• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ఏమిటీ గూగుల్ లెన్స్ ? మన జీవితాలని ఎలా మార్చనుంది ?

గూగుల్ ఏం చేసినా అది క‌చ్చితంగా అంద‌రికి ఉప‌యోగ‌ప‌డేలా ఉంటుంది. గ‌తేడాది గూగుల్ ఐ అండ్ ఓ డెవ‌ల‌ప‌ర్ స‌ద‌స్సులో గూగుల్ లెన్స్ అనే కొత్త స‌ర్వీసును తీసుకొస్తున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. దీని సాయంతో మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాల‌ను కూడా ఈ కెమెరా ప‌సిగ‌డుతుంద‌ట‌. ఈ కొత్త ఫీచ‌ర్‌ను అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు విస్త‌రించ‌నున్న‌ట్లు గూగుల్ వెల్లడించింది. అయితే ఈ గూగుల్ లెన్స్ అనే ఫీచ‌ర్ ఎలా ప‌ని చేస్తుంద‌నే దాని మీద ఎవ‌రికీ పూర్తి క్లారిటీ లేదు. మ‌రి ఇదెలా ప‌ని చేస్తుందో చూద్దాం..

ఏంటి గూగుల్ లెన్స్‌!
గూగుల్ లెన్స్ టెక్నాల‌జీ ప్ర‌ధానంగా స్మార్ట్‌ఫోన్ కెమెరా ఆధారంగా ప‌ని చేస్తుంది. మీ చుట్టు ప‌క్క‌ల ఏమి ఉందో మీకు తెలియ‌జేస్తూ దానికి త‌గ్గ‌ట్టుగా ఫొటో తీసుకునేలా చేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. అంటే అంద‌రూ ఫొటో తీసుకునేట‌ప్పుడు ఎలా ప‌డితే అలా తీసేస్తారు లైటింగ్‌, విజువ‌లిటీ, ఇంకా బ్రైట్‌నెట్ ఏమి ప‌ట్టించుకోరు. మ‌న ఫొటోల‌ను దెబ్బ కొట్టేవి ఇవే. ఇలాంటి టెక్నిక‌ల్ విష‌యాల‌నే గూగుల్ లెన్స్ మ‌న‌కు చెబుతుంది. ఈ గూగుల్ లెన్స్‌కు గూగుల్ ఫొటోలు, గూగుల్ అసిస్టెంట్ హెల్ప్ చేస్తాయి. 

ఎప్పుడు వ‌స్తుంది?
2017లోనే గూగుల్ లెన్స్ లాంఛ్ అయింది. ప్ర‌స్తుతం ఇది పిక్స‌ల్ ఫోన్ల‌లో మాత్ర‌మే ఉంది. పిక్స‌ల్ 2 ఫోన్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా దీన్ని ప‌రిశీలించారు. త్వ‌ర‌లోనే ఇది మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో సైతం వ‌స్తుంద‌ని గూగుల్ చెప్పింది. గూగుల్ ఫొటోస్ ఆప్ష‌న్ ద్వారా గూగుల్ లెన్స్ రోల్ ఔట్ అవుతుంద‌ని ఈ ఫిబ్ర‌వ‌రిలో గూగుల్ ప్ర‌క‌టించింది. అంతేకాదు గూగుల్ అసిస్టెంట్‌లోనూ ఈ కొత్త ఫీచ‌ర్‌ను మ‌నం చూడొచ్చు.  ప్ర‌యోగాలు ఫ‌లిస్తే ఇత‌ర హ్యాండ్‌సెట్ల‌లోనూ లెన్స్ ఆప్ష‌న్ పెట్టే ప‌నిలో ఉంది గూగుల్‌.

లెన్స్ ఏం చేస్తుంది?
గూగుల్ లెన్స్ ద్వారా ఎన్నో ఉప‌యోగాలున్నాయి. ముఖ్యంగా ఐదు ప్ర‌త్యేక‌మైన టాస్క్‌లు ఉన్నాయి.  భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని ఫీచ‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. మీ బిజినెస్ కార్డును గూగుల్ లెన్స్ ముందు పెడితే మీ ఫోన్ నంబ‌ర్‌, అడ్రెస్‌ల‌ను ఇది కాప్చ‌ర్ చేస్తుంది. మీ ఫోన్‌లో ఈ స‌మాచారాన్ని యాడ్ చేస్తుంది. అంతేకాదు మీ ఈ మెయిల్‌, యూఆర్ఎల్‌లోనూ ఇది ప‌ని చేస్తుంది. అంటే మీరు ఒక పుస్త‌కం టైటిల్ స్కాన్ చేస్తే చాలు.. గూగుల్ లెన్స్ ఆ పుస్త‌కం గురించి రివ్యూలు వెబ్‌లో వెతికి ఇస్తుంది. మ్యూజిక్ ఆల్బ‌మ్స్ గురించి కూడా ఇది వెతికి పెడుతుంది. అంతేకాక ఏదైనా ల్యాండ్ మార్క్‌, బిల్డింగ్ గురించి కూడా ఇది సెర్చ్ చేస్తుంది. మీ ఫోన్‌ను స్కాన‌ర్‌లా ఉపయోగించ‌డం, ఇమేజ్‌ల‌ను గుర్తించ‌డం లాంటి అద్భుత‌మైన ఆప్ష‌న్లు దీనిలో ఉన్నాయి. 

జన రంజకమైన వార్తలు