• తాజా వార్తలు

ప్రివ్యూ - తొలి బ్లాక్ చైన్ ఫోన్‌కి..తొట్ట‌ తొలి ప్రివ్యూ

ప్రపంచంలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్ల త‌యారీదారు అయిన హువావే టెక్నాల‌జీస్ లిమిటెడ్ (హాన‌ర్ ఫోన్ల త‌యారీ సంస్థ‌) స్మార్ట్‌ఫోన్ పోటీలో ఓ భారీ అడుగు వేయ‌బోతోంది.  బ్లాక్ చైన్ బేస్డ్ అప్లికేష‌న్స్‌మీద ర‌న్న‌య్యే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. ఇందుకోసం సిరిన్ ల్యాబ్స్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌కు బ‌దులుగా సిరిన్ ల్యాబ్స్ త‌యారుచేసిన సిరిన్ ఓఎస్ (SIRIN OS)ను ఈ ఫోన్‌లో వాడేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయని ఈ సంప్ర‌దింపుల్లో భాగ‌స్వాములైన వ్య‌క్తులు చెప్పారు. సంప్ర‌దింపులు ఇంకా ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉన్నాయని, ఎలాంటి అగ్రిమెంట్ జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. హువావే, సిరిన్ ల్యాబ్స్ ప్ర‌తినిధులు కూడా తాము క‌లిసిన విష‌యాన్ని ధృవీక‌రించారు. అయితే త‌ర్వాత విష‌యాలేవీ చెప్ప‌లేదు.


ఏమిటీ బ్లాక్ చైన్ టెక్నాల‌జీ?
బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో క‌రెన్సీ ట్రాన్సాక్ష‌న్ల‌ను రికార్డ్ చేయ‌డానికి వాడే టెక్నాల‌జీని బ్లాక్ చైన్ టెక్నాల‌జీ అంటారు. ఇది ప్ర‌స్తుతం చాలా కొద్దిమందికి మాత్ర‌మే అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో దాన్ని తీసుకురాగ‌లిగితే అంద‌రికీ అందుబాటులోకి వ‌స్తుంది. క్రిప్టో క‌రెన్సీ సాధార‌ణ క‌రెన్సీకి ప్ర‌త్యామ్నాయం కాద‌ని, అలాంటి ట్రాన్సాక్ష‌న్లు వ‌ద్ద‌ని గ‌వ‌ర్న‌మెంటు చెబుతోంది. ఈ మూడు నాలుగు నెలలుగా ఇది కొద్దిగా త‌గ్గుముఖం ప‌ట్టినా గ‌తేడాది కాలంలో క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్ష‌ గ‌త ఏడాది కాలంలో ఏకంగా 15 రెట్లు ఎక్కువ ట్రాన్సాక్ష‌న్లు జ‌రిగాయి.  వీటి విలువ 228 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు పైమాటే. ఇంత బిజినెస్ ట్రాన్సాక్ష‌న్లు స్టోర్ చేసుకునే టెక్నాల‌జీ కాబ‌ట్టే హువావే ఈ విష‌యంలో స్పీడ్‌గా వ‌ర్క‌వుట్ చేస్తోంది.


విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణే
ఇంత భారీట్రాన్సాక్ష‌న్ల‌ను రికార్డ్ చేయ‌డానికి వాడే బ్లాక్‌చైన్ టెక్నాల‌జీతో ఫోన్ వ‌స్తే స్మార్ట్‌ఫోన్ల‌లో అదో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణే అవుతోంది. అందుకే హువావే దీనిపై దృష్టి పెట్టింది. అంతేకాదు హువావేతో ఈ ఫోన్ త‌యారీకి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న సిరిన్ ల్యాబ్స్ కూడా సొంతంగా బ్లాక్ చైన్ టెక్నాల‌జీ బేస్డ్‌గా న‌డిచే స్మార్ట్‌ఫోన్‌ను డెవ‌ల‌ప్ చేస్తుంది. త‌న ఫిన్నే ఫోన్‌ను దాదాపు 67 వేల రూపాయ‌ల‌కు ఈ టెక్నాల‌జీతో తీసుకురాబోతోంది. వ‌చ్చే నాలుగునెల‌ల్లో మార్కెట్లోకి వ‌చ్చేఈ  ఫోన్‌కోసం ఇప్ప‌టికే 25వేల ప్రీ ఆర్డ‌ర్స్ కూడా బుక్క‌య్యాయి. ఈ ఫోన్‌లో కోల్డ్ స్టోరేజ్ క్రిప్టో వాలెట్ కూడా ఉండబోతోంది. ఇది మీ మ‌నీని ఆటోమేటిగ్గా డిజిట‌ల్ టోకెన్స్‌గా క‌న్వ‌ర్ట్ చేసేస్తుంది. అంతేకాదు డిజిట‌ల్ అసెట్స్‌ను ఆఫ్‌లైన్‌లో స్టోర్ చేసుకోవ‌డానికి కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ వాలెట్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
 

జన రంజకమైన వార్తలు