• తాజా వార్తలు

ఈ గూగుల్ ఫీచ‌ర్ స‌క్సెస్ అయితే రివ్యూ మెకానిజ‌మ్‌కు ఓ విధ్వంసక ఆవిష్క‌ర‌ణే

మూవీస్‌, టెలివిజ‌న్ రివ్యూస్‌ కోసం.. సెర్చ్ ఇంజ‌న్ గూగుల్ ఓ కొత్త ఫీచ‌ర్‌ను లాంచ్ చేసింది. దీనిలో యూజ‌ర్ మూవీ, టీవీ రివ్యూను సబ్మిట్ చేయ‌గానే అది ఆ మూవీ లేదా టీవీ ప్రోగ్రామ్‌కు సంబంధించిన గూగుల్ సెర్చ్ రిజ‌ల్స్ట్‌లోనే డైరెక్ట్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఎవ‌రైనా యూజ‌ర్ దాని గురించి సెర్చ్ చేసిన‌ప్పుడు దాని రివ్యూ కూడా సెర్చ్ పేజీలోనే క‌నిపిస్తుంద‌న్న‌మాట‌. కాబట్టి ముందు సెర్చ్‌చేసుకుని ఆ త‌ర్వాత మ‌ళ్లీ దాన్ని రివ్యూల కోసం వెతుక్కునే ప‌ని లేదు. డైరెక్ట్‌గా సెర్చ్ పేజీలోనే టాప్‌లో క‌నిపిస్తే రివ్యూ మెకానిజమ్‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ అవ‌డం ఖాయం.
ఎలా ప‌ని చేస్తుంది? 
యూజ‌ర్ రివ్యూ స‌బ్మిట్ చేయ‌గానే అది టీవీ షోలు, మూవీస్‌కు సంబంధించిన గూగుల్ సెర్చ్‌లో  నాలెడ్జ్ ప్యాన‌ల్లో క‌నిపిస్తుంది.  రివ్యూలో ఏదైనా ఇన్ ఎప్రాప్రియేట్ కంటెంట్ ఉంటే ఆటేమేటిగ్గా ఫిల్ట‌ర్ అయిపోతుంది. ఇన్ ఎప్రాప్రియేట్ కంటెంట్ కంపెనీ ద్వారా వ‌స్తే ఇండివిడ్యువ‌ల్ యూజ‌ర్స్ దాన్ని ఫ్లాగ్ చేయొచ్చు. 
ఇండియాలోనూ వ‌స్తుంది
ఈ కొత్త ఫీచ‌ర్ ఇండియాలో కూడా అందుబాటులోకి వ‌స్తుంద‌ని  గూగుల్ అనౌన్స్ చేసింది.  restaurant reviews పేరిట ఇప్ప‌టికే రెస్టారెంట్ టైమ్స్‌, లొకేష‌న్‌, ఫుడ్ మీద రివ్యూస్ అన్నీ అందిస్తున్న గూగుల్ ఇప్పుడు మూవీ, టీవీషోల రివ్యూస్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లోనూ త‌న రివ్యూ సిస్ట‌మ్‌ను గూగుల్ సెర్చ్‌కు లింకప్ చేసింది.  లోక‌ల్ లైబ్ర‌రీస్ నుంచి బుక్స్ తెచ్చుకునేందుకు వీలుగా యూఎస్‌లోనూ ఇలాంటి ఫీచ‌ర్‌నే తీసుకొచ్చింది. మొత్తంగా రివ్యూల‌ను సెర్చ్ ఇంజిన్‌కు లింక‌ప్ చేసే ఈ కొత్త ఫీచ‌ర్లు యూజ‌ర్ల‌కు మ‌రింత యూజ్‌ఫుల్ కాబోతున్నాయి.

జన రంజకమైన వార్తలు