• తాజా వార్తలు
  •  

ఏమిటీ ఐఆర్‌సీటీసీ డెబిట్ కార్డ్స్‌?మ‌న‌కేంటి లాభం?

పూర్తిస్థాయిలో క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్ దిశ‌గా రైల్వే డిపార్ట్‌మెంట్ అడుగులు వేస్తోంది. త్వ‌ర‌లోనే  ఇండియ‌న్ రైల్వేస్ ఓన్‌బ్రాండ్ డెబిట్ కార్డ్‌లు రాబోతున్నాయి. ఇండియ‌న్ రైల్వేస్ ఎస్‌బీఐతో టైఅప్ చేసుకుని ఎస్‌బీఐ ఐఆర్‌సీటీసీ డెబిట్ కార్డులు  తీసుకొచ్చింది. వీటిని మామూలుగానే అన్నిట్రాన్సాక్ష‌న్ల‌కు వాడుకోవ‌చ్చు. ట్రైన్ టికెట్స్ బుక్‌చేసుకుంటే బుకింగ్స్‌పై స‌ర్వీస్ ఛార్జ్ ఉండ‌దు. 
 డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ ప్రోత్స‌హించ‌డానికి
డీమానిటైజేష‌న్ త‌ర్వాత డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ ప్రోత్స‌హించ‌డానికి ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్స్‌పై రైల్వే శాఖ స‌ర్వీస్ ఛార్జీని ర‌ద్దుచేసింది.   అయితే ఇది లాస్ట్ ఇయ‌ర్ వ‌ర‌కే. త‌ర్వాత  ఈ సంవ‌త్స‌రం మార్చి 31 వ‌ర‌కు ఈ ఆఫ‌ర్‌ను పొడిగించింది.  అయితే స‌ర్వీస్ ఛార్జీని ర‌ద్దుచేసినా ఆ అమౌంట్‌ను బ్యాంక్‌లకు రైల్వే పేచేయాలి. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు 600 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు  చేయాల్సి ఉంది. బ్యాంకుల‌ను కూడా కొంత డిస్కౌంట్ ఇమ్మ‌ని రైల్వే అడిగినా మేజ‌ర్ బ్యాంక్‌ల‌యిన ఐసీఐసీఐలాంటివి ఒప్పుకోలేదు. దీంతో  ఈ భారాన్ని ఎక్కువ‌కాలం మోయ‌లేమ‌ని రైల్వే  డిసైడ్ అయిపోయింది. అందుకే మార్చి 31 త‌ర్వాత స్లీప‌ర్ క్లాస్ టికెట్ మీద 20 రూపాయ‌లు, ఏసీక్లాస్ టికెట్ల‌పైన 40 రూపాయ‌లు స‌ర్వీస్ ఛార్జి వేయ‌నుంది. అయితే ఐఆర్‌సీటీసీ క్రెడిట్‌, డెబిట్ కార్డ్‌లు తీసుకుంటే ఎప్ప‌టికీ మీరు స‌ర్వీస్ ఛార్జి క‌ట్ట‌క్క‌ర్లేదు. అంటే  క‌నీసం ఒక టికెట్ తీసుకున్నా20 నుంచి 40 రూపాయ‌లు మిగిలిన‌ట్లే. దీంతోపాటు స్పెష‌ల్ లాట‌రీ కూడా తీస్తామ‌ని, గెలిచిన‌వారికి ట్రైన్ టికెట్స్ బుకింగ్‌పై 100% క్యాష్‌బ్యాక్ ఇస్తామ‌ని రైల్వేచెబుతోంది.
ఆధార్‌తో లింక్‌చేస్తే 12 టికెట్స్‌
మ‌రోవైపు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ను ఆధార్ నెంబ‌ర్‌తో లింక్ చేసుకోమ‌ని ఐఆర్‌సీటీసీ త‌న యూజ‌ర్లంద‌రికీ   మెయిల్ పంపించింది. ప్ర‌స్తుతం ఐఆర్‌సీటీసీ లాగిన్ ద్వారా నెల‌కు ఆరు టికెట్స్ మాత్ర‌మే బుక్‌చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ఆధార్‌తో ఐఆర్‌సీటీసీ అకౌంట్ లింక్ చేసుకుంటే నెల‌కు 12 టికెట్లు బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తామని ప్ర‌క‌టించింది.

జన రంజకమైన వార్తలు