• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - గూగుల్ నెక్స్ట్ టార్గెట్ మీ బాత్‌రూమ్‌?

విన‌డానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుందా? ఆగండాగండి..గూగుల్ మీ బాత్‌రూమ్‌లో స్పై కెమెరా పెట్టి... ఏదేదో ఊహించేసుకోకండి.  ఎందుకంటే గూగుల్ మీ బాత్‌రూమ్‌లోకి చొర‌బ‌డేది మీ మంచి కోస‌మే. అదేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి విష‌యం మీకే అర్ధ‌మ‌వుతుంది.
లైఫ్‌స్టైల్ మారిపోవ‌డం, చ‌దువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో కాంపిటీష‌న్ పెరిగిపోయి టెన్ష‌న్ క్రియేట‌వడం, త‌గినంత వ్యాయామం లేక‌పోవ‌డంతో చిన్న వ‌య‌సులోనే చాలామంది గుండె పోటుకు గుర‌వుతున్నారు. 30, 35 ఏళ్ల వ‌య‌సులోనే హార్ట్‌స్ట్రోక్ వ‌చ్చి చ‌నిపోతున్న కేసులు కూడా చాలా చూస్తున్నాం. అలాంటి ప్ర‌మాదాల‌ను గుర్తించి హెచ్చ‌రించేలా గూగుల్ ఓ టెక్నాల‌జీని క్రియేట్ చేసింది. దీనికి పేటెంట్ కూడా సంపాదించింది. దీని ప్ర‌కారం గూగుల్ మీ బాత్‌రూమ్‌లో సెన్స‌ర్లు పెట్టి అక్క‌డ మీ బ్ల‌డ్ ప్రెజ‌ర్‌, బాడీ మూమెంట్స్ ద్వారా మీకు గుండె సంబంధ స‌మ‌స్య‌లు (cardiovascular health issues) ఏమన్నా ఉన్నాయేమో ప‌సిగ‌డుతుంది.  ఈ సెన్స‌ర్ల సిగ్న‌ల్స్‌ను మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్‌కు పంపి మీ  గుండె ఆరోగ్యాన్ని అంచ‌నా వేస్తుంది. ఇందుకోసం ఆప్టిక‌ల్స్ సెన్స‌ర్ల‌ను బాత్‌రూమ్‌లో కూడా వినియోగించేలా త‌యారుచేసిన టెక్నాల‌జీకి గూగుల్ పేటెంట్ పొందింది. మీ బిహేవియ‌ర‌ల్ చేంజెస్‌ను ప‌సిగ‌ట్టి భ‌విష్య‌త్తులో గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూడ‌డంలో  ఈ సెన్స‌ర్ల ద్వారా చేసే అబ్జ‌ర్వేష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
 

స్మార్ట్ బాత్‌రూమ్‌
*బాత్‌రూమ్‌లో మ‌నం వాడే మాట్‌లో సెన్స‌ర్లు పెడ‌తారు. ఇవి మీరు మాట్‌మీద‌కు రాగానే మీ బాడీలో క‌లిగే ఎల‌క్ట్రిక‌ల్ ప్యాట్ర‌న్స్ ద్వారా మీ హార్ట్ బీటింగ్ రేట్‌ను లెక్క‌క‌డ‌తాయి. 

* బాత్‌రూమ్ మిర్ర‌ర్‌లో కూడా సెన్స‌ర్లుంటాయి. ఇవి మీ స్కిన్ క‌ల‌ర్‌లో ఏవైనా మార్పులొస్తే ప‌సిగ‌డ‌తాయి. 

*అంతేకాదు టాయిలెట్ సీట్ల మీద కూడా సెన్స‌ర్లు పెట్టి మీ బీపీ లెవెల్స్‌ను సెన్స్‌చేస్తారు. 

* బాత్‌ట‌బ్‌లో ఉండే సెన్స‌ర్లు దాన్ని అల్ట్రాసోనిక్‌గా మారుస్తాయి. దీంతో గుండె ప‌నితీరును గుర్తించే ఎకో టెస్ట్ కూడా చేసేయొచ్చు. ఇలా మొత్తంగా మీ బాత్‌రూమ్‌ను స్మార్ట్ బాత్‌రూమ్‌గా మార్చేస్తారు. 

డాక్ట‌ర్‌కు డేటా పంపుతారు
ఇలా సెన్స‌ర్ల ద్వారా రికార్డ్ చేసిన స‌మాచారాన్ని క‌లెక్ట్ చేస్తారు.యూజర్ కోరుకుంటే దీన్ని ఆరోగ్య నిపుణుల‌కు పంపిస్తారు. వాళ్లు దీన్ని చెక్‌చేసి హార్ట్ కండిష‌న్ ఎలా ఉందో విశ్లేషిస్తారు. ఇవ‌న్నీ మీ ఇమేజ్ బేస్డ్‌గా కాకుండా కేవ‌లం సెన్స‌ర్లు పంపించే సిగ్న‌ల్స్ ఆధారంగానే లెక్క‌క‌డ‌తారు. బాత్‌రూమ్ మిర్ర‌ర్లో కూడా నాన్‌విజిబుల్ సెన్స‌ర్ పెడ‌తారు.  కాబ‌ట్టి మీ ప్రైవ‌సీకి భంగం క‌లిగే ప్ర‌స‌క్తే లేదు.  ప్ర‌స్తుతం ఇది పేటెంట్ ద‌శ‌లోనే ఉంది. ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి మ‌రింత టైం ప‌ట్టొచ్చు. పేటెంట్ తీసుకున్న‌వ‌న్నీ ప్రొడ‌క్ట్ వ‌ర‌కూ వెళ్ల‌డం కూడా చాలాసార్లు సాధ్యం కాకపోవ‌చ్చు కూడా.

జన రంజకమైన వార్తలు