• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ఏమిటీ ఈ- సిమ్‌? మ‌న జీవితాలను ఎలా సింప్లిఫై చేస్తుంది?  

ఈ- సిమ్‌.. వ‌చ్చి చాలాకాల‌మే అయినా వినియోగిస్తున్న‌వాళ్లు చాలా త‌క్కువ. గూగుల్ త‌న సొంత ఫోన్లు పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లకు ఈ- సిమ్ స‌పోర్ట్ తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో దీని గురించి కాస్త ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు ఏంటీ ఈ- సిమ్‌? మ‌న‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది?  

ఈ- సిమ్ అంటే?  
ఈ- సిమ్ (eSIM) అంటే ఎంబెడెడ్ స‌బ్‌స్క్రైబ‌ర్ ఐడెంటిటీ మాడ్యూల్‌.   ప్ర‌పంచ‌వ్యాప్త మొబైల్ నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్ల సంఘమైన  GSMA దీన్ని ప్ర‌మోట్ చేస్తుంది. ఇప్పుడు మ‌నం వాడుతున్న ఫిజిక‌ల్ సిమ్ కార్డులు. ఈ- సిమ్ కార్డుల్లో సిమ్ ఫిజిక‌ల్‌గా ఉండ‌దు.  ఫోన్ సిమ్‌కార్డ్ స్లాట్లో వ‌ర్చువ‌ల్‌గా సిమ్ కార్డ్ లాంటి ఏర్పాటు ఉంటుంది. దీన్ని రిమూవ్ చేయ‌లేం. ఇది డైరెక్ట్‌గా మీ ఫోన్ మ‌ద‌ర్‌బోర్డుకు అటాచ్ అయి ఉంటుంది.  సాధార‌ణ‌, మైక్రో, నానో సిమ్‌ల మాదిరిగానే ఎల‌క్ట్రిక‌ల్ ఇంట‌ర్‌ఫేస్‌ను ఇస్తుంది. కాబట్టి సిమ్ కార్డు లాగే వాడుకోవ‌చ్చు.  
ఉప‌యోగాలేంటి?  
* యూజ‌ర్లు డిఫ‌రెంట్ సిమ్ కార్డులు మెయింటెయిన్ చేయ‌క్క‌ర్లేదు.  నానో సిమ్ సెట‌ప్ ఉంద‌ని మైక్రో సిమ్‌ను క‌ట్ చేయ‌డం లాంటి బాధ‌లుండ‌వు. 
* నెంబ‌ర్ మార‌కుండానే కొత్త నెట్ వ‌ర్క్‌కు  మార్చుకునే పోర్ట్ ఫెసిలిటీ కోసం ప్ర‌తిసారి సిమ్ కార్డు మార్చ‌క్క‌ర్లేదు. ఈ- సిమ్‌లో ఉన్న ఇన్ఫ‌ర్మేష‌న్‌ను నెట్ వ‌ర్క్ కారియ‌ర్స్ ఈజీగా మార్చుకోగ‌లిగే సౌక‌ర్యం ఉంది. కాబ‌ట్టి ఒక్క‌ఫోన్ కాల్‌తో మీరు పోర్ట్ చేసుకుని మీ క‌నెక్ష‌న్‌తో పాటు డేటాను కూడా కొత్త నెట్‌వ‌ర్క్ లోకి మారిపోవ‌చ్చు. 
* సిమ్ కార్డు లేక‌పోవ‌డంతో ఫోన్లో మ‌రింత స్పేస్ మిగులుతుంది. కాబ‌ట్టి ఫోన్‌ను మరింత స్లిమ్‌గా త‌యారుచేయొచ్చు. స్మార్ట్ వాచ్‌ల వంటి వాటికి మరీ యూజ్‌ఫుల్.
 కొత్త‌దేం కాదు
ఈ- సిమ్ కాన్సెప్ట్ కొత్త‌దేం కాదు. యాపిల్ త‌న ఐపాడ్‌ల‌కు యాపిల్ సిమ్ పేరుతో చాలాకాలం కింద‌టే తెచ్చింది.  GSMA కూడా 2010లోనే ఈ-సిమ్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. 2016లో శాంసంగ్   గేర్ 2 క్లాసిక్ 3జీ ఫోన్లోనూ, ఈ ఏడాది యాపిల్ వాచ్ సిరీస్ 3లో నూ ఈ-సిమ్‌ను తెచ్చాయి.  ఇనీషియ‌ల్‌గా కొన్ని స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్స్‌, ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌కు ప‌రిమిత‌మైన ఈ-సిమ్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌కు కూడా అందుబాటులోకి వ‌చ్చింది. బిల్ట్ ఇన్ ఈ- సిమ్ టెక్నాల‌జీతో వ‌చ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 2.  గూగుల్ కు చెందిన  Project Fi స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ -సిమ్ సౌక‌ర్యం ఇస్తారు. అయితే రెగ్యుల‌ర్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉండ‌డంతో అది కావాలంటే అదీ వాడుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు