ‌చ్చు.  కానీ   గూగుల్ యాక్సెస్ ఉన్న డివైస్‌ను  వాడే సాధార‌ణ ప్ర‌జ‌ల యాక్టివిటీ కూడా ఈ సెర్చ్ ఇంజిన్లు ప‌ట్టేస్తాయి. ఇది ఎవ‌రైనా హ్యాక‌ర్ల చేతిలో ప‌డితే మ‌న సైబ‌ర్ సేఫ్టీ ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్లే.   అందుకే గూగుల్ లేకుండానే ఈ ఓఎస్ న‌డిపించేలా చేయ‌డంపైనే తొలిద‌శ‌లో  దృష్టి పెడుతున్నారు. గూగుల్ కంట ప‌డ‌కుండా మ‌నం ఇంట‌ర్నెట్ వాడుకోగ‌లిగితే మ‌న సెక్యూరిటీకి ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ ఉండ‌వు.  యాపిల్ కూడా త‌న యూజ‌ర్ల డేటాను ట్రాక్ చేసి బిజినెస్ ప‌ర్ప‌స్‌లో వాడుకుంటుందని ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. ముందు ఎక్కువ మంది వాడే గూగుల్ ఓఎస్‌మీద దృష్టి పెట్టారు.త‌ర్వాత ద‌శ‌లో ఐవోఎస్ వైపు వెళ‌తామ‌ని ఈలో టీమ్ చెబుతోంది. అంతేకాదు లోక‌ల్ లాంగ్వేజ్‌ల్లో కూడా మంచి యాక్సెస్ ఉండేలా ఈ ఓఎస్‌ను తీసుకొస్తామంటోంది.  అల్టిమేట్‌గా 100% ఓపెన్ సోర్స్ ఈలో ఫోన్‌ను తీసుకురావాల‌న్న‌దే త‌మ టార్గెట్ అని, ఇందుకోసం ఇప్పుడున్న‌ఫోన్ల  సాఫ్ట్‌వేర్‌ను రివ‌ర్స్ ఇంజినీరింగ్ ద్వారా లోతుగా స్టడీ చేస్తున్నామ‌ని ఈలో చెప్పింది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు