• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ -హియ‌ర్ వి గో - ఆఫ్‌లైన్ మ్యాప్ లలో విధ్వంసక ఆవిష్కరణ..

ఎన్ని నావిగేషన్ సర్వీసెస్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వ‌చ్చినా  మ్యాప్స్ అంటే అందరికి గుర్తొచ్చేది, ఎక్కువ మంది వాడేది గూగుల్ మ్యాప్స్ మాత్రమే. నోకియా నుంచి వచ్చిన హియ‌ర్ వి గో కూడా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ తో పోటీలో నిలబడుతోంది. ఇది కొత్త సర్వీస్ అయినా కూడా గూగుల్ మ్యాప్స్ లాంటి దిగ్గజంతో పోటీగా అన్ని రకాల ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 

అంద‌రికీ అందుబాటులో..
మొదట్లో నోకియా యూజర్లకు మాత్రమే వి గో ప‌రిమిత‌మైంది. అయితే సెల్‌ఫోన్ల‌లో నోకియా ప్రాధాన్యం త‌గ్గిపోవ‌డంతో ఇప్పుడు అంద‌రికీ ఈ స‌ర్వీసును అంబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్ మాదిరిగా ఇది కూడా ఫ్రీ యాప్‌.  ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లోనూ  దొరుకుతుంది.
 

ఆఫ్‌లైన్‌లో..
ఏ మ్యాప్ స‌ర్వీస్‌కైనా ఆఫ్‌లైన్‌లో ఎంత‌వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంద‌నేది కీల‌కం. ఎందుకంటే మ‌నం మ్యాప్ సాయంతో చూసుకుంటూ వెళ్లే అన్ని ప్ర‌దేశాల్లోనూ మొబైల్ నెట్‌వ‌ర్క్ ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు ఆఫ్‌లైన్‌లో ప‌ని చేయ‌క‌పోతే క‌ష్టం. అందుకే వి గోను ఆఫ్‌లైన్లోనూ అందుబాటులోకి తెచ్చారు.  ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్‌తో సమానంగా ఫీచర్స్ కలిగి ఉంది. 
 

సైజ్ చిన్న‌ది
ఇక యాప్ సైజ్‌తో పోల్చితే ఇది గూగుల్ మ్యాప్స్ కంటే సగం స్పేస్‌నే తీసుకుంటుంది.  గూగుల్ మ్యాప్స్‌, హియ‌ర్ వి గో యాప్స్ రెండింటినీ 15 రోజుల పాటు ఫోన్లో డౌన్లోడ్ చేసి వాడి చూశారు. యాప్ సైజ్‌, డేటా అన్నీ కలిసి  గూగుల్ మ్యాప్స్ 400 ఎంబీ స్పేస్ వాడుకుంటే వి గో 195 ఎంబీ మాత్రమే వినియోగించుకుంది. 64 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ ఉన్న ఫోన్లు వ‌చ్చేసిన నేప‌థ్యంలో 200 ఎంబీకి పెద్ద విలువ లేక‌పోవ‌చ్చు కానీ ఇప్ప‌టికీ 8 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్ ఉన్న బేసిక్ స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ స్పేస్ కూడా చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.
 

ఆఫ్‌లైన్ మ్యాప్ క‌స్ట‌మైజేష‌న్ 
గూగుల్ మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్లో వాడుకోవ‌డానికి మ‌నకు కావాల్సిన ఏరియా ఉన్న ప్లేస్‌ను మ్యాప్ రూపంలో  సేవ్ చేస్తుంది.  అంటే మ‌నం ఢిల్లీ మ్యాప్ కావాలంటే  ఢిల్లీ మ్యాప్‌ను మ్యాప్ రూపంలో సేవ్‌చేస్తుంది.  ఎక్కువ స్పేస్‌, డేటాను తీసుకుంటుంది. అదే  వి గోలో అయితే ఆఫ్‌లైన్లో వాడుకోవ‌డానికి వీలుగా ఆయా ప్రాంతాల మ్యాప్‌ల‌న్నీ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. జ‌స్ట్ డౌన్‌లోడ్ బ‌ట‌న్ క్లిక్ చేస్తే చాలు ఆ ప్రాంతం ( ఢిల్లీ, రాజ‌స్థాన్‌, కాశ్మీర్ ఇలా ఏది కావాలంటే అది) మ్యాప్ మాత్ర‌మే డౌన్‌లోడ్ అవుతుంది.   హియ‌ర్ విగోలో మేజ‌ర్ అడ్వాంటేజ్‌.  20 కిలోమీట‌ర్ల చిన్న రేడియ‌స్‌కు కూడా మ్యాప్ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  
 

ట్రాఫిక్ అప్‌డేట్స్‌
రెండు యాప్స్‌కు పెద్ద సంఖ్య‌లో యూజ‌ర్లున్నందున ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇచ్చే విష‌యంలో రెండూ ఒక‌దానికి ఒక‌టి తీసిపోవు. గూగుల్ మ్యాప్స్ మీరు వెళ్లే రూట్‌లో ఎంత ట్రాఫిక్ ఉందో రెడ్ క‌ల‌ర్ లైన్ ద్వారా చూపిస్తుంది. హియ‌ర్ వి గో అయితే బాగా హెవీ ట్రాఫిక్ ఉంటే రెడ్‌, మీడియంగా ఉంటే ఎల్లో, పెద్ద‌గా ట్రాఫిక్ లేదు.. ఈజీగా వెళ్లిపోవ‌చ్చు అంటే గ్రీన్ లైన్స్ ద్వారా చూపిస్తుంది.  కాబ‌ట్టి ట్రాఫిక్ అప్‌డేట్స్‌లోనూ హియ‌ర్ విగోనే బెస్ట్.

అయితే యాక్టివ్ రీరూటింగ్‌, థ‌ర్డ్ పార్టీ యాప్స్‌తో ఇంటిగ్రేష‌న్ విష‌యంలో గూగుల్ మ్యాప్సే ముందుంది. అయితే  హియ‌ర్‌విగో కొత్త‌గా ఈ రంగంలోకి వ‌చ్చింది కాబ‌ట్టి త్వ‌ర‌లో పుంజుకుని గూగుల్ మ్యాప్స్‌కి మంచి పోటీ ఇవ్వ‌డం ఖాయం. 

జన రంజకమైన వార్తలు