• తాజా వార్తలు

త్వ‌ర‌లో భార‌త్‌లో లాంఛ్ కాబోతున్న గూగుల్ ఫీడ్‌.. మీరు తెలుసుకోవాల్సిన విష‌యాలు

మారుతున్న ప‌రిస్థితుల‌కు తగ్గ‌ట్టుగా.. అప్‌డేటెడ్‌గా ఫీచ‌ర్లు తీసుకు రావ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందుంటుంది. దీనిలో భాగంగానే గూగుల్ మ‌రో ఫీచ‌ర్‌ను యూజ‌ర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది అదే గూగుల్ ఫీడ్‌. ఇది ఆ సంస్థ ప‌ర్స‌న‌ల్ కంటెంట్ స‌ర్వీస్‌. త్వ‌ర‌లోనే గూగుల్ ఫీడ్ భార‌త్‌లో లాంఛ్ కాబోతోంది.  మ‌రి దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విష‌యాలేంటంటే..

గూగుల్ ఫీడ్ అంటే..
మ‌నం ఏం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. మ‌నం ఒక విష‌యం గురించి వెతికితే వంద‌ల పేజీల రిజ‌ల్ట్స్ వ‌స్తాయి. గూగుల్ ఫీడ్ అనే ఫీచ‌ర్ మ‌న‌కు కంటెంట్‌ను ఇవ్వ‌డంలో సాయం చేస్తుంది. మీ సెర్చింగ్‌కు త‌గ్గ‌ట్టుగా కంటెంట్‌ను సిద్ధం చేస్తుంది. అంటే ట్రాఫిక్ అప్‌డేట్ లేదా ఎయిర్ టిక్కెట్ల ధ‌ర‌లు ఏమైనా త‌గ్గ‌యా అని మ‌నం గ‌తంలో వెతికితే.. తాజాగా వాటి స్థితి గ‌తుల గురించి కూడా గూగుల్ ఫీడ్ మీకు స‌మాచారాన్ని అందిస్తుంది. 

గూగుల్ ఫీడ్‌, గూగుల్ హోమ్‌
గూగుల్ ఫీడ్‌తో పాటు గూగుల్ హోమ్ అనే ఆప్ష‌న్‌ను కూడా గూగుల్ లాంఛ్ చేస్తుంది. గూగుల్ హోమ్ అంటే స్మార్ట్ స్పీక‌ర్‌, అసిస్టెంట్‌. భార‌త్‌లో ఎక్కువ‌మందికి చేరువ కావాల‌నే ల‌క్ష్యంతో ఈ కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న సంస్థ వ్యూహాలు ర‌చిస్తోంది.

2018 ఆరంభంలోనే..
గూగుల్ ఫీడ్‌, గూగుల్ హోమ్ ఫీచ‌ర్ల‌ను వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే భార‌త్‌లో లాంఛ్ చేసేందుకు గూగుల్ ప్ర‌య‌త్నిస్తోంది. అంటే జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో ఈ ఫీచ‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని భాష‌ల్లోనూ ఈ గూగుల్ ఫీడ్‌ను తీసుకొచ్చేందుకు ఈ సంస్థ  ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.  ప్ర‌స్తుతానికి ప్ర‌ధాన భాష‌ల‌పై గూగుల్ దృష్టి పెట్టింది. అమెజాన్ అలెక్స్ లాంఛ్ త‌ర్వాతే గూగుల్ త‌న కొత్త ఫీచ‌ర్ల‌ను లాంఛ్ చేసే అవ‌కాశం ఉంది.

లోక‌ల్ బేస్డ్ న్యూస్‌
గూగుల్ ఫీడ్‌లో అన్నిటికంటే ఆకర్షిస్తుంది లోక‌ల్ బేస్డ్ న్యూస్‌. గూగుల్ దీని కోసం ప్ర‌త్యేకంగా న్యూస్ పోర్ట‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది లొకేష‌న్ బేస్డ్ ప‌ర్స‌న‌లైజ్డ్ న్యూస్ ఫీడ్ పేరుతో దీన్ని తెర మీద‌కు తీసుకొస్తున్నారు.  ఇదే కాకు న్యూ టు యు ఫీచ‌ర్ కూడా త్వ‌ర‌లోనే రానుంది. ఇది యూజ‌ర్ల ఫేవ‌రెట్ టాపిక్‌ను లిస్ట్ అవుట్ చేస్తుంది. అందులో కొత్త విష‌యాలు వ‌స్తే వాటిని అప్‌డేట్ చేస్తుంది. 

జన రంజకమైన వార్తలు