• తాజా వార్తలు

ప్రివ్యూ - ఏమిటీ బాల్ ఆధార్? ఇదీ తప్పనిసరేనా ?

ఆధార్ యొక్క నోడల్ ఏజెన్సీ అయిన UIDAI 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసం బాల్ ఆధార్ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం ను లాంచ్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలి అంటే బాల్ ఆధార్ అంటే చిన్న  పిల్లల ఆధార్. అసలు ఈ బాల్ ఆధార్ ఏమిటి? దీని విశిష్టతలు ఏమిటి? దీనిని ఎలా తీసుకోవాలి? తదితర విషయాల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

బాల్ ఆధార్ అంటే ఏమిటి?

ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇది చిన్న పిల్లల ఆధార్. ఇందులో ఐరిస్ స్కాన్, ఫింగర్ ప్రింట్ స్కాన్ లాంటి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ లు ఏవీ ఉండవు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు దీనిని తీసుకోవాలి. మీ పిల్లలకు 5 సంవత్సరాల దాటిన తర్వాత ఈ బాల్ ఆధార్ ను రెగ్యులర్ ఆధార్ గా మార్చుకోవాలి. ఈ బాల్ ఆధార్ ను బ్లూ కలర్ లో UIDAI ఇస్తుంది. ఇది తప్పనిసరి ఏమీ కాదు. అయితే పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత ప్రభుత్వ స్కాలర్ షిప్ లకోసం కానీ, ఉన్నత విద్య కోసం కానీ దీని అవసరం ఉండే అవకాశo ఉంది. విదేశీ యూనివర్సిటీ లకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఇది ఉపయోగపడనుంది.

ఈ బాల్ ఆధార్ ను పొందడం ఎలా ?

  1. మీ చిన్నారిని తీసుకుని మీ సమీపం లోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్ళండి. అక్కడ వాళ్ళు ఇచ్చే ఫాం ను పూర్తి చేయండి.
  2. మీ చిన్నారి యొక్క బర్త్ సర్టిఫికేట్ మరియు తలిదండ్రులలో ఎవరో ఒకరి ఆధార్ కార్డు ను తీసుకువెళ్ళాలి.
  3. అక్కడ మీ పాప/బాబు యొక్క ఫోటో ను తీసుకుంటారు.
  4. మీ చిన్నారి యొక్క బాల్ ఆధార్ ను తలిదండ్రులలో ఎవరో ఒకరి ఆధార్ కార్డు తో లింక్ చేస్తారు.
  5. ఏ విధమైన బయోమెట్రిక్ వివరాలు తీసుకోరు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను సబ్మిట్ చేస్తారు.
  6.  వెరిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ పంపుతారు.
  7. ఆ తర్వాత 60 రోజుల లోపు మీ ఇంటి కి పోస్ట్ ద్వారా బాల్ ఆధార్ వస్తుంది.

మీ పాప/బాబు కు 5 సంవత్సరాలు నిండిన తర్వాత 7 సంవత్సరాల లోపు అంటే మీ చిన్నారికి 12 సంవత్సరాలు వచ్చే లోపు తప్పనిసరిగా బాల్ ఆధార్ ను రెగ్యులర్ ఆధార్ గా మార్చుకోవాలి. లేకపోతే మీ చిన్నారి యొక్క బాల్ ఆధార్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.

జన రంజకమైన వార్తలు