4 జీ.. 4జీ..4జీ ప్రపంచాన్ని ఊపేస్తున్న పేరిది. ముఖ్యంగా భారత్‌లో లాంటి దేశంలో 4జీ సేవలు చాలా వేగంగా విస్తరించాయి. ఒకటి రెండేళ్లలోనే అనుకోని రీతిలో అందరికి చేరువైంది 4జీ. జియో లాంటి నెట్‌వర్క్‌ల పుణ్యమా అని 4జీ సేవలు చవక కూడా అయిపోయాయి. 4జీ అంటే ఏమిటి?.. వేగంగా డేటాను అందించేది. మరి దానికంటే వేగంగా డేటాను అందించే టెక్నాలజీ ఇంకా పుట్టలేదా? ... పుట్టింది దాని పేకు 5జీ. మరి ఇదెలా పని చేస్తుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
20 జీబీపీఎస్ డౌన్‌లోడ్‌తో..
4జీ కంటే వేగవంతమైంది 5జీ. 4జీలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ... తాజా అప్డేట్స్తో రాబోతోంది 5జీ. దీనిలో ఉన్న ప్రత్యేకత వేగం. డౌన్లోడ్ చేసే సామర్థ్యం. 20 జీబీపీఎస్ డౌన్లోడ్ చేయడం 5జీ ప్రత్యేకత. ఇది ఐఎంటీ అడ్వాన్సడ్ 4జీ కంటే 20 రెట్లు మెరుగైంది. 4జీతో మనం 10 ఎంబీపీఎస్ స్పీడ్‌ను ఎక్స్పీరియన్స్ చేశాం కానీ.. 5జీతో 100 ఎంబీపీఎస్ వేగాన్ని అందుకోవడం నిజంగా అమేజింగ్. ఇప్పుడు మామూలు నెట్వర్క్స్కు ఎల్టీఈ అడ్వాన్సడ్ నెట్వర్క్స్కు మధ్య ఉన్న అంతరాన్ని ఈ కొత్త టెక్నాలజీ తగ్గిస్తుంది. కొన్ని 5జీ ఫీచర్లు ఎల్టీఈ అడ్వాన్సడ్ ప్రొ ఎక్స్టెన్షన్లలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని వల్ల మొబిలిటీ సపోర్ట్ కూడా బాగా పెరుగుతుంది. 500 కి.మీ వ్యాసార్థంలో మిలియన్ యూజర్లకు సపోర్ట్ చేయడం 5జీ ప్రత్యేకత.
మంచి స్పెక్ట్రమ్ కావాలి
5జీ లాంటి అధునాతన టెక్నాలజీని లాంఛ్ చేయాలంటే కచ్చితంగా మంచి స్పెక్ట్రమ్ కావాలి. 5జీ స్టాండర్డ్స్‌ను తట్టుకునేలా ఆ క్యారియర్స్ ఉండాలి. ఇప్పుడు ఆ వేటే జరుగుతోంది. 5జీ స్టాండర్డ్‌కు తగ్గ క్యారియర్ దొరికితే త్వరలోనే మనకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. 6 గిగా హెట్జ్ గల హై ఫ్రీక్వెన్సీ బ్రాండ్ విడ్త్‌తో ఇది రావడమే దీనికి కారణం. 4జీ ఎల్టీఈ బ్యాండ్స్ స్థానంలో 5జీ న్యూ రేడియో టెక్నాలజీస్‌ను రాత్రికి రాత్రే సెట్ చేయడం సాధ్యం కాదు. అంతేకాదు ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 5జీ ఎన్ఆర్ను అన్ యూజ్డ్ సీఎం వేవ్, ఎంఎం వేవ్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించి తయారు చేశారు.