• తాజా వార్తలు
  •  

హాన‌ర్ 9 లైట్ ఫోన్లో ఉన్న రైడ్ మోడ్ యాక్సిడెంట్స్ కాకుండా ఎలా కాపాడుతుందో చూడండి?

హువీయ్ బ్రాండ్ నుంచి స‌బ్ బ్రాండ్ హాన‌ర్ భార‌త్‌లో చాలా వేగంగా అంద‌రికి రీచ్ అయింది.. అంద‌రి అంచ‌నాల‌ను అందుకుంటూ రోజు రోజుకు మార్కెట్లో దూసుకుపోతోంది. దీనికి కార‌ణం హాన‌ర్‌లో ఉన్న ప్ర‌త్యేక‌మైన ఫీచ‌ర్లే. అంతకుమించి బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ కూడా కావ‌డంతో ఎక్కువ‌మంది హాన‌ర్ వైపు చూస్తున్నారు. జియోమి రెడ్‌మిడ్ నోట్ 5 లాంటి వాటికి ఛాలెంజ్ విసిరేలా ఉన్న ఫీచ‌ర్లు ఉన్న హాన‌ర్ 9 లైట్‌లో మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్ ఉంది అదే రైడ్ మోడ్. ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఈ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అదెలా ఉప‌యోగ‌ప‌డుతుందో చూద్దాం...

రోడ్ సేఫ్టీ కోసం.
రోడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని హాన‌ర్ 9 లైట్ రైడ్ మోడ్ అనే ప్ర‌త్యేక‌మైన ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా భార‌త్ రోడ్డు ప్ర‌మాదాలు గ‌ణ‌నీయంగా జ‌రుగుతుండ‌డంతో ఈ ఆప్ష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది ఆ సంస్థ న‌మ్మ‌కం. మ‌న దేశంలో మొబైల్ ఉప‌యోగిస్తూ ప్ర‌మాదాలకు గుర‌య్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.  హాన‌ర్ 9 లైట్‌లో ఇచ్చిన ఈ రోడ్ సేఫ్టీని ఫీచ‌ర్ ఈ నెలాఖ‌రున అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కంజ్యుమ‌ర్ సెంట్రిక్ ఇన్నోవేష‌న్‌గా హాన‌ర్ ప‌ని చేస్తోంది. ఈ ఇన్నోవేష‌న్‌లో భాగంగానే ఈ రైడ్ మోడ్ కూడా వ‌చ్చింది. మిలియ‌న్ల మంది భార‌త బైక‌ర్ల‌ను ఈ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డ‌నుంది. సైఫ్ రైడింగ్ కోస‌మే ఈ ఆప్ష‌న్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని హాన‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 

ఎలా ఉప‌యోగించాలంటే..
మీ హాన‌ర్‌ 9 లైట్ ఫోన్‌ను లేటెస్ట్ వోటీఏ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేసుకోవాలి. అప్పుడు రైడ్ మోడ్ మీ సెట్టింగ్స్ మెనూకు యాడ్ అవుతుంది. ఈ ఫీచ‌ర్‌ను యూజర్లు మాన్యువ‌ల్‌గా యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డ్రాప్ డౌన్ నోటిఫికేష‌న్ మెనూ ఇన్‌స్ట్ర‌క్ష‌న్ల ప్ర‌కారం ముందుకెళ్లాలి.  ఒక‌సారి మోడ్ యాక్టివేట్ చేసిన త‌ర్వాత ఎవ‌రైనా మీకు కాల్ చేస్తే మీరు కాల్ చేసి రైడ‌ర్ ప్ర‌స్తుతం డ్రైవింగ్‌లో ఉన్నార‌నే స‌మాచారం అవ‌త‌లి వారికి చేరుతుంది. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో కాల‌ర్ 1 నంబ‌ర్ ప్రెస్ చేయాలి.  అంటే క‌చ్చితంగా మాట్లాడాల్సిన కాల్ అని అర్ధం. అప్పుడు బైక్ మీద ఉన్న వారికి ప్ర‌త్యేక‌మైన సౌండ్ వ‌చ్చే ఏర్పాటు ఉంది. దీని వ‌ల్ల రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించొచ్చ‌ని హాన‌ర్ చెబుతోంది.

జన రంజకమైన వార్తలు