ఎసెన్షియల్ ఫోన్.. ఈ ఏడాది జూన్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌కు బోల్డన్ని ప్రత్యేకతలున్నాయి. ఆండ్రాయిడ్ కో ఫౌండర్ ఆండీ రూబిన్ సొంతంగా ఈ కంపెనీని ప్రారంభించాడు. 5.7 ఇంచెస్ బీజిల్‌లెస్ (ఎడ్జ్ టు ఎడ్జ్) స్క్రీన్ దీని ప్రత్యేకతగా లాంచింగ్ టైంలోనే చెప్పారు. కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు స్ప్రింట్,అమెజాన్ సైట్లలో కూడా ఎసెన్షియల్ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రైస్ 699 డాలర్లు ( సుమారుగా 45వేల రూపాయలు). దీని స్పెషాలిటీస్ ఏమిటో ఆండీ రూబిన్ బ్లాగ్ పోస్ట్‌లో చెప్పారు.
ఏంటి స్పెషాలిటీస్
* ఈ ఫోన్‌కు పేరుంది గానీ కంపెనీ బ్రాండింగ్ లేదు. ఎందుకంటే ఇది యూజర్ ఫోన్ కంపెనీది కాదంటున్నాడు ఆండీ రూబిన్.
* ఈ ఫోన్ కొనుక్కుంటే రెండేళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఎలాంటి మార్పు వచ్చినా అప్డేట్ అవుతుంది.
* అంతేకాదు మూడేళ్లపాటు ప్రతి నెలా సెక్యూరిటీ అప్డేట్స్ పంపిస్తారు.
* కొన్ని నెలలకు ఒకటి చొప్పున ఈ ఫోన్‌తో కనెక్ట్ అయ్యే వైర్లెస్ యాక్సెసరీస్‌ను రిలీజ్ చేస్తారు. కాబట్టి ఫోన్‌ను మార్చకుండానే మార్కెట్లో వచ్చిన ప్రతి కొత్త ఫీచర్‌ను మీ ఎసెన్షియల్ ఫోన్లో పొందవచ్చని రూబిన్ చెప్పాడు.
* కస్టమర్ ఫస్ట్ నినాదంతో 100 మందితో ఎసెన్షియల్ టీమ్ ఉంది.
ఎసెన్షియల్ ఫోన్ ఫీచర్లు
* 5.7 ఇంచెస్ ఎడ్జ్ టు ఎడ్జ్ క్యూహెచ్డీ డిస్ప్లే
* ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ ఓఎస్
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
* 64 బిట్ స్నాప్ డ్రాగన్ 835 ఆక్టాకోర్ ప్రాసెసర్
* ఆడ్రెనో 540 జీపీయూ
* 4జీబీ ర్యామ
* 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 3040 ఎంఏహెచ్ బ్యాటరీ. క్విక్ చార్జింగ్ ఆప్షన్
* రియర్సైడ్లో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రతి లెన్స్‌కు RGB, monochrome capabilities, హైబ్రీడ్ ఆటోఫోకస్, ఫేజ్ డిటెక్ట్, ఐఆర్ లేజర్ అసిస్ట్ ఫోకస్ తోపాటు 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. దీంతో కూడా 4కే వీడియో రికార్డ్ చేయొచ్చు.
* యూఎస్బీ టైప్ సీ పోర్ట్